Bigg Boss: 800 చీరలు.. 50 కిలోల నగలు.. 9 సూట్‌కేసులతో బిగ్ బాస్ హౌస్‌లోకి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఏం చేస్తుంటుంది?
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఏం ఆలోచిస్తారు? ఆడియెన్స్ ను ఎలా ఎంటర్ టైన్ చేయాలి? గేమ్స్ లు , టాస్కుల్లో ఎలా గెలుపొందాలి? అనే విషయాలపై ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఈ అందాల తార మాత్రం తన రాయల్ లుక్ తో హౌస్ లో హైలెట్ గా నిలుస్తోంది.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. త్వరలోనే తెలుగు లోనూ సీజన్ 9 ప్రారంభం కానుంది. అలాగే తమిళ్, కన్నడ బిగ్ బాస్ షోలు కూడా మరికొన్ని రోజుల్లో షురూ కానున్నాయి. ఇక ఇప్పటికే మలయాళం, హిందీ భాషల్లో బిగ్ బాస్ షో రంజుగా సాగుతోంది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 19 హోరా హోరీగా సాగుతోంది. ఎప్పటిలాగే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, అరుపులు, కేకలతో హౌస్ దద్దరిల్లిపోతుంది. టాస్కల్లో ఒకరిపై మరొకరు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు కంటెస్టెంట్స్ తహతహలాడుతున్నారు. అయితే ఇవన్నిటిని పక్కన పెట్టి ఒక అందాల తార మాత్రం తన రాయల్ లుక్ తో హౌస్ లో హైలెట్ అవుతోంది. ఆవిడే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ తాన్య మిట్టల్. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 కంటెస్టెంట్స్ లో ఒకరన ఆమె బిగ్‌బాస్ హౌస్‌కి ఏకంగా 800 చీరలు తీసుకెళ్లింది. అంతే కాదు, 50 కిలోల నగలను సైతం పట్టుకెళ్లిందట! ఇంత ఆర్భాటం ఎందుకన్న ప్రశ్నకు.. ‘నా లగ్జరీలను నేనెందుకు వదిలేసుకోవాలి? నా చీరలు, నగలు అన్నీ నాతోపాటే తీసుకెళ్తాను. హౌస్ లో రోజుకు మూడు చీరలైనా కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని హౌస్ లోకి రాక ముందే ముందే చెప్పింది. వీటితో పాటు తన వెండి వస్తువులను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లిందీ అందాల తార.
తాన్యామిట్టల్ విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ లోన గ్వాలియర్ లో పుట్టి పెరిగింది. కేవలం 19 ఏళ్ల వయసులో రూ. 500తో ‘హ్యాండ్‌మేడ్ లవ్ బై తాన్య’ పేరిట హ్యాండ్‌బ్యాగ్, నగల బిజినెస్ ప్రారంభించింది. బాగా డబ్బులు రావడంతో ఇందులో చీరలు అమ్మడం కూడా ప్రారంభించింది. 2018లో మిస్ ఆసియా టూరిజం యూనివర్స్ టైటిల్ గెలిచిన తాన్యా మిట్టల్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. బిజినెస్, యాడ్స్ ద్వారా ఈ బ్యూటీ నెలకు సుమారు రూ.6 లక్షలకు పైగానే సంపాదిస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో తాన్యా మిట్టల్..
She is someone who can make her point without chilaana and chikhna ,and the way she is taking a stand for herself ,I am in love with this girl !! Go girll ,make them cry loud !!#TanyaMittal #BB19 #BiggBoss19 pic.twitter.com/nbKlXetON4
— .Shivani Rai.🪻 (@blinking_hasi) September 1, 2025
గతంలో మహా కుంభ్‌మేళా సమయంలో జరిగిన తొక్కిసలాటపై ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది తాన్య. ఆ వీడియోలో ఆమె తన అనుభవాలను, ఆ ఘటనలో బాధితులకు ఎలా సహాయం చేశారో వివరించింది. ఈ ఎమోషనల్ వీడియో వైరల్ కావడంతో ఈ బిగ్ బాస బ్యూటీకి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే క్రేజ్ తో హౌస్ లోకి అడుగు పెట్టింది.
Tanya is completely right for not cleaning Smoking area !!
That area is not belongs to everyone, it’s only for smokers, so who smoke, they should be responsible to clean it out and no one has rights to stop the food for anyone.. #Biggboss19 | #BB19 | #TanyaMittal pic.twitter.com/tkQ7ci8ALl
— Vivek Keshwani (@i_amvivek_) September 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








