Chiranjeevi: చెల్లెలి మరణాన్ని తలుకుచుని.. ఎమోషనల్ అయిన చిరు
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా ఉమెన్స్ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది. అందులో తల్లి అంజనాదేవి, సోదరీమణులు, తమ్ముడు నాగబాబుతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వీడియోలో తన జీవితానికి సంబంధించిన అనేక విశేషాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తమ జీవితంలో ఎదురైన భావోద్వేగ పరిస్థితులను సైతం వివరించారు.
“మేము ఇప్పుడు ఐదుగురం ఉన్నాము.. కానీ మరో ముగ్గురు బిడ్డలు మాత్రం చిన్న వయసులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగంతో బిజీగా ఉన్నప్పుడు అమ్మ మాత్రమే ఇంట్లో పనులన్నీ చూసుకునేవారు. దీంతో అమ్మకు పనుల్లో సాయం చేస్తుండేవాడిని. గృహిణిగా అమ్మ అన్ని బాధ్యతలు ఒక్కరే చూసుకునేవారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు రమ అని చెల్లెలు ఉండేది. ఒకసారి తను అనారోగ్యానికి గురైంది. దాంతో తనను నేను, అమ్మ కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాం. నాన్నకు ఈ విషయం తెలియదు. రెండు రోజుల తర్వాత చనిపోవడంతో ఆమెను చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాం. చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం అందించాం. కానీ ఆయన వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తుకు వస్తుంటాయి. అప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది” అంటూ ఎమోషనల్ అయ్యారు చిరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే మీ అకౌంట్ బ్లాక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

