Bigg Boss 8 Telugu Promo 2: నాన్నకు ప్రేమతో.. గుండెల్ని పిండేసిన ఎమోషన్స్.. కన్నీళ్లు పెట్టిన హౌస్మేట్స్..
ఎప్పుడూ ప్రతి సీజన్ లో చివరి వారాల్లో ఫ్యామిలీ నుంచి గిఫ్ట్స్, ఉత్తరాలు పంపించడం కామనే. కానీ ఎప్పుడో రావాల్సిన బహుమతులను ఈ సీజన్ లో మాత్రం రెండో వారంలోనే తీసుకువచ్చాడు బిగ్బాస్. మొత్తం 13 మంది కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురికి మాత్రమే వచ్చిన బహుమతులు తీసుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో ఒక్కొక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
బిగ్బాస్ హౌస్లో గత రెండు వారాలుగా టాస్కులు, గొడవలతో రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు చీఫ్స్.. వారి క్లాన్స్ అంటూ టీంలుగా విడుగొట్టి గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్బాస్. అయితే ఇన్నిరోజులుగా కేవలం కోపాలతో, గొడవలతో హౌస్ మొత్తం ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. ఎప్పుడూ ప్రతి సీజన్ లో చివరి వారాల్లో ఫ్యామిలీ నుంచి గిఫ్ట్స్, ఉత్తరాలు పంపించడం కామనే. కానీ ఎప్పుడో రావాల్సిన బహుమతులను ఈ సీజన్ లో మాత్రం రెండో వారంలోనే తీసుకువచ్చాడు బిగ్బాస్. మొత్తం 13 మంది కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురికి మాత్రమే వచ్చిన బహుమతులు తీసుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో ఒక్కొక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. మీకు ఇష్టమైన వారిని మీరు మిస్ అవుతున్నారని బిగ్బాస్ కు తెలుసు. అందుకే ఐదుగురు సభ్యులకు వాళ్ల ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్స్ పొందే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు బిగ్బాస్. ఆ తర్వాత నిఖిల్, ఆదిత్య, నైనిక, సీత, అభయ్ ఇంటి నుంచి వచ్చిన బహుమతులను గార్డెన్ ఏరియాలో డిస్ ప్లే చేశాడు. అయితే ఆ బహుమతులు అందుకునే ఆ ఐదుగురు ఎవరో డిసైడ్ చేసే పని మిగిలిన ఇంటి సభ్యుల బాధ్యత అంటూ అసలు ఫిట్టింగ్ పెట్టాడు. ఇక ముందుగా నిఖిల్ తన తండ్రి షర్ట్ చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. అబ్బాయిలకు నాన్నను హగ్ చేసుకోవాలనే ఇది ఉండదు కాబట్టి.. ఆయనకు తెలీకుండా ఆ షర్ట్ దొంగతనం చేశా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అభయ్ వాళ్ల నాన్నకు ఇచ్చిన గిఫ్ట్ వాచ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకు వచ్చిన ఫస్ట్ శాలరీతో తన తండ్రికి కొన్న వాచ్ అది అని.. బతికున్నంత కాలం నాన్న అదే వాచ్ పెట్టుకున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఐదేళ్లు ప్రేమలో ఉన్న అబ్బాయి వదిలి వెళ్లిపోయిన తర్వాత ఓ ఫ్రెండ్ దొరికాడని.. ఐ మిస్ కుమార్ అంటూ సీత ఏడ్చేసింది. ఓ రిలేషన్ చాలా బాధ పెట్టిందని.. దాని నుంచి కోలుకోవడానికి తనే కారణమంటూ ఓ ఫ్రెండ్ ఇచ్చిన బొమ్మను చూస్తూ బాధపడింది. ఇక సీత, నైనిక కోసం తమ గిఫ్ట్ త్యాగం చేశారు అభయ్, నిఖిల్. సీత కోసం అభయ్, నైనిక కోసం నిఖిల్ తమ బహుమతులను త్యాగం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.