AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బుల్లితెర హీరోకు బిగ్‏బాస్ ఆఫర్.. భార్య ఆ మాట చెప్పడంతో ఆగిపోయిన నటుడు

బుల్లితెర ప్రేక్షకులను రంజింపచేసేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రసారం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Bigg Boss Telugu 8: బుల్లితెర హీరోకు బిగ్‏బాస్ ఆఫర్.. భార్య ఆ మాట చెప్పడంతో ఆగిపోయిన నటుడు
Bigg Boss Telugu 8
Basha Shek
|

Updated on: Aug 23, 2024 | 11:06 AM

Share

బుల్లితెర ప్రేక్షకులను రంజింపచేసేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రసారం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సారి హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎవరన్నది తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఎనిమిద సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సెలెక్షన్ కు సంబంధించి ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ నుంచి ఎంపికైన వారందరికీ కాల్స్ వెళ్లాయని టాక్. ప్రస్తుతం బాగా ఫేమ్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్స్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. యాంకర్లు రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు ఖయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, సీరియల్ నటి యాష్మి గౌడ, మోడల్ ఊర్మిళ చౌహన్, నటుడు అభిరామ్ వర్మ తదితరులు ఫైనల్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు ‘చక్రవాకం’, మొగలి రేకులు సీరియల్స్ ఫేమ్ నటుడు ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడట. దీనికి కారణం అతని భార్య మేఘన.

బిగ్ బాస్ షోకి వెళ్లవద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళితే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట. నెగెటివ్ ఇమేజ్ కారణంగా కెరీర్ దెబ్బతింటుందట. అందుకే బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో భార్య మాటను జవదాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకు వెళ్లాలనే ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. . అయితే దీనిలో ఎంత వాస్తవముందో తెలియాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సిందే. ఎందుకంటే షో లాంఛింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్.

ఇవి కూడా చదవండి

భార్యతో నటుటు ఇంద్రనీల్ వర్మ..

ఇంద్రనీల్ వర్మ, మేఘన ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
అల్లాటప్ప రాయి కాదు ఇది.! పొలాన్ని నాగలితో దున్నుతుండగా..
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
పొగమంచుపై వాతావరణశాఖ కీలక అప్డేట్.. ప్రజలకు హెచ్చరికలు
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే దీనికి మించిన సూపర్ ఫుడ్ లేదు!
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..