TN Government: థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీపై వెనక్కి తగ్గిన తమిళనాడు ప్రభుత్వం..

థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు శుక్రవారం 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి ఆర్డర్‏ను ఉపసంహరించుకుంది.

TN Government: థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీపై వెనక్కి తగ్గిన తమిళనాడు ప్రభుత్వం..
Follow us

|

Updated on: Jan 08, 2021 | 7:26 PM

TN Government: థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు శుక్రవారం 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతి ఆర్డర్‏ను ఉపసంహరించుకుంది. కాగా ఈ నెల 4న 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. పూర్తి కెపాసిటీతో కాకుండా జనవరి 11 వరకు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపించుకోవచ్చని మాద్రాస్ హైకోర్టు ఆదేశించిన కాసేపటికే ఈ ఉత్తర్వు వచ్చింది. అటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని చెప్పిన ఒక రోజు తర్వాత తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గైడ్‏లైన్స్ అనుగుణంగానే సినిమా థియేటర్లలో మరియు మల్టిప్లెక్స్, షాపింగ్ మాల్స్‎లో కేవలం 50 శాతం ప్రేక్షకులకు అనుమతించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో 100 శాతం ఆక్యుపెన్సీ ఇవ్వడంపై న్యాయ స్థానం మరొకసారి పరిశీలిస్తుందని తెలిపింది. అలాగే రోజూ రోజూకి కరోనా ప్రభావం పెరుగుతుండాగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని పేర్కోంది. తమిళనాడు ప్రభుత్వం 100 శాతం ఆక్యూపెన్సీకి అనుమతినివ్వడం కేంద్ర హోం శాఖ అక్టోబర్‏లో వెల్లడించిన అన్‏లాక్ మార్గదర్శకాలకు విరుద్ధమని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాసింది. అందులో ఆ అనుమతులను ఉపసంహరించుకోవాలని పేర్కోంది. ఇక కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం థియేటర్లలో కేవడం 50 శాతం సీటింగ్ కెపాసిటికి మాత్రమే అనుమతినిచ్చింది.

100% ఆక్యుపెన్సీని అనుమతించే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయంపై వైద్య నిపుణులు మరియు డాక్టర్లు విమర్శించారు. పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్)లో పనిచేసే రెసిడెంట్ డాక్టర్ అరవింద్ శ్రీనివాస్ రాసిన తమిళనాడు ప్రభుత్వానికి, నటులు విజయ్, శింబులకు రాసిన బహిరంగ లేఖ తీవ్ర దుమారం రేపింది. “ ఈ మహమ్మారి ఇంకా అంతం కాలేదు. ఈ రోజు వరకు ప్రజలు కరోనా భారీన పడుతున్నారు. వంద శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నిర్ణయం ఆత్మహత్యాయత్నం లాంటిది” అని ఆయన రాశారు.

Also Read: Aravind Swamy: థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయంపై అరవింద్ స్వామి కామెంట్.. మండిపడుతున్న నెటిజన్లు..