Bigg Boss 9 Telugu: నువ్వు మాములోడివి కాదు భయ్యో.. హౌస్‌మేట్స్‌ను ఆటాడుకున్న సుమన్ శెట్టి..
బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షోపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ అదే స్థాయిలో జనాలు ఆదరిస్తున్నారు. టీవీ రంగంలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటూ సక్సెస్ అవుతుంది ఈ షో.

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ కాగా.. 9వ సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. ఈసారి హౌస్ లోకి ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్కు కోసం సీక్రెట్ టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటికే దివ్య, సుమన్ శెట్టి రెబల్స్ గా రెండు టాస్కులు కంప్లీట్ చేసి.. కళ్యాణ్, నిఖిల్ ఇద్దరినీ కెప్టెన్సీ రేసు నుంచి తప్పించారు. ఈరోజు విడుదలైన ప్రోమోలో రీతూను మరో రెబల్ గా నియమించారు బిగ్ బాస్. మొదటి సీక్రెట్ టాస్క్ ఇంట్లో ఒకరితో సీరియస్ గా గొడవపడాలి అని చెప్పడంతో వాష్ రూం ఏరియా దగ్గర కూర్చున్న ఇమ్మాన్యుయేల్ తో గొడవ పడింది రీతూ. నువ్వు పవన్ ను తీయకుండా ఉంటే మేము ఇప్పుడు బాగా ఆడి గెలిచేవాళ్లం అంటూ గొడవ పడింది. ఇక తాజాగా విడుదలైన మరో ప్రోమోలో.. హౌస్మేట్స్ ను ఓ ఆటాడుకున్నాడు సుమన్ శెట్టి.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
తాజాగా విడుదలైన ప్రోమోలో.. సంజనతో కూర్చుని ముచ్చటిస్తూ..మొన్న ముందు రెబల్స్ అన్నారు.. నిన్న రెబల్ అన్నారు.. అంటే మీరేమో అనుకుంటాను అంటూ సరదాగా అనడంతో టాస్కే అలా ఉందన్నా అంటూ చెప్పింది. ఇక తర్వాత ఒక రెబల్ కు ఒకరిని కిల్ చేయడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. మరో ఛాన్స్ లేదు కిల్ చేయడానికి.. సో రెబల్ మారాడు అంటూ కళ్యాణ్, దివ్యతో ముచ్చటించాడు భరణి. దీంతో రెబల్ ఎవరు అయ్యారు అని దివ్య అడగడంతో తెలీదు అని భరణి చెప్పడంతో.. నేనెందుకు కాకూడదు అంటూ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చాడు సుమన్ శెట్టి. మన యాక్టింగ్ మీకు తెలుసు.. ఎట్టిచ్చా అంటూ నవ్వులు పూయించాడు.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
ఆ తర్వాత రాము, ఇమ్మాన్యుయేల్ దగ్గరకు సుమన్ వెళ్లగా.. ఫైనల్ గా నువ్వే రెబల్ అని చెప్పవు కదా అంటూ ఇమ్మూ అడగడంతో.. ‘నన్ను తియ్యకు ‘ అని సుమన్ అనడంతో.. ‘నేనే నిన్ను అడుక్కుంటున్నాను.. నన్ను తీయ్యొద్దని ‘ అని ఇమ్మూ అన్నాడు. ‘నీ ఐడియా ఎవరు’ అని సుమన్ అడగ్గా.. ‘నా ఐడియా వీడే (రామును చూపిస్తూ) వీడి చేతిలో గన్ పెట్టారు.. అందుకే ఎట్టాపడితే అట్టా కాల్చేస్తున్నాడు అందరినీ ‘ అని ఇమ్మూ అన్నాడు.
ఇక చివరగా.. ఇంటి సభ్యులందరు మీరు రెబల్ అనుకుంటున్న హౌస్మేట్ పేరు చెప్పాలని.. ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తే వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తప్పుకుంటారని చెప్పాడు బిగ్ బాస్. ముందుగా తనూజ మాట్లాడుతూ.. గౌరవ్ అనుకుంటున్నానని..ప్రతిదాంట్లో గౌరవ్ ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాడని చెప్పింది. ఇక నిఖిల్.. రీతూ పేరు చెబుతూ.. నిన్న టెన్షన్ పడిందని.. ఈరోజు ప్రశాంతంగా ఉందని చెప్పాడు. తర్వాత దివ్య. గౌరవ్ పేరు చెప్పగా.. ఇమ్మాన్యుయేల్ పేరు చెప్పాడు సాయి శ్రీనివాస్. చివరగా రీతూ యూ ఆర్ ద రెబల్ అంటూ చెప్పడంతో ప్రోమో ముగిసింది.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..




