‘హీరోలను పొగడడానికే హీరోయిన్లు’ సౌత్ సినిమాలపై జ్యోతిక సంచలన కామెంట్స్
కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చిన జ్యోతిక, బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తోంది. జ్యోతిక మొదటి చిత్రం డోలీ సజా కే రహ్నా, ఇది 1998లో హిందీలో విడుదలైంది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈమె మళ్లీ హిందీ చిత్రాల్లో నటించడం స్టార్ట్ చేసింది. ఇటీవలే ఆమె నటించిన డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఇందులో ధూమపానం చేసే సన్నివేశాల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది జ్యోతిక. ఈ సిరీస్ కోలమావు కోకిల చిత్రం ఆధారంగా రూపొందింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతూ మంచి ఆదరణ అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న జ్యోతిక సౌత్ ఇండస్ట్రీ పై.. ఆ ఇండస్ట్రీలో పని చేసే మేకర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ లో దాదాపు 80 శాతం తారాగణం మహిళలే ఉన్నారని చెప్పిన జ్యోతిక దక్షిణాది చిత్రాల్లో మాత్రం అమ్మాయిలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదన్నట్టు మాట్లాడింది. దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా హీరోలను ప్రధానంగా చూపిస్తూ.. సినిమాల్లో వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని చెప్పింది. అయితే ఇప్పుడిప్పుడే సినీరంగంలో మార్పులు వస్తున్నాయని.. ఇటు హిందీలోనూ మార్పు వచ్చిందని చెప్పింది. దక్షిణాది చిత్రాల్లో హీరోల పాత్రలను బలంగా క్రియేట్ చేస్తారని.. కానీ హీరోయిన్స్ అంటే కేవలం డ్యాన్స్ చేయడానికి.. హీరోలను పొగడడానికి మాత్రమే తీసుకుంటారని చెప్పుకొచ్చింది జ్యోతిక . ఇప్పటికీ అదే పద్దతి కొనసాగుతుందని.. అలాంటి సినిమా అవకాశాలు తనకు చాలా వచ్చాయని చెప్పింది జ్యోతిక.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్మగ్లింగ్‌తో నెలకు రూ.3 కోట్ల ఆదాయం! ఈమె హీరోయిన్ కాదు.. జగత్ కిలాడీ
Chiranjeevi: చెల్లెలి మరణాన్ని తలుకుచుని.. ఎమోషనల్ అయిన చిరు
బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్ బ్లాక్

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
