RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ ఫోటో వైరల్.. భీమ్‌ని విడిపించిన రామరాజు.. ఈ సన్నివేశం ఎప్పుడు అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి

Surya Kala

Surya Kala |

Updated on: Jul 20, 2021 | 6:58 PM

RRR Photo Viral: దక్షిణాదిలో భారీ మల్టీస్టారర్ మూవీగా రికార్డ్ కెక్కింది ఆర్ఆర్ఆర్ .. బాహుబలి సినిమా తర్వాత జక్కన్న మెగా నందమూరి హీరోలకు ఒకే ఫేమ్ లో చూపిస్తూ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ ఫోటో వైరల్.. భీమ్‌ని విడిపించిన రామరాజు.. ఈ సన్నివేశం ఎప్పుడు అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి
Rrr Movie

RRR Photo Viral: దక్షిణాదిలో భారీ మల్టీస్టారర్ మూవీగా రికార్డ్ కెక్కింది ఆర్ఆర్ఆర్ .. బాహుబలి సినిమా తర్వాత జక్కన్న మెగా నందమూరి హీరోలకు ఒకే ఫేమ్ లో చూపిస్తూ.. తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం మెగా,నందమూరి అభిమానులే కాదు .. యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకేలకు.. రెండు పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే రాజమౌళి..మంచి దర్శకుడే కాదు.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తూ.. బజ్ క్రియేట్ చేసే తెలివైన వ్యక్తి కూడా.. సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు చిత్ర బృందం సరికొత్త అప్డేట్ ఇస్తూ.. ఎన్ని నెలలకు సినిమా రిలీజైనా అది చూడాలి అనే ఫీలింగ్ ను అలా పట్టి ఉంచే నేర్పు రాజమౌళి సొంతం.

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కుమురం భీంగా నటిస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో ఎన్టీఆర్ ను ఒక ప్లేస్ లో కట్టేసి ఉండగా.. రామ్ చరణ్ వచ్చి విడిపించాడు. ఈ ఫోటోను ఇద్దరు హీరో అభిమానులు షేర్ చేస్తూ.. సినిమా రిలీజే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యింది.. ఈ విషయం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇప్పటికే రెండు భాషల్లో డబ్బింగ్‌ పూర్తిచేశారు. ఇతర భాషలకి త్వరలోనే డబ్బింగ్‌ చెప్పనున్నారని చిత్ర బృదం తెలిపింది. అంతేకాదు పోస్ట్ పొడక్షన్ వర్క్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, విడుదల తేదీని ప్రకటించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరీస్‌ నాయికలు. అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు. సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ను డి. వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Also Read: ఇంటి అద్దె కట్టలేక బైక్ అమ్ముకున్న హీరో.. ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగిన వైనం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu