Tollywood Actress: ఇండస్ట్రీలో అత్యంత చదువుకున్న హీరోయిన్స్ వీరే..
తమ అభిమాన హీరోయిన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో నిత్యం తమ అభిమాన హీరోయిన్స్ ఫోటోలను , వీడియోలతో పాటు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలో అత్యంత చదువుకున్న హీరోయిన్ గురించి ఇప్పుడు వైరల్ అవుతుంది.

సౌత్ సినిమాల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. ముఖ్యంగా మన సౌత్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులను గెలుచుకుంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు, సినిమా లవర్స్ సౌత్ సినిమాలకోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా అభిమానులు సాధారణంగా తమ అభిమాన నటులు, నటీమణుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఆ విషయంలో, దక్షిణ భారత సినిమాల్లోని ప్రముఖ నటీమణులలో అత్యంత చదువుకున్న నటీమణులు ఎవరో ఓ లుక్కేద్దాం..
సాయి పల్లవి: ఇక్కునార్ అల్ఫోన్స్ పుతిరన్ దర్శకత్వం వహించిన ప్రేమమ్ చిత్రంతో సాయి పల్లవి మలయాళ సినిమాలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో నటుడు నివిన్ పౌలీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమె మలర్ టీచర్ పాత్రను పోషించి మలయాళ సినిమానే కాకుండా దక్షిణ భారత సినిమా అభిమానులను కూడా ఆకర్షించింది. ఆతర్వాత తెలుగులోకి ఫిదా సినిమాతో అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో బిజీ నటిగా ఉంది ఈ అమ్మడు. కాగా కోయంబత్తూరులో పాఠశాల విద్యను పూర్తి చేసింది పల్లవి. జార్జియాలో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి, సినిమా పట్ల ఉన్న మక్కువ కారణంగా ఆమె హీరోయిన్ గా మారింది.
రష్మిక మందన్న: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ రష్మిక మందన్న. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది. ఇక ఈ అమ్మడు బెంగళూరులో ఎం.ఎస్. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం అలాగే ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
ఐశ్వర్య లక్ష్మి: నటి ఐశ్వర్య లక్ష్మి 2019లో విశాల్ నటించిన యాక్షన్ చిత్రంతో తమిళ సినిమాలో అడుగుపెట్టింది. ఈ సినిమాతో ప్రేక్షకులపై పెద్దగా ముద్ర వేయకపోయినా, 2021లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన జగమే తంతిరం సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటి ఐశ్వర్య లక్ష్మి తమిళ చిత్రాలైన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్, పార్ట్ టూ, మట్టి కుస్తీలలో తన పాత్రలతో అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అతను కాలేజీలో మెడిసిన్ చదివిందన్న విషయం చాలా మంది అభిమానులకు తెలియదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..