Mail Pre Release Live Updates : ‘కంబాలపల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్’ ప్రీ రిలీజ్ వేడుక…
స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘కంబాలపల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్’ను...

Mail Pre Release : స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాతలుగా ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘కంబాలపల్లి కథలు’లో మొదటి భాగంగా ‘మెయిల్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ వెబ్ సిరీస్ ఛాప్టర్ 1 ‘మెయిల్’ను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.
LIVE NEWS & UPDATES
-
‘మెయిల్’ షార్ట్ ఫిలిం అనుకున్నాం… ఆ తర్వాత మారిపోయింది
కరోనా సమయంలో గ్రామాల్లో అనుమతి ఇచ్చిన అక్కడి ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు అని ‘మెయిల్’ డైరెక్టర్ ఉదయ్ తెలిపారు. ముందుగా షార్ట్ ఫిలిం అనుకున్నాం.. ఆ తర్వాత ఇది మార్పులకు గురైంది.
-
న్నాన్నగారు ఇచ్చిన సలహాతో జాగ్రత్తగా చేశాను..-స్వప్న
నాన్నగారు చెప్పిన సలహాతో ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీశామని స్వప్న అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ తనకు ఇచ్చిన అద్భుతమైన అవశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ‘కంబాలపల్లి కథలు’ ఇంట్లో ఉన్న అంతా కలిసి చూసే అవకాశం ఈ సినిమాతో దక్కుతుంది. ఈ చిన్న మెయిల్… ఆహాకు పెద్ద ఎత్తున సబ్ స్క్రైబర్స్ ను తెచ్చిపెడుతుందని ప్రియదర్శి అన్నారు.
-
-
‘ఆహా’ అద్భుతమైన విజయం- నిర్మాత అశ్విని దత్
కోవిడ్ ఎఫెక్ట్ తో వెబ్ సిరీస్ ను మన తెలుగులో రావడం చాలా గ్రేట్ అని నిర్మాత అశ్విని దత్ తెలిపారు. ఆహాను ఎప్పుడైతే అల్లు అరవింద్ తీసుకున్నారో .. ఇది సౌత్ ఇండియాలోనే కాదు భారత దేశంలో కూడా విజయం సాధిస్తుందని అన్నారు.
-
వరంగల్ సమీపం నుంచి దూసుకొస్తున్న ‘కంబాలపల్లి కథలు’ మెయిల్ ఆహా వెబ్‌సిరీస్…
‘కంబాలపల్లి కథలు’ పేరుతో దూసుకొస్తోంది. ఉదయ్ గుర్రాల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ వెబ్ సిరీస్‌లో హైబత్ అనే పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నాడు. కంబాలపల్లి అనేది వరంగల్ సమీపంలోని ఓ కుగ్రామం. దీంతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
-
వైజయంతీ మూవీస్ అనుబంధం సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్‌లో..
ఇటీవల కాలంలో సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లకు ఆదరణ పెరిగింది. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ సినిమా నటులు, టెక్నీషియన్స్ డిజిటల్ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అనుబంధం సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్‌లో ఓ వెబ్ సిరీస్ నిర్మితమవుతోంది. దీనిలో ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి నటిస్తున్నాడు.
-
-
‘కంబాలపల్లి కథలు’ వెబ్ సిరీస్ .. ప్రత్యేక శైలితో దూసుకుపోతున్న ప్రియదర్శి బుల్లితెర…
కొత్త తరం హాస్యనటుల్లో తనకంటూ ఓ ప్రత్యేక శైలితో దూసుకుపోతున్న ప్రియదర్శి బుల్లితెరపై సందడి చేయనున్నాడు. కంబాలపల్లి కథలు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
-
‘మెయిల్’ ట్రైలర్ ప్రీ రిలీజ్‌ను అల్లు అరవింద్ లాంచ్ చేశారు
వెబ్ సిరీస్ ‘కంబాలపల్లి కథలు ‘మెయిల్’ ట్రైలర్ ప్రీ రిలీజ్‌ను నిర్మాత అల్లు అరవింద్ లాంచ్ చేశారు. నిర్మాత అశ్విని దత్ నా మిత్రుడు.. అంతే కాదు ఇద్దరం కలిసి సినిమాలు కూడా చేసినట్లుగా అరవింద్ చెప్పుకొచ్చారు. స్వప్నను తాను అడిగిన వెంటనే ఐ విల్ డూ ఇట్ అంటూ అంగీకరించింది. స్వప్న బ్యానర్‌లో వచ్చిన సినిమాలు మంచి సినిమాలు వచ్చాయి. ఈ కాన్సెప్ట్ యూనిక్ ఉంది. కోవిడ్‌తో కొద్దిగా ఆలస్యం అయ్యంది.
Published On - Jan 08,2021 7:26 PM