Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. మారుతి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు లీక్‌..

Prabhas: బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియ హీరోగా మారారు ప్రభాస్‌. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్‌గా ఉన్న ప్రభాస్‌ బాహుబలితో ఇంటర్నేషనల్‌ హీరోగా మారారు...

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. మారుతి సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు లీక్‌..
Prabhas Maruthi Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 29, 2022 | 9:07 AM

Prabhas: బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా పాన్‌ ఇండియ హీరోగా మారారు ప్రభాస్‌. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్‌గా ఉన్న ప్రభాస్‌ బాహుబలితో ఇంటర్నేషనల్‌ హీరోగా మారారు. దీంతో ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రభాస్‌ నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు అది ఇండియా వ్యాప్తంగా వార్తగా మారే పరిస్థితి వచ్చింది. బాహుబలి తర్వాత సాహో, రాదేశ్యామ్‌ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను పట్టాలెక్కిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌, ఓం రౌత్‌తో ఆదిపురుష్‌, సందీప్‌ వంగతో స్పిరిట్‌.. ఇలా మూడు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన డార్లింగ్‌ తాజాగా మారుతి సినిమాకు కూడా ఓకే చెప్పేశాడు. మొదట్లో ప్రభాస్‌-మారుతి సినిమాపై వచ్చిన వార్తలను ఎవ్వరూ నమ్మలేదు. కానీ తర్వాత వచ్చిన ప్రకటనల నేపథ్యంలో వీరి కాంబినేషన్‌ కాన్ఫామ్‌ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. నవంబర్‌ నుంచి సెట్స్‌ మీదికి ఈ సినిమాను తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా హారర్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కించనున్నట్లు సమాచారాం. ప్రభాస్‌ కెరీర్‌లోనే ఇలాంటి నేపథ్యంలో వస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఇందులో డార్లింగ్‌ జోడిగా ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించనున్నారనది మరో వార్త. అలాగే ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బొమన్‌ ఇరానీ దెయ్యం పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, మారుతి మార్క్‌ కామెడీ కూడా ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే సినిమాకు సంబంధించి అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి