Dhanush: పాన్ ఇండియా మూవీ ప్లాన్ లో స్టార్ హీరో ధనుష్.. డైరెక్టర్ అతడేనా ..?
తమిళ్ స్టార్ హీరో ధనుష్ కన్ను పాన్ ఇండియా సినిమాల పైనే పడింది. ఇప్పటికే హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్ కూడా ఓ సాలిడ్ పాన్ ఇండియా మూవీని చేయాలని చూస్తున్నాడు..
Dhanush: తమిళ్ స్టార్ హీరో ధనుష్ కన్ను పాన్ ఇండియా సినిమాల పైనే పడింది. ఇప్పటికే హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్ కూడా ఓ సాలిడ్ పాన్ ఇండియా మూవీని చేయాలని చూస్తున్నాడు. ధనుష్ ఇప్పటికే బాలీవుడ్ లో సినిమాలు చేసాడు.. అలాగే హాలీవుడ్ లోనూ ఓ సినిమా చేస్తున్నాడు . భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్ తో పాటు తమిళం మరియు తెలుగు సినిమాలను కూడా ధనుష్ చేస్తున్నాడు. ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్. అలాగే వెంకీ అట్లూరు డైరెక్షన్ లో కూడా ఓ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది .
ప్రస్తుతం ధనుష్ చేతిలో నాలుగు అయిదు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. తన ప్రతి సినిమా విషయంలో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ లో కూడా డైరెక్ట్ సినిమా చేసి మెప్పించిన ధనుష్ ముందు ముందు పాన్ ఇండియా స్టార్ రేంజ్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆ దిశగా అడుగులువేస్తున్నాడు. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా భారీ రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మునుపెన్నడూ చూడని విధంగా ధనుష్ ను ఈ సినిమాలో చూపించనున్నాడట వెంకీ. మరి ధనుష్ పాన్ ఇండియా ప్లాన్ కు తెలుగు సినిమాలు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :