AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ఛీ ఛీ.. వరస్ట్ బిహేవియర్.. నువ్వు నామినేషన్‏లోకి రా.. యష్మీ పై నెటిజన్స్ ఫైర్..

గత సీజన్ లో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టిని అడియన్స్ ఏ రేంజ్ లో తిట్టుకున్నారో తెలిసిందే. ఇరిటేటింగ్ బిహేవియర్ అంటూ శోభా శెట్టిపై భారీగా నెగిటివిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ సీజన్ లో యష్మీ గౌడ కంటే శోభా బెటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొదటి రోజు నుంచే యష్మీని శోభాతో పోలుస్తున్నారు.

Bigg Boss 8 Telugu: ఛీ ఛీ.. వరస్ట్ బిహేవియర్.. నువ్వు నామినేషన్‏లోకి రా.. యష్మీ పై నెటిజన్స్ ఫైర్..
Yashmi
Rajitha Chanti
|

Updated on: Sep 14, 2024 | 11:24 AM

Share

ఛీఛీ వరస్డ్ బిహేవియర్.. వామ్మో.. నీకంటే శోభా శెట్టి బెటర్.. చీఫ్ అవ్వడం వల్ల బతికిపోయావ్.. నువ్వు నామినేషన్లలోకి రా.. నీకు అదే చివరి వారం అంటూ బిగ్‏బాస్ కంటెస్టెంట్ యష్మీ గౌడను ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. ఈ సీజన్ మొదటి రోజు నుంచి యష్మీ గౌడ ప్రవర్తన, ఆమె ఆట తీరు జనాలకు నచ్చడం లేదనేది నెట్టింట ట్రోల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆమె ఓవర్ యాక్షన్.. కోపం.. ఇతర కంటెస్టెంట్స్ పై మాటలతో విరుచుకుపడుతూ బిగ్‏బాస్ కే నియంతలా ప్రవర్తిస్తుంది. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్‏లో యష్మీ ప్రవర్తన చూసి షాకవుతున్నారు నెటిజన్స్. గత సీజన్ లో కార్తీక దీపం సీరియల్ ఫేమ్ శోభాశెట్టిని అడియన్స్ ఏ రేంజ్ లో తిట్టుకున్నారో తెలిసిందే. ఇరిటేటింగ్ బిహేవియర్ అంటూ శోభా శెట్టిపై భారీగా నెగిటివిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ సీజన్ లో యష్మీ గౌడ కంటే శోభా బెటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొదటి రోజు నుంచే యష్మీని శోభాతో పోలుస్తున్నారు. కానీ రెండో వారం ఆమె ఆట తీరు చేసి శోభా శెట్టి వెయ్యి రెట్లు బెటర్ అంటున్నారు.

యష్మీ గౌడ.. గేమ్స్ ఆడి చీఫ్ కాలేదు. నిఖిల్, నైనిక కలిసి సెలక్ట్ చేయడం వల్ల చీఫ్ గా మారింది. తాను లక్కీగా చీఫ్ అయ్యానంటూ చెప్పేసింది. కానీ హౌస్ లో ఆమె ప్రవర్తన మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. తన స్నేహితులు గెలిచినా సరే తట్టుకోలేకపోతుంది. ఎప్పుడూ తనే గెలవాలని చూస్తుంది. అందుకు ఫౌల్ గేమ్స్ ఆడినా ఓకే అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. పక్క టీమ్ రేషన్ కొట్టేసి.. ప్రూఫ్ ఉందా అంటూ వారిపైనే రెచ్చిపోతుంది. ఇక ఎదుటి టీమ్ వాళ్లు ఓడిపోతే డాన్స్ చేస్తూ అరుస్తూ సైకోలా బిహేవ్ చేస్తుంది. ఇష్టవచ్చినట్లు పక్క టీమ్ వాళ్లపై నోరు పారేసుకోవడం.. కావాలని వాళ్లను రెచ్చగొట్టడం.. ఇలా తన ఇష్టమొచ్చినట్లుగా గేమ్ ఆడేస్తుంది యష్మీ. దీంతో ఆమె పై నెటిజన్స్ దారుణంగా ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో యష్మీ ప్రవర్తన చూసి నోరెళ్లపెట్టారు అడియన్స్. నిన్న జరిగిన చివరి గేమ్ లో అవతలి టీమ్ కంటెస్టెంట్స్ పై మాటలతో రెచ్చిపోయింది. నబీల్, విష్ణుప్రియ గేమ్ నుంచి అవుట్ కాగానే.. పిచ్చిగా డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట షేర్ చేస్తూ యష్మీపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. యష్మీ ప్రవర్తనపై యూట్యూబర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ‘వరస్ట్ కే వరస్ట్ అసలు.. ఏమిలేని దగ్గర డాన్స్ చేస్తుంది. ఏమిలేని దగ్గర చప్పట్లు కొడుతుంది.. తనదే నెగ్గాలి.. అవతలి వాళ్లు టాస్క్ ఆడుతూ చచ్చిపోయినా పర్లేదు అనుకుంటుంది’ అంటూ ఫైర్ అయ్యాడు.

View this post on Instagram

A post shared by reethu (@reethu_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్