వీడెవడ్రా బాబు..! హీరో విజయ్ సేతుపతిని కాలితో తన్నిన వ్యక్తి.. అందరూ షాక్
విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవల్లో ఓ రేంజ్ క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు దుబాయ్ లో అకౌంటెంట్.. కానీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలోనూ అదరగొట్టేసాడు.

లుక్స్ ముఖ్యం కాదు నటనే ముఖ్యం అని నిరూపించాడు స్టార్ హీరో విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్‌తోపాటు తెలుగు, హిందీలోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్. సినిమా రంగంలోకి రాకముందు విజయ్ చాలా కష్టమైన జీవితం గడిపాడు. ఇప్పుడు స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా ఆయన సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. సహజమైన నటనతో మక్కల్ సెల్వన్ గా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి దుబాయ్‌లో అకౌంటెంట్ గా చేశారు. తర్వాత ఇండియాకు వచ్చి ఓ థియేటర్ కంపెనీలో అకౌంటెంట్‌గా చేరారు.
ఆతర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను సక్సెస్ అయ్యారు. ఆతర్వాత ఇప్పుడు విలన్ గా మెప్పిస్తున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా చేస్తూ రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజగా విజయ్ సేతుపతికి సంబందించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి విజయ్ సేతుపతిని తన్నినట్టు కనిపిస్తుంది.
ఈ వైరల్ వీడియోలో విజయ్ సేతుపతి ఎయిర్ పోర్ట్ లో నడుస్తూ ఉండగా ఒక్క వ్యక్తి సడన్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది గమనించని విజయ్ అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తుండగా.. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎగిరి కాలుతో విజయ్ ను తన్నాడు. దాంతో విజయ్ పక్కన ఉన్న సిబ్బంది అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ వీడియో పాతది. ఇది జరిగి చాలా కాలం అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Ithu eppa nadanthathu..🥹🙄..
Enna @VijaySethuOffl sollave illa..🤭..
But it was a nice Kick 😉..#BiggBossTamil #BiggBossTamil8 #BiggBoss8Tamil #BiggBossTamilSeason8 #BiggBossTamil8Season #VijaySethupathi #VJS pic.twitter.com/XRtsMl31yo
— BiggBossTamil8 (@BigBossTamilOTT) January 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.