‘నిశ్శబ్దం’లో బిగ్‌ ట్విస్ట్ అతడేనా..!

అనుష్క నటించిన నిశ్శబ్దం విడుదలకు సిద్ధంగా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం అమెజాన్‌లో విడుదల కానుంది

  • Tv9 Telugu
  • Publish Date - 11:21 am, Mon, 28 September 20
'నిశ్శబ్దం'లో బిగ్‌ ట్విస్ట్ అతడేనా..!

Anushka Nishabdham movie: అనుష్క నటించిన నిశ్శబ్దం విడుదలకు సిద్ధంగా ఉంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం అమెజాన్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో వేగాన్ని పెంచింది మూవీ యూనిట్‌. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చెబుతూ.. మూవీపై హైప్‌ని మరింత పెంచుతున్నారు. అయితే ఎక్కడా మాధవన్ పాత్రకి సంబంధించిన వివరాలను ఎక్కువగా వెల్లడించలేదు.

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీలో బిగ్‌ ట్విస్ట్ మాధవన్ అని తెలుస్తోంది. ఇందులో అనుష్క లవ్ ఇంట్రస్ట్‌గా మాధవన్‌ నటించారు. గిటారిస్ట్‌గా మాధవన్ కనిపించనుండగా.. బిగ్‌ ట్విస్ట్‌ కూడా అతడేనని టాక్. అందుకే ఈ పాత్ర గురించి పెద్దగా ఎక్కడా రివీల్ చేయడం లేదని సమాచారం.

ఇక థ్రిల్లర్‌ హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క మూగ, చెవుడు ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో విడుదల కానుండగా.. మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో డబ్ అవ్వనుంది.

Read More:

Corona India Updates: దేశంలో 60 లక్షలు దాటేసిన కేసుల సంఖ్య

చంద్రబాబు ఇంటికి వరద ప్రమాద హెచ్చరిక