Bigg Boss Telugu 9: శ్రీనివాస్‌కు అలాంటివి నచ్చవు.. బిగ్‌బాస్ రెమ్యునరేషన్‌పై దివ్వెల మాధురి షాకింగ్ కామెంట్స్
ఉన్న కొన్ని రోజులైనా బిగ్ బాస్ హౌస్ ను దుమ్ము దులిపింది దివ్వెల మాధురి. మనసులో ఏదీ దాచుకోని తత్వం ఉన్నా ఆమె కొందరు కంటెస్టంట్లకు పట్ట పగలే చుక్కలు చూపించింది. తన ప్రవర్తన తో బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన దివ్వెల మాధురి లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. మొదట ఆమెను చూసి చాలా రోజులు హౌస్ లో ఉంటుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. కేవలం మూడు వారాలే ఉండి ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోందీ ఫైర్ బ్రాండ్. తన బిగ్ బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. కాగా బిగ్ బాస్ నుంచి దివ్వెల మాధురి ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఆమె భారీగానే పారితోషకం అందుకుందని ప్రచారం జరుగుతోంది. మూడు వారాలకు గానూ మొత్తం రూ. 9 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదే విషయంపై మాధురి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని కుండబద్దలు కొట్టింది.
‘బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అని దువ్వాడ శ్రీనివాస్ నాకు ముందే చెప్పారు. ఆయనకు అలాంటివి నచ్చవు. డబ్బుపైన శ్రీనివాస్ కు పెద్దగా ఆశ ఉండదు. మేము సినిమాలో నటించాం. కానీ వారి దగ్గర కూడా ఒక్క రూపాయి పారితోషికం తీసుకోలేదు. ఫ్రీగానే నటించాం’ అని మాధురి చెప్పుకొచ్చింది. ఇప్పుడామె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
బిగ్ బాస్ హౌస్ లో దివ్వెల మాధురి
View this post on Instagram
దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నారంటే?
కాగా అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒకవేళ మాధురి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిస్తే ఆ వచ్చిన ప్రైజ్ మనీని దివ్యాంగుల బాగు కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే క్యాన్సర్ బాధితుల కోసం వినియోగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో తన రెమ్యునరేషన్ గురించి దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.
దివ్వెల మాధురి గురించి దువ్వాడ శ్రీనివాస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








