Tollywood: వచ్చే 3 నెలల్లో రీ-రిలీజ్ అవ్వనున్న 6 బ్లాక్ బాస్టర్ సినిమాలు .. లిస్ట్ ఇదిగో
ప్రజంట్ హిట్ సినిమాల రి రిలీజ్ ట్రెండ్‌గా మారింది. ఆయా సినిమాలను రీ రిలిజ్ చేయాలని అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్టులు పెడుతున్నారు.

రఫ్‌గా ఇంకెన్ని ప్లాన్ చేస్తున్నారబ్బా.. వరసగా రీ రిలీజ్ అవుతున్న పాత సినిమాలను చూసాక ఆడియన్స్ అడుగుతున్న మాట ఇదే. ఎందుకంటే 2022లో పోకిరితో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పుడు పీక్స్‌కు చేరిపోయింది. ఎంతగా అంటే ప్రతీ హీరో తమ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో టాలీవుడ్‌లో 6 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. మరి అవి ఏంటో తెలుసుకుందాం పదండి. రీ రిలీజ్ అయిన సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూసాక.. మిగిలిన హీరోలకు నిద్ర పట్టడం లేదు. అరే.. మా సినిమాలేం పాపం చేసాయి.. మేమెందుకు పాత సినిమాలను విడుదల చేయకూడదు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే మరో అరడజన్ పాత సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాయి. ఈ లిస్టులో రవితేజ మిరపకాయ్ ముందుంది. జనవరి 26న మాస్ రాజా పుట్టిన రోజు సందర్భంగా మిరపకాయ్ రీ రిలీజ్ అవుతుంది.
2011 సంక్రాంతికి విడుదలైన మిరపకాయ్ సూపర్ హిట్ అయింది. షాక్ డిజాస్టర్‌తో డైలమాలో ఉన్న హరీష్ శంకర్ కెరీర్‌కు పునాది వేసిన సినిమా ఇది. మాస్ రాజా బర్త్ డే స్పెషల్‌గా దీన్ని మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్‌గా ఎప్రిల్ 7న దేశముదురు రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. అంతేకాదు.. దివంగత సూపర్ స్టార్ కృష్ణ క్లాసిక్ సినిమా సింహాసనం 8Kలో రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో తొలి 70 MM సినిమాగా వచ్చిన సింహాసనం రికార్డులు తిరగరాసింది. ఇదే సినిమాను నేటి జనరేషన్‌కు తగ్గట్లు 8Kలో అందించాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ సింహాద్రి సైతం రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. దీనికోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. 4Kలో సింహాద్రి రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
పవన్ కళ్యాణ్ బద్రి సైతం రీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఇప్పటికే జల్సా, తమ్ముడు, ఖుషీ లాంటి సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ చూసి.. బద్రిని కూడా భారీగానే విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇవి మాత్రమే కాదు.. చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ఇంద్ర సినిమాను సైతం 4Kలో రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు నిర్మాత అశ్వినీ దత్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి రీ రిలీజ్‌లు ఓకే.. మరి వీటికి రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
