Bigg Boss 5 Telugu: బయటకు వచ్చాకా.. ఆ కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసిన సరయు.. అంత ఈగో ఎందుకు నీకు అంటూ..
బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. హౌస్‌లో ఉన్న వాళ్లనే కాదు.. బిగ్ బాస్‌ను కూడా దమ్ దమ్ చేస్తా అంటూ చెప్పిన బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అయింది...
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. హౌస్‌లో ఉన్న వాళ్లనే కాదు.. బిగ్ బాస్‌ను కూడా దమ్ దమ్ చేస్తా అంటూ చెప్పిన బోల్డ్ బ్యూటీ సరయు ఎలిమినేట్ అయింది. ఈ అమ్మడు ముక్కుసూటి తనంతో ఇంటిసభ్యులతో అందరితో కలవలేక పోయింది. ఫలితంగా హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు. ఎలిమినేషన్ సమయంలో జెస్సీ , సరయు మధ్య పోటీ జరిగింది. మొత్తం నలుగురు కంటెస్టెంట్స్ మానస్, కాజల్, జెస్సి, సరయు మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరగ్గా ముందుగా మానస్ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత కాజల్ సేఫ్ అయ్యింది.. ఇక సరయు- జెస్సీ మధ్య జరిగిన పోటీలో సరయు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే బయటకు వచ్చిన సరయు ఒక్కొక్కరికి తన స్టైల్‌లో ఇచ్చిపడేసింది. సరయుకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్లలో బెస్ 5 మెంబర్స్, వరెస్ట్ 5 మెంబర్స్ చెప్పమని ఒక బోర్డు పై వారి ఫోటోస్ ఉంచామన్నాడు. దాంతో బెస్ట్ 5 లో శ్వేత,మానస్ ప్రియాంక, విశ్వ , హమీదలను ఎంచుకుంది.
ఇక వరస్ట్ 5 మెంబర్స్ లో సిరి, సన్నీ, లహరి, షన్ను, కాజల్‌లను ఎంచుకుంది. వీరిలో ఒక్కక్కరి గురించి చెప్తూ శివాలెత్తింది సరయు. లహరి గురించి చెబుతూ సీరియస్ అయ్యింది సరయు.. నిన్ను నువ్వు ఫ్రూవ్ చేసుకోవడానికి మిగతా వాళ్ళను తక్కువ చేయాల్సిన పని లేదు.. అంత ఈగో ఎందుకు నీకు అంటూ.. ఏం లేని ఆకుఎగిరిపడుతుంది..ముందు ఎవరితో ఎం మాట్లాడాలో తెలుసుకో. నేను అంత నేను ఇంత అని నువ్ ఫీల్ అయితే.. నేను నీకంటే పైనే ఉంటాను అని సరయు చెప్పుకొచ్చింది. లహరి నిన్ను నేనేమన్నాను అని అడగాలని ప్రయత్నించినా సరయు వినలేదు.. తన సస్టైల్ లో ఇచ్చిపడేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :