AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ రిలీజ్ చేసిన చైతు

టాలీవుడ్ వర్థమాన హీరో రాజ్‌ త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ను అక్కినేని నాగ చైతన్య చేతులమీదుగా రిలీజ్ చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ లా కట్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పండించేలా సాగింది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ ఈ […]

రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ రిలీజ్ చేసిన చైతు
Venkata Narayana
|

Updated on: Sep 28, 2020 | 11:26 AM

Share

టాలీవుడ్ వర్థమాన హీరో రాజ్‌ త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన సినిమా ‘ఒరేయ్ బుజ్జిగా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ను అక్కినేని నాగ చైతన్య చేతులమీదుగా రిలీజ్ చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ లా కట్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పండించేలా సాగింది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ ఈ సినిమా తెరక్కిస్తున్నారు.

లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై నిర్మితమైంది ఈ సినిమా. ‘ఏమైంది ఈ వేళ‌’, ‘బెంగాల్ టైగ‌ర్‌’ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌ గా కార్తి ‘ఖైదీ’ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్. హీరోయిన్ హెబ్బా ప‌టేల్ ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తోంది.