Brahmamudi, August 22nd Episode: అప్పూ, కళ్యాణ్‌లకు దుగ్గిరాల ఇంటి పిలుపు.. టెన్షన్ పడుతున్న కనకం..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వరలక్ష్మీ వ్రతం చేయడానికి అప్పూ, కళ్యాణ్‌లను ఇంటికి తీసుకురావాలని ఇందిరా దేవి అంటుంది. అందుకు అందరూ సంతోషిస్తారు. కానీ కావ్య మాత్రం ఆలోచనలో పడగా.. రుద్రాణికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. కళావతిని కావాలని ఇరికిస్తాడు రాజ్. మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తారు. ఈ ఇంట్లో అమ్మమ్మ, తాతయ్యలు నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా ఆక్షేపిస్తారా? కానీ వాళ్లు రావడానికి నేనే కారణం అని ఎవరైనా అంటే అని కావ్య సందేహిస్తుంది. దుమ్ము దులిపేయ్..

Brahmamudi, August 22nd Episode: అప్పూ, కళ్యాణ్‌లకు దుగ్గిరాల ఇంటి పిలుపు.. టెన్షన్ పడుతున్న కనకం..
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Aug 22, 2024 | 12:44 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. వరలక్ష్మీ వ్రతం చేయడానికి అప్పూ, కళ్యాణ్‌లను ఇంటికి తీసుకురావాలని ఇందిరా దేవి అంటుంది. అందుకు అందరూ సంతోషిస్తారు. కానీ కావ్య మాత్రం ఆలోచనలో పడగా.. రుద్రాణికి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు. కళావతిని కావాలని ఇరికిస్తాడు రాజ్. మధ్యలో నన్ను ఎందుకు ఇరికిస్తారు. ఈ ఇంట్లో అమ్మమ్మ, తాతయ్యలు నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా ఆక్షేపిస్తారా? కానీ వాళ్లు రావడానికి నేనే కారణం అని ఎవరైనా అంటే అని కావ్య సందేహిస్తుంది. దుమ్ము దులిపేయ్.. నీకు బూజు కర్ర నేను ఇస్తానని అపర్ణ అంటుంది. అమ్మా ఈ పూజకు మీ అమ్మానాన్నలను కూడా పిలువు. అందరూ ఇక్కడే ఉంటారు కదా.. సంతోషిస్తారని ప్రకాశం అంటాడు. కావ్య ఏమీ సమాధానం చెప్పదు. అంతా సరే.. ఇంతకీ కళ్యాణ్ పిలిస్తే వస్తాడా? అని ధాన్య లక్ష్మి అంటే.. నువ్వే వెళ్లి పిలవమని అపర్ణ అంటుంది. నేనా అస్సలు పిలవనని ధాన్యం అంటుంది. ఎక్కడి వాళ్లు అక్కడ ఉంటేనే హాయిగా ఉంటుందని రుద్రాణి అంటుంది. ఎవరికి హాయిగా ఉంటుంది.. మీకు హాయిగా ఉంటుందని స్వప్న అంటుంది. మీరెవరూ కాదు.. నేనూ చిట్టీ వెళ్లి పిలుస్తామని సీతారామయ్య అంటాడు.

వ్రతానికి ఇంటికి రమ్మన్న కావ్య..

ఆ తర్వాత కావ్య కనకానికి కాల్ చేస్తుంది. ఎలా ఉన్నారని అడుగుతుంది. ముగ్గురూ పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఇక్కడ మేము అనాధల్లా ఉన్నామని కనకం అంటుంది. ఎందుకు ఫోన్ చేశావని అని కనకం అడిగితే.. రేపు వరలక్ష్మీ వ్రతం కదమ్మా.. ముగ్గురు కోడళ్లతో పూజ చేయించాలని అనుకుంటున్నారని కావ్య చెబుతుంది. దీంతో కనకం షాక్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే.. అసలే వాళ్లు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని.. ఆ ధాన్య లక్ష్మి చాలా కోపంగా ఉంది కదా అని కనకం అంటే.. అమ్మమ్మ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక దాన్ని ఎవరూ మార్చలేరు. నేను ఇప్పుడు మీకు ఫోన్ చేసింది కూడా మిమ్మల్ని ఆ వ్రతానికి పిలవడానికే అని కావ్య అంటుంది. మధ్యలో మేము ఎందుకే అని కనకం కంగారు పడుతుంది.

మొదటి సారి దుగ్గిరాల ఇంటికి వెళ్లడానికి భయపడిన కనకం..

అప్పుడే అపర్ణ వచ్చి ఫోన్ తీసుకుని.. కనకం రేపు వ్రతానికి ఇంటికి వచ్చేయండి. అన్నీ ఇక్కడ మాట్లాడుకుందాం. లక్ష పనులు ఉన్నా సరే అన్నీ మానుకుని ఇక్కడ వ్రతానికి రమ్మని చెబుతుంది. కనకం చెప్పినా వినిపించుకోదు. ఏంటండీ ఇది అప్పూ వాళ్లను పిలవడం ఏంటి.. ఆ ధాన్య లక్ష్మి పెళ్లి రోజున ఎంత గొడవ చేసిందో చూశారు కదా.. అసలే అప్పూకి ఆవేశం ఎక్కువ. అక్కడ ధాన్య లక్ష్మి ఏం అంటుందోనని భయంగా ఉంది. నా వల్ల కాదు నేను వెళ్లనని కనకం అంటుంది. ఆవిడే స్వయంగా ఫోన్ చేసి చెప్పింది కదా.. వెళ్లకపోతే బాగోదని కృష్ణమూర్తి అంటే.. నేను వెళ్తే అక్కడ ఇంకెలా ఉంటుందో.. రేపు అన్ని వ్యాధులు కూడా వచ్చేస్తాయి. నేను మాత్రం ఆ పూజకు వెళ్లనని కనకం అంటుంది.

ఇవి కూడా చదవండి

అప్పూపై స్కెచ్ వేసిన ధాన్య లక్ష్మి.. రుద్రాణి సంబరం..

మరోవైపు బయట ఆవేశంలో కూర్చొని ఉంటుంది ధాన్యలక్ష్మి. అక్కడికి వచ్చిన రుద్రాణి.. నీది ఎంత పెద్ద మనసు ధాన్య లక్ష్మి. అప్పూ మీద పీకల్లోతు కోపంగా ఉన్నా.. ఇంటి సంప్రదాయం వాళ్లను ఇంటికి రమ్మన్నావు అని ఎద్దేవా చేస్తుంది. వాళ్లను పూజకు రమ్మని ఒప్పుకునే సరికి దాన్ని కోడలిగా ఒప్పుకున్నాను అనుకున్నావా.. ఎప్పటికీ దాన్ని కోడలిగా ఒప్పుకోను. అది పూజకు వస్తుంది.. కానీ ఇంటికి తిరిగి వెళ్లే లోపు అది ఈ ఇంటి కోడలిగా పనికి రాదని రుజువు చేస్తానని అంటుంది ధాన్యం. అలా అని అనుకుంటే చాలా అని రుద్రాణి అంటుంది. అందుకే ఈ వ్రతానికి ముత్తైదువులను కూడా పిలిపించు. బయట వాళ్ల ముందు దాని పరువు తీస్తేనే కదా.. ఇంటి కోడలిగా పనికి రాదని అందరూ ఒప్పుకుంటారని ధాన్య లక్ష్మి అంటుంది. మరోవైపు దొరికిందే ఛాన్స్ అని రుద్రాణి సంబర పడుతుంది.

కళ్యాణ్, అప్పూలను పిలిచిన పెద్దాయన, పెద్దావిడ..

మరోవైపు పొట్టి, కూచిలు ఆడుకుంటూ ఉంటారు. సరిగ్గా సీతారామయ్య, ఇందిరా దేవిలు వచ్చేసరికి కొట్టకుంటూ ఉంటారు. వాళ్లను చూసి సంతోష పడుతూ ఏంటి బలాబలాలు తేల్చుకుంటున్నారా? అని అడుగుతుంది పెద్దావిడ. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేపిస్తున్నాం. కొత్త కోడలితో కూడా వ్రతం చేయించాలి అనుకుంటున్నాం. కాబట్టి మిమ్మల్ని కూడా ఇంటికి పిలుస్తున్నామని చెబుతారు. దీనికి కళ్యాణ్ ఒప్పుకోడు. మా అమ్మ అప్పూని అవమానిస్తుందని అంటాడు. కానీ అప్పూ వెళ్దాం అనడంతో సరే అంటాడు కళ్యాణ్.

రాజ్ సంతోషం.. కావ్య టెన్షన్..

ఆ తర్వాత గదిలో రాజ్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కావ్య వస్తుంది. రేపు వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశావా.. అని అన్ని కనుక్కుంటాడు రాజ్. అన్నింటికీ సమాధానం చెబుతుంది కావ్య. ఎందుకు అంత కోపంగా ఉన్నావని రాజ్ అడుగుతాడు. నేనెందుకు కోపంగా ఉంటాను? రేపు నా చెల్లి కూడా వస్తుంది చాలా ఆనందంగా ఉందని అంటుంది కావ్య. రేపు వాళ్లు ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటున్నావా? లేదు పర్మినెంట్‌గా ఇక్కడే ఉంటారని రాజ్ ఎంతో సంతోషంగా చెబుతూ పడుకుంటాడు. రేపు ఏం జరుగుతుందో ఏంటో అని కావ్య టెన్షన్ పడుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.