Krishna Mukunda Murari,19 August: ఆదర్శ్ ఆచూకీ చెప్పిన కన్నల్.. ముకుంద ఎవరినైనా ప్రేమించావా అంటూ నిలదీసిన భవానీ.. నేటి ఎపిసోడ్‌లో ట్విస్ట్ ..

ముకుంద నీ మౌనమే అంగీకారం అయితే ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ముకుంద షాక్ తింటుంది. అత్తయ్య అంటే ఇంకెప్పుడు నా కంటికి కూడా కనిపించకు..అంటే.. నేను అతనిని ప్రాణ పదంగా ప్రేమించి నిజమే కానీ.. మా పెళ్లి తర్వాత నా ప్రేమని నేను సమాధి చేసుకున్నా నన్ను నమ్మండి అత్తయ్య అని కాళ్ళమీద పడి మరీ క్షమాపణ చెబుతూ అడుగుతుంది.

Krishna Mukunda Murari,19 August: ఆదర్శ్ ఆచూకీ చెప్పిన కన్నల్.. ముకుంద ఎవరినైనా ప్రేమించావా అంటూ నిలదీసిన భవానీ.. నేటి ఎపిసోడ్‌లో ట్విస్ట్ ..
Krishna Mukunda MurariImage Credit source: Hotstar
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2023 | 6:21 AM

నేటి ఎపిసోడ్ లో కృష్ణకు ఫోన్ చేస్తాడు మురారీ.. వైద్య శిబిరంలో పేషేంట్స్ ను పరీక్షించడంలో బిజీగా ఉన్న కృష్ణ.. మురారీ నుంచి వచ్చిన ఫోన్ ను లిఫ్ట్ చేయదు.. దీంతో మురారీ మరింత బాధ పడతాడు.

ఏసీపీ సార్ ఏమిటి ఇన్నిసార్లు కాల్ చేశారు ఏదైనా అర్జెంట్ ఏమో అని కృష్ణ మురారీకి ఫోన్ చేస్తుంటే.. మురారీ కృష్ణకు ఫోన్ చేస్తుంది. బిజీ.. అంతేలే ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు.. అనుకుంటుంటే.. ఐజీ ఫోన్ చేస్తారు.. ఎక్కడ ఉన్నావు మురారీ అని అంటే రోడ్డున పడ్డా సార్.. అంటే.. ఏమైంది. అంటే ఏమీలేదు అంటుంటే కృష్ణ ఫోన్ చేసింది కనిపిస్తుంది. నువ్వు క్యాంప్ కి వెళ్ళాలి రెడీగా ఉండు అని అంటే.. లేదు సార్ నేను ఈ క్యాంప్ కు వెళ్ళను నా డ్యూటీ నేను చేసుకుంటా అని చెబుతాడు మురారీ.. ఇంతలో కృష్ణ పేషేంట్ కు సెలైన్ పెట్టడానికి వెళ్తుంది..

ఆదర్శ్ ను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న భవానీ

ఇంటికి వచ్చిన మురారిని కృష్ణ జ్ఞాపకాలు వెంటాడతాయి. మరోవైపు భవానీ ఆదర్శ్, మురారి కలిసి ఉన్న ఫోటోని చూస్తూ ఆదర్శ్ ఎక్కడ ఉన్నావు నాన్నా నువ్వు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉన్నావు అనుకుంటున్నాను.. మీ నాన్న లేకపోయినా నిన్ను నా గుండెల్లో పెట్టుకుని పెంచాను.. ఒక్కసారి అయినా నన్ను చూడాలనిపించడం లేదా నీకు.. ఎందుకు రా నువ్వు ఇలా మారిపోయావు.. నీకు ఏమైందో తెలియక.. నువ్వు ఇంటికి రావడం లేదో అర్ధం కాకా ఏదోలా ఉందిరా అంటూ కన్నీరు పెడుతుంది భవానీ.. ఇంతలో ఫోన్ వస్తుంది..

ఇవి కూడా చదవండి

ఆదర్శ్ ఆచూకీ చెప్పిన కన్నల్

గుడ్ ఈవినింగ్ భవానీ దేవి గారు అంటూ మేజర్ కన్నల్ ఫోన్ చేస్తారు భావానికి. చెప్పండి కన్నల్ అంటే.. ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్ అని చెబితే భవానీ షాక్ తింటుంది.. ముందు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే.. ఆదర్శ్ కు మీ ఇంటికి రావడం తన ఆచూకీ మీకు తెలియజేయడం ఇష్టం లేదు.. అంటే ఆదర్శ్.. అని భవానీ అడుగుతుంటే.. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది.. ఇన్నాళ్లుగా ఆదర్శ్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళాడు.. తను కావాలనే తన ఆచూకీ ఆర్మీకి కూడా తెలియకుండా ఉంచాడు.. తను ఒక సీక్రెట్ మెషిన్ లో ఉన్నాడు అని కన్నల్ చెబుతాడు. ఇప్పుడు కూడా పరిస్థితులు నార్మల్ గా ఉండి ఉంటే తన ఆచూకీ తెలిసేది కాదు.. యుద్ధం అనివార్యం అని తెలిసి సైన్యానికి తన సహాయం కావాలి అని .. తనకి తానుగా తన ఆచూకీ తెలియజేశాడు. దైర్యంగా ఉండండి భవానీ దేవిగారు.. తన ఆచూకీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను అని కన్నల్ చెప్పిన మాటలకు భవానీ దేవి చాలా సంతోష పడుతుంది. థాంక్యూ కన్నల్ అని ఇన్నాళ్లు ఆదర్శ్ విషయంలో మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని అనుకున్నా.. థాంక్యూ.. టెన్షన్ పడకండి.. ఆదర్శ్ ఇక నుంచి మాతోనే ఉంటాడు అని చెబితే.. భవానీ చాలా సంతోషపడింది.

ముకుందని నిలదీసిన భవానీ..

ఆదర్శ్ ఇంటికి రాకుండా ఉండడం గురించి ముకుంద వాళ్ళ నాన్న చెప్పింది గుర్తు చేసుకుంటుంది భవానీ.. అంతేకాదు. ఆదర్శ్ ఇంటికి రాకుండా ఉండడానికి కారణం వెదికే ప్రయత్నం చేస్తుంది.. పెళ్ళైన మర్నాడే ఎందుకు వెళ్ళిపోయాడు. ఫస్ట్ నైట్ రోజున ఎందుకు తాగేసి నిద్రపోయాడు అని ఆలోచిస్తూ భవానీ కోపంగా ముకుందని పిలుస్తుంది. దీంతో మొత్తం ఫ్యామిలీ భవానీ దగ్గరకు వస్తుంది..  ఎందుకు పెద్డత్తయ్య ముకుంద పై అరిచింది అంటావు అని అలేఖ్య  తన భర్త మధుని అడిగితె నాకు ఏమి తెలుసు అంటాడు… కానీ నాకు తెలుసు అన్న అఖిల .. అత్తయ్యకు కృష్ణ బయటకు వెళ్ళడానికి కారణం ముకుంద అని తెలిసి ఉంటుందని అలేఖ్య చెబుతుంటే .. అది నోరా డ్రైనేజా అని మధు అంటాడు. ఒక్క మంచి మాటకూడా రాదా నీ నోట్లో నుంచి అంటే వీడికేమి తెలియదు.. నేను చెబితే వినడు.. అనుకుంటుదని అలేఖ్య.. మరోవైపు గౌతమ్ నందు.. అత్తయ్యలో కోపం.. ముకుంద లో భయం ఏమి జరిగిందని అలోచిస్తూ ఉంటారు.  ముకుంద ఏదో తప్పు చేసి ఉంటుంది అని నందు అంటే.. అయితే ఇప్పుడు అత్తయ్య శిక్షిస్తుందా అని గౌతమ్ అంటే.. అవసరం అయితే బహిష్కరిస్తుంది కూడా అని నందు అంటూ.. నువ్వు నన్ను డిస్టర్బ్ చెయ్యకు అంటుంది నందు..

ముకుంద రేవతి తప్ప నాకు ఎవరూ ఇక్కడ కనిపించకూడదు.. అని భవానీ అంటే ఏమి నాన్నా బ్రహ్మండం ఏదో బద్దలయ్యేటట్లు ఉంది అంటదు మధు.. అది నాకు జన్మలో అర్ధం కాదు కానీ.. పద రెండు పెగ్ లు వేద్దాం అంటాడు ప్రసాద్ మధుతో ఒకే అంటూ.. అందరూ భవానీ రూమ్ నుంచి వెళ్ళిపోతారు..

అక్కకి ముకుంద మురారీల విషయం తెలిసిందా అని రేవతి ఆలోచిస్తుంటే.. ఏమిటత్తయ్య అని ముకుంద అని ఆడితే.. పెళ్ళికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా ముకుంద.. అని అడుగుతుంది భవానీ..   అత్తయ్యకు సడెన్ గా ఎందుకు ఈ డౌట్ వచ్చింది..  అని అనుకుంటూనే.. అత్తయ్యకు ఈ పరిస్థితిలో మా లవ్ మేటర్ గురించి ఖచ్చితంగా రేవతి అత్తయ్య చెప్పి ఉండదు.. అని ఆలోచిస్తుంటే.. అడిగేది నిన్నే ముకుంద అని భవానీ అంటుంటే.. ఏమి చెప్పను అత్తయ్య ఆదర్శ్ విషయంలో నాకు ఎలాంటి క్లారిటీ లేకుండా మురారీని ప్రేమించానని ఎలా చెప్పను అనుకుంటుంది ముకుంద.. అక్క ఇన్నాళ్లలో ఎప్పుడు అడగంది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అక్క అని రేవతి అంటే.. ఆగు అన్నట్లు చెప్పి..   ఇప్పుడు నేను ఏమి చేశాను అత్తయ్య.. ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అంటే.. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ముకుంద.. ప్రశ్నే అవుతుంది అని భవానీ అంటే.. అవును నేను ఎందుకు భయపడాలి.. నేను ఏమీ తప్పు చెయ్యలేదు అని ముకుంద ఆలోచిస్తూ దేవుడా నువ్వు ఉన్నావు.. కృష్ణకు అలా గేట్ పాస్ ఇచ్చి పంపించావో లేదో.. నాకు ఇలా  లైన్ క్లియర్ చేస్తున్నావా థాంక్యూ అని అనుకుంటూ.. అవును అత్తయ్య నేను ఒకతనిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని ముకుంద చెబుతుంటే.. రేవతి భవానీ షాక్ తింటారు. దేవుడా గట్టిగా అడిగితె ఇప్పుడే ఇక్కడే నేను ప్రేమించి ఎవరినో కాదు మురారిని అని చెప్పేటట్లు ఉంది. అనుకుంటుంది రేవతి.. ఇంతలో భవానీ నీ ప్రేమ విషయం ఆదర్శ్ కు చెప్పవా అంటే.. లేదత్తయ్య .. చెప్పలేదు అంటుంది ముకుంద అయన అడగలేదు నేను చెప్పలేదు.. కానీ ఆయన దగ్గర దాచాలని నేను అనుకోలేదు.. చెప్పే సందర్భం మా ఇద్దరి మధ్య రాలేదు అంటుంది.. ఇంతలో భవానీ నువ్వు ఇప్పటికీ అతనినే లవ్ చేస్తున్నావా అని భవానీ అడగడంతో రేవతి షాక్ తింటూ దేవుడా కృష్ణ, మురారీలు కలిసి ఉండాలని  ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తాను అయినా మీరు కరుణించలేదు.. అయినా సరే ఏనాడూ మిమ్మల్ని నిందించలేదు.. దయ చేసి ముకుంద తాను ప్రేమించింది మురారీని అని చెప్పకుండా చేయండి అని ప్రార్థిస్తుంది రేవతి.. ప్లీజ్ అనుకుంటే.. ఇలా అడిగితె ఏమి చెప్పను అత్తయ్య నా ప్రేమ జీవితం.. పెళ్లి రెండు ప్రశ్నార్ధం అయ్యాయి.. అనుకుంటుంటే.. భవానీ అంటే ముకుంద ప్రేమ విషయం తెలిసే ఆదర్శ్ ఇంటికి రాలేదు అని కన్ఫామ్ చేసుకుని అడిగేది నిన్నే ముకుంద నాకు సమాధానం చెప్పు అని నిలదీస్తుంది భవానీ..

ముకుంద నీ మౌనమే అంగీకారం అయితే ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ముకుంద షాక్ తింటుంది. అత్తయ్య అంటే ఇంకెప్పుడు నా కంటికి కూడా కనిపించకు..అంటే.. నేను అతనిని ప్రాణ పదంగా ప్రేమించి నిజమే కానీ.. మా పెళ్లి తర్వాత నా ప్రేమని నేను సమాధి చేసుకున్నా నన్ను నమ్మండి అత్తయ్య అని కాళ్ళమీద పడి మరీ క్షమాపణ చెబుతూ అడుగుతుంది.. ముకుంద మాటలకు రేవతి ఓ రేంజ్ లో షాక్ తింటుంది.. నీ ప్రేమే నా కొడుకుని నాకు దూరం చేసింది ముకుంద.. నీ కన్నీరుతో నా కడుపు కోత చల్లారదు అని భవానీ అనుకుంటూ.. ఉన్నఫలంగా నా ప్రేమ విషయం తెలుసుకోవాలని ఎందుకు అనిపించిందో తెలియదు.. మీరు నిజం తెలుసుకుంటేనే నా ప్రేమ నిలబడుతుంది అనిపిస్తుంది అని ఆలోచిస్తుంది ముకుంద..

సోమవారం ఎపిసోడ్ లో

కృష్ణ దిగులుగా శిబిరంలో ఉంటే కృష్ణ అంటూ మురారి వచ్చాడు అని ఆలోచిస్తుంది.. ఆదర్శ తో విడాకులు ఇప్పించి ముకుంద ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించడానికి రెడీ అయినా భవానీ ఆనందంలో ముకుంద..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే