Tv Actress : పెళ్లి చేసుకోబోతున్న సీరియల్ బ్యూటీ.. హాల్దీ ఫంక్షన్ వీడియో షేర్ చేసిన బుల్లితెర నటి..
ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఈమధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా కన్నడ, మలయాళం, తమిళ సినిమా ప్రపంచానికి చెందిన తారలు సీరియల్స్ చేస్తున్నారు. అందంతోపాటు తమ నటనతో సినీప్రియులను అలరిస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ హీరోయిన్ పెళ్లి చేసుకోబుతున్నారు. తన హల్దీ ఫంక్షన్ వీడియోను షేర్ చేశారు.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దీప్తి మన్నె. జీ తెలుగులో రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జగద్ధాత్రి సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఆనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకు దగ్గరైంది దీప్తి మన్నె. తాజాగా ఈ అమ్మడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. గత నెలలో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతుంది. తన ప్రియుడు రోహన్ తో కలిసి ఏడడుగులు వేయనుంది. ఇటీవలే పెళ్లి పనులు షూరు కాగా.. తాజాగా హల్దీ సెలబ్రేషన్స్ వీడియోను షేర్ చేసింది. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో హల్దీ వేడుకలు ఘనంగా జరిగినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..
హల్దీ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన దీప్తికి నెటిజన్స్, సన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బెంగుళూరుకు చెందిన దీప్తి మన్నె.. మొదట్లో కన్నడ భాషలలో పలు సీరియల్స్ చేసింది. అదే సమయంలో కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. రాధమ్మ కూతురు సీరియల్ ద్వారా తెలుగు టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు జగద్ధాత్రి సీరియల్ లో నటిస్తుంది. అంతకు మందు పద్మవతి సీరియల్ సైతం చేసింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
కేవలం సీరియల్స్ మత్రమే కాకుండా తెలుగులో సినిమాలు సైతం చేసింది. సెలవ్ అనే సినిమాలో నటించి మెప్పించింది. గత నెలలో ప్రియుడిని పరిచయం చేస్తూ కొన్ని ఫోటోస్ షేర్ చేసిన దీప్తి.. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయని చెబుతూ హల్దీ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం దీప్తి షేర్ చేసిన వీడియో తెగ వైరలవుతుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..




