Bullet Bandi Song: కమింగ్ సూన్… వెండితెరపై డుగుడుగు పాట.. ఎలాగంటే…?

మోహన భోగరాజు పాడిన బులెట్ బండి పాట... ఆన్లైన్లో రిలీజై ఐదునెలలైంది. మొదట్లో లైమ్ లైట్లోకి రావడానికి ఇబ్బంది పడ్డా... ఆ పెళ్లి జంట బారాత్ లో వేసిన డాన్స్ వీడియోతో.. ఈ పాటకు ఘరానా లెవల్లో బూస్ట్ వచ్చేసింది.

Bullet Bandi Song: కమింగ్ సూన్... వెండితెరపై డుగుడుగు పాట.. ఎలాగంటే...?
Bullet Bandi Song


పాన్ ఇండియా మూవీ పుష్ప ఫస్ట్ సింగిల్… దాక్కో దాక్కో మేక … నాలుగు వారాల్లో దాటిన స్కోర్ 40 మిలియన్లు. ఆ తర్వాతొచ్చిన పవర్ స్టార్ మూవీ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 26 మిలియన్ల దగ్గర తచ్చాడుతోంది. మెగాస్టార్ మూవీ ఆచార్య నుంచి మణిశర్మ ఇచ్చిన మెస్మరైజింగ్ సాంగ్ లాహే లాహే… ఐదు నెలల్లో 86 మిలియన్ల వ్యూస్ తో నడుస్తోంది. వీటన్నిటికీ మెయిన్ థ్రెట్ నేనే అంటూ.. మెగా సాంగ్ తోనే పోటీ పడుతోంది డుగుడుగు పాట(బుల్లెట్ బండి పాట).

మోహన భోగరాజు పాడిన బులెట్ బండి పాట… ఆన్లైన్లో రిలీజై ఐదునెలలైంది. మొదట్లో లైమ్ లైట్లోకి రావడానికి ఇబ్బంది పడ్డా… ఆ పెళ్లి జంట బారాత్ లో వేసిన డాన్స్ వీడియోతో.. ఈ పాటకు ఘరానా లెవల్లో బూస్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఏకంగా 74 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళుతోంది బులెట్ బండి ఒరిజినల్ సాంగ్. లక్ష్మణ్ రాసిన లిరిక్స్ ని మోహన భోగరాజు పాడగా… బాలాజీ ట్యూన్స్ ఇచ్చారు. పుష్ప పాట, భీమ్లా నాయక్ పాట ఏవో కొన్ని సెక్షన్స్ కి మాత్రమే రీచ్ అవుతాయి. కానీ.. ఈ డుగుడుగు సౌండ్ మాత్రం ఇంటిల్లిపాదికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ కీ ఎక్కేసింది. ముసలీ ముతకా కూడా ఈ పాటకు వీడియోలు చేసి.. వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.

శ్రీరస్తు శుభమస్తు లాంటి పెళ్లి పాటలు గతంలో చాలా పాపులర్ అయ్యాయి. పెళ్లి వీడియోల్లో వాటి మార్క్ సౌండ్ మాత్రమే వినివిని బోర్ ఫీలవుతుంటే.. పెళ్లి పాటంటే ఇది కదరా అనే రేంజ్ లో సత్తా చాటుతోంది బులెట్ బండి పాట. ఈవెంట్ మేనేజింగ్ కంపెనీలు ఈ పాట కోసం స్పెషల్ సెట్టింగ్స్ డిజైన్ చేసుకుని.. ఆర్డర్ల కోసం గాలం వేస్తున్నారు. సెలబ్రిటీల పెళ్లిళ్లలో జరిగే సంగీత్ లో కూడా ‘బులెట్ బండి’ పాట మాండేటరీ అయ్యింది.

ఈ క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకోడానికి సినిమా వాళ్ళు కూడా ఇంటిలిజెంట్ గా ఆలోచిస్తున్నారు. ఓపెన్లో బాగా పాపులర్ అయిన ప్రైవేట్ సాంగ్స్ ని ఇంకాస్త రిచ్ గా పిక్చరైజ్ చేసి తెరమీద చూపెట్టి.. తమ సినిమాలకు దాన్నొక కమర్షియల్ ఎలిమెంట్ గా వాడుకోవడం కామన్. ఇప్పుడు ‘బులెట్ బండి’ పాట కూడా అదే లైన్లోకి రాబోతోంది. రీసెంట్ గా సర్ ప్రైజ్ హిట్ కొట్టిన ఒక డెబ్యూ డైరెక్టర్… బులెట్ బండి పాటకు పెద్ద మొత్తంలో రాయల్టీ ఇచ్చి జేబులో వేసుకున్నారట. ఒక స్టార్ హీరో సినిమాలో త్వరలో డుగుడుగు పాటను చూడబోతున్నాం. సో.. లెటజ్ వెయిట్ ఫర్ డుగుడుగు మేజిక్ ఆన్ సిల్వర్ స్క్రీన్.

బుల్లెట్ బండి సాంగ్ వీడియో..

 – శ్రీహరి రాజా, ET డెస్క్, టీవీ9 తెలుగు

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్‏లో వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అరియానా.. ఏం చెప్పిందంటే

తలైవి జయలలిత బాటలో రాజకీయాల్లోకి వస్తారా?.. కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు

 

Click on your DTH Provider to Add TV9 Telugu