హీరో విడాకుల వెనుక అమలా, గుత్తా.. నటుడు ఏమన్నాడంటే..!

హీరో విడాకుల వెనుక అమలా, గుత్తా.. నటుడు ఏమన్నాడంటే..!

రెండేళ్ల క్రితమే ఆ నటుడికి విడాకులు అయ్యాయి. అయితే ఆ విడాకుల వెనుక నటి అమలా పాల్, క్రీడాకారిణి గుత్తా జ్వాల ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 14, 2020 | 4:09 PM

రెండేళ్ల క్రితమే ఆ నటుడికి విడాకులు అయ్యాయి. అయితే ఆ విడాకుల వెనుక నటి అమలా పాల్, క్రీడాకారిణి గుత్తా జ్వాల ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గాసిప్‌లపై తాజాగా స్పందించి వివరణ ఇచ్చారు ఆ హీరో.

అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్, రజిని నట్‌రాజ్‌తో 2018లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడాకుల వెనుక అమలాపాల్, గుత్తా జ్వాల ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అమలాపాల్‌తో విష్ణు విశాల్ రాట్చసన్‌ అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ తరువాతే ఈ హీరో విడాకులు తీసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి అమలాపాల్‌ కారణమని అప్పట్లో కోలీవుడ్ మీడియాలో టాక్ నడిచింది. ఇక ఆ తరువాత గుత్తా జ్వాలతో విష్ణు డేటింగ్ చేస్తున్నాడని వార్తలు రాగా.. హీరో విడాకులకు ఆమే కారణమంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా వాటిపై స్పందించారు విష్ణు. అమలాతో నటించిన తరువాత విడాకులు తీసుకోవడం.. ఆ తరువాత గుత్తా జ్వాలతో తాను రిలేషన్‌లో ఉండటం వలన ఈ పుకార్లు పుట్టుకొచ్చాయని.. కానీ వారిద్దరికి అసలు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టతను ఇచ్చారు. తన విడాకులకు అసలు కారణమేంటో చెప్పలేనని.. ఎందుకంటే అది తనకు చాలా వ్యక్తిగతమని విష్ణు పేర్కొన్నారు.

Read This Story Also: ఎన్టీఆర్‌ విలన్‌గా బాలీవుడ్ స్టార్ నటుడు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu