AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతని కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.. ఇప్పటికీ ఎదురుచూస్తున్నా.. శ్రీసత్య కామెంట్స్

తెలుగమ్మాయి శ్రీ సత్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెలు’, ‘త్రినయని’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిందీ అందాల తార. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అతని కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను.. ఇప్పటికీ ఎదురుచూస్తున్నా.. శ్రీసత్య కామెంట్స్
Sri Satya
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2025 | 11:03 AM

Share

బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయినా వారు చాలా మంది ఉంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత  చాలా మంది క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే కొంతమంది సినిమాల్లో అవకాశాలు కూడా సొంతం చేసుకున్నారు. అలంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హీరోయిన్స్ లుక్, ఆకట్టుకునే అందం ఉన్న అమ్మడే శ్రీ సత్య. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే ఈ చిన్నది బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. బిగ్ బాస్ 6లో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సీరియల్స్ లోనూ నటించి మెప్పించింది.

‘నిన్నే పెళ్లాడుతా’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెలు’, ‘త్రినయని’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిందీ అందాల తార. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించిన శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో తన అందంతో పాటు, ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. దాదాపు 103రోజుల వరకు హౌస్ లో ఆకట్టుకుంది ఈ చిన్నది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నదానికి అంతగా అవకాశాలు రాలేదు. దాంతో తిరిగి సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

రకరకాల వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం పలు టీవీ డ్యాన్స్ షోస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మొహబూబ్‌తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. రీసెంట్ గా కూడా ఓ వీడియో చేసింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో సత్య మాట్లాడుతూ.. “రామ్ పోతినేని కోసమే నేను సినిమాల్లోకి వచ్చాను. ఆయన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను. మళ్లీ ఆయనతో కలిసి నటించే అదృష్టం కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. గతంలో రామ్ పోతినేని అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. ఇప్పుడు మరోసారి రామ్ పోతినేని పై తనకు ఉన్న అభిమానాన్ని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..