AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్! ఆస్పత్రికి తరలింపు!

బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా మంది ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. మన దేశంలో మొదట బాలీవుడ్ లో మొదలైన ఈ రియాలిటీ షో ఆ తర్వాత అన్ని ఇండస్ట్రీలకు పాకేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ.. ఇలా ప్రముఖ భాషల్లో బిగ్ బాస్ షో సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది.

Bigg Boss: బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్! ఆస్పత్రికి తరలింపు!
Bigg Boss Reality Show
Basha Shek
|

Updated on: Oct 04, 2024 | 10:54 AM

Share

బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా మంది ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. మన దేశంలో మొదట బాలీవుడ్ లో మొదలైన ఈ రియాలిటీ షో ఆ తర్వాత అన్ని ఇండస్ట్రీలకు పాకేసింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ.. ఇలా ప్రముఖ భాషల్లో బిగ్ బాస్ షో సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఇక ఇటీవలే బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 గ్రాండ్ గా ప్రారంభమైంది. స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా వ్యహరిస్తోన్న ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 లో అపశ్రుతి చోటు చేసుకుంది. టాస్క్ లో భాగంగా దురదృష్టవశాత్తూ ఇద్దరు కంటెస్టెంట్లు గాయపడ్డారని తెలుస్తోంది. వీరిని ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. టాస్క్‌లో ప్రమాదం జరగడంతో త్రివిక్రమ్ తో పాటు గోల్డ్ సురేశ్ గాయపడ్డారని సమచారం. దీంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం ఆందోళనకు గురైంది. వీరు త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరినీ రెండు గ్రూపులుగా విభజించాడు బిగ్ బాస్.

అయితే టాస్క్ లో భాగంగా బంతితో పరుగెత్తుతున్న త్రివిక్రమ్ ఉన్నట్లుండి కిందపడిపోయాడు. దీంతో అతడిని కన్ఫెషన్ రూమ్‌కి తీసుకురావాలని బిగ్ బాస్ సూచించాడు. త్రివిక్రమ్ ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అదేవిధంగా ఇదే టాస్క్ లోనే గోల్డ్ సురేష్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం. కాగా బిగ్ బాస్ కన్నడ సీజన్ కు సంబంధించి కంటెస్టెంట్స్ గాయపడడం ఇదేమీ మొదటి సారి కాదు. గత సీజన్ లో కూడా కొందరు కంటెస్టెంట్స్ గాయాల పాలయ్యారు. ఒక లేడీ కంటెస్టెంట్స్ కు అయితే కన్ను దెబ్బతింది. మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్, గోల్డ్ సురేష్ బిగ్ బాస్ ప్రారంభమైన మొదటి వారంలోనే ఆసుపత్రిలో చేరారు.

ఇవి కూడా చదవండి

 బిగ్ బాస్ కన్నడ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.