AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela మళ్లీ స్పీడ్ పెంచిన టాలీవుడ్ బ్యూటీ.. వరుస సినిమాలతో బిజీబిజీ

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అనే పాట గుర్తుంది కదా..! హా.. గుర్తుంది గానీ ఈ పాట ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారో అది చెప్పండి ముందు అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.. ఈ పాట ఇప్పుడు ఓ హీరోయిన్‌కు బాగా అంటే బాగా సూట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఆ ఉదయం కోసం ఆమె ఎందుకు వెయిట్ చేస్తుందో చూద్దాం పదండి..

Sreeleela మళ్లీ స్పీడ్ పెంచిన టాలీవుడ్ బ్యూటీ.. వరుస సినిమాలతో బిజీబిజీ
Sreeleela
Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Rajitha Chanti|

Updated on: Dec 07, 2024 | 9:33 PM

Share

ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అనే పాట గుర్తుంది కదా..! హా.. గుర్తుంది గానీ ఈ పాట ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారో అది చెప్పండి ముందు అనుకుంటున్నారు కదా..? అక్కడికే వస్తున్నాం.. ఈ పాట ఇప్పుడు ఓ హీరోయిన్‌కు బాగా అంటే బాగా సూట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్..? ఆ ఉదయం కోసం ఆమె ఎందుకు వెయిట్ చేస్తుందో చూద్దాం పదండి..

ఇండస్ట్రీకి ఎలా వచ్చాం అనేది కాదు.. వచ్చాక వచ్చిన ఇమేజ్‌ను ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. అక్కడ తడబడితే క్రేజ్ ఉన్నా.. కెరీర్ ఖతమ్ అవుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు శ్రీలీల. 2023లో హై స్పీడ్ చూపించిన ఈ బ్యూటీ.. ఈ ఏడాది జోరు కాస్త తగ్గించారు. కానీ లేటెస్ట్‌గా మళ్లీ స్పీడ్ పెంచేసారు ఈ బ్యూటీ.

శ్రీలీల మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తుంది సీన్ చూస్తుంటే..! గుంటూరు కారం తర్వాత అనుకోకుండానే లాంగ్ బ్రేక్ తీసుకున్నారు ఈ బ్యూటీ. మధ్యలో చదువుల కోసమని ఏ సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం రవితేజతో చేస్తున్న మాస్ జాతర మాత్రమే సెట్స్‌పై ఉంది. దీంతో పాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా పూర్తి చేసారు శ్రీలీల. 2024ను గుంటూరు కారంతో స్ట్రాంగ్‌గా మొదలు పెట్టారు శ్రీలీల. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అందులో ఆమె కారెక్టర్ పేలింది. ఎంత బలంగా మొదలుపెట్టారో.. 2024ను అంతే బలంగా ముగిస్తున్నారు కూడా. పుష్ప 2లో కిసిక్ పాటతో దేశాన్ని ఊపేసిన ఈ బ్యూటీ.. డిసెంబర్ 20న రాబిన్ హుడ్‌తో వస్తున్నారు. 2025లో రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలు రానున్నాయి. వీటితో ఈమె ఫామ్‌లోకి వచ్చినట్లే.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.