Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!

Sarayu eliminated Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలై వారం రోజులు ముగిసింది. కంటెస్టెంట్స్.. హౌస్‌లో రెచ్చిపోయి కావాల్సినంత వినోదం పంచుతున్నారు. గత సీజన్స్‌లానే

Bigg Boss 5 Telugu: దమ్ దమ్ చేస్తానంది.. వారం కూడా ఉండలేకపోయింది.. బిగ్‌బాస్‌ తొలి ఎలిమినేషన్‌ ఆమే..!
Sarayu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 12, 2021 | 10:42 PM

Sarayu eliminated Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలై వారం రోజులు ముగిసింది. కంటెస్టెంట్స్.. హౌస్‌లో రెచ్చిపోయి కావాల్సినంత వినోదం పంచుతున్నారు. గత సీజన్స్‌లానే ఇంటిసభ్యుల మధ్య గొడవలు, అరుపులు, గోలలు. ఏడుపులు, నవ్వులు ఇలా సందడిగా బిగ్ బాస్ తెలుగు ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్‌లో ఉన్నవారంతా ఎక్కువ రోజులు ఉండాలని విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే మొదటి వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని.. ఇప్పటివరకు ఉన్న ఉత్కంఠకు తెరదించారు నాగార్జున. అందరూ అనుకున్నట్లుగానే బిగ్ బాస్‌లో ఈవారం జెస్సీ, 7 ఆర్ట్స్‌ సరయు మధ్య ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగగా.. సరయు ఎలిమినేషన్‌ అయింది. బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో.. అని అందరూ ఈ రోజు షో వరకు ఎదురు చూశారు. అయితే మొదటి వారంలోనే సరయు ఎలిమినేట్‌ కాక తప్పలేదు.

అయితే.. మొదటి వారం నామినేషన్స్‌లో ఆరుగురిలో యాంకర్ రవి, హమీదాలు శనివారం నాటి ఎపిసోడ్‌లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది మానస్, సరయు, కాజల్, జెస్సీ ఉండగా.. ఈ నలుగురిలో సరయు బయటకు వచ్చారు. ప్రేక్షకుల ఓటింగ్‌లో మానస్‌, కాజల్‌ సేవ్‌ అయ్యారు. సరయు జేసీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. అయితే.. ఈ ఎలిమినేషన్‌లో మొదట జెస్సీ బయటకు వెళతాడనుకున్నారు. కానీ సరయు అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయింది.

7 ఆర్ట్స్‌ సరయూ.. యూట్యూబ్‌లో అడల్ట్‌ కామెడీతో వీడియోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తోటి కంటెస్టెంట్లనే కాదు ఏకంగా బిగ్‌బాస్‌నే దమ్‌దమ్‌ చేస్తానంటూ ఐదో సీజన్‌లో అడుగు పెట్టింది. షో ప్రారంభం రోజే నాగ్‌ ఎదుట తన మాటలతో తనేంటో చూపించకనే చూపించింది. స్టేజీ మీదే ఆ రేంజ్‌లో చెలరేగిపోయిన సరయు.. హౌస్‌లో ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఎలిమినేట్ అయింది.

Also Read:

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అరియానా.. ఏం చెప్పిందంటే..

Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్‏పై మండిపడుతున్న నెటిజన్స్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఐపీఎల్ ప్రారంభోత్సవంలో సందడి చేసే స్టార్స్ వీరే
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
ఏపీలో మొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించిన మహేష్.. ఫొటోస్
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
రాత్రిపూట చియా సీడ్స్‌ వాటర్ తాగుతున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
సమస్యలు వినడమే కష్టమనుకుంటే.. అన్నం కూడా పెడుతున్నారే..!
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా..?
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
చిటికెడు పసుపుతో బోలేడు లాభాలు.. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గుతారట
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
: ఇబ్బందుల్లో హృతిక్ రోషన్ క్రిష్ 4.. బిగ్ షాక్ ఇచ్చిన నిర్మాత
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే.. పలు బిల్లులకు ఆమోదం..!
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!
వారికి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఫ్రీ.. దరఖాస్తు కూడా అవసరం లేదంతే.!