Karthika Deepam: కార్తీక్‌కు డెడ్ లైన్ పెట్టిన రోషిణి..మరో వికృత ప్లాన్‌తో మోనిత..వంటలక్కను నమ్మని పిల్లలు!

కార్తీకదీపం సీరియల్ రసకందాయంలో పడింది. అందరినీ ఆకట్టుకుంటూ బుల్లితెరపై నంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ ఉత్కంఠ భరితంగా మారింది.

Karthika Deepam: కార్తీక్‌కు డెడ్ లైన్ పెట్టిన రోషిణి..మరో వికృత ప్లాన్‌తో మోనిత..వంటలక్కను నమ్మని పిల్లలు!
Karthika Deepam Episode 1129:ACP Roshini Deadline to Karthik
Follow us
KVD Varma

|

Updated on: Aug 27, 2021 | 8:12 AM

Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ రసకందాయంలో పడింది. అందరినీ ఆకట్టుకుంటూ బుల్లితెరపై నంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ ఉత్కంఠ భరితంగా మారింది. ఉన్మాద ప్రేమకు.. ఉన్నత బంధానికి మధ్యలో జరుగుతున్న సంఘర్షణ నేపథ్యంలో సాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు 1129వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సీరియల్ లో ఈరోజు ఏమి జరగబోతోందో తెలుసుకోబోయే ముందు నిన్నటి ఎపిసోడ్ 1128లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.

నిన్నటి ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే..

లాకప్‌లో ఉన్న కార్తీక్ దగ్గరకు దీప వస్తుంది. తాను మోనితను చూశానని చెబుతుంది. కానీ, కార్తీక్ నమ్మడు. అదంతా దీప భ్రమ అని కొట్టిపారేస్తాడు. అయితే, దీప మాత్రం తాను నిజంగానే మోనితను చూశాను అని చెబుతుంది. ఈలోపు అక్కడకు మారువేషంలో మోనిత టీ తీసుకువస్తుంది. మూగమ్మాయి అని రామసీత చెప్పిన విషయాన్ని ఎస్ఐ కి చెబుతాడు కార్తీక్. మోనిత టీ తీసుకువచ్చి కార్తీక్ కు ఇస్తుంది. ఈ సమయంలో ఆమె చేతివేళ్లు కార్తీక్ కు తగులుతాయి. మోనిత తిరిగి వెళ్లబోతుండగా గాజు పెంకు కాలికి గుచ్చుకుంటుంది. దీంతో ఆమె అబ్బా అంటుంది. కార్తీక్ కు అనుమానం వస్తుంది. ఆమె వెళ్లిపోతుంటే పరీక్షగా చూస్తాడు. ఆమె మోనిత అని గుర్తుపడతాడు. కానీ, ఆ విషయం దీపకు చెప్పడు. ఏసీపీ రోషిణికి చెప్పాలని అనుకుంటాడు. దీప అతని దగ్గర నుంచి ఇంటికి బయలుదేరుతుంది. దారిలో మోనిత తనకు కనబడిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది. నేను మోనితను చూశాను అని చెబితే ఎవరూ నమ్మరేమిటి అని అనుకుంటుంది. మోనిత నిజంగా బ్రతికే ఉంటె..ఆమెను ఎలాగైనా పట్టుకుని తీసుకు వచ్చి రోషిణి ముందు పాడేస్తాను అని అనుకుంటుంది. ఇదీ నిన్నటి ఎపిసోడ్ లో జరిగింది. ఈరోజు ఏమి జరిగిందో తెలుసుకుందాం.

మోనిత ఆంటీ ఏమైంది?

ఇంటిదగ్గర సౌందర్య ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు సౌర్య, హిమ ఇద్దరూ దిగులుగా రోడ్డు వైపు చూస్తూ నిలుచుని ఉంటారు. దీంతో సౌందర్య ఏమైంది ఇక్కడున్నారు అని అడుగుతుంది. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నానమ్మా.. అసలు చెప్పకుండా వెళ్ళిపోతోంది అని అడుగుతారు. దానికి సౌందర్య వచ్చేస్తుంది అని అంటుంది. అది మాకు తెలుసు. అసలు ఎందుకు అమ్మ అన్నీ అబద్ధాలు  చెబుతుంది. ఎప్పుడూ ఇంతే.. అమ్మ అన్నీ అబద్ధాలే చెబుతుంది. అంటుంది సౌర్య దానికి హిమ కూడా అవును నిజమే అమ్మ అన్నీ అబద్ధాలు చెబుతుంది అని అంటుంది. దీంతో, సౌందర్య ముందు ఇద్దరినీ కోప్పడుతుంది. కానీ, తరువాత వారిని బుజ్జగిస్తుంది. ”కొన్ని పిల్లలకు అర్ధం కావని చెప్పరు. కొన్ని విషయాలు పిల్లలకు తెలియకూడదని చెప్పారు. మరికొన్ని విషయాలు పిల్లలు బాధపడతారని చెప్పరు. అంతేకానీ, అబద్ధాలు చెప్పాలని ఎవరూ అనుకోరు.ఇక మీ అమ్మ ఎంత కష్టపడిందో తెలుసుకదా. పదేళ్లు ఒంటరిగా ఉంది. తీరా మీ డాడీతో కలిసి సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీ నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. వాడిని విడిపించాలని ప్రయత్నిస్తోంది.” అని చెబుతుంది. ఈలోపు పిల్లలకు మోనిత కనిపించడం లేదేమిటి అనే అనుమానం వస్తుంది. అదే విషయాన్ని సౌందర్యను అడుగుతారు. మీ డాడీ పోలీస్ స్టేషన్ లో ఉంటె.. అది ఇక్కడకు ఎందుకు వస్తుంది? పోలీస్ స్టేషన్ కు ఇంతకు ముందే వెళ్లి మీ నాన్నను కలిసి వెళ్లిందట. అప్పుడు మీ అమ్మ కూడా అక్కడే ఉందట అని చెబుతుంది.

అదొక్కటే భ్రమ ఎందుకు అవుతుంది?

దీప ఎలాగైనా మోనిత గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడుతుంది. తులసి ఇంటికి వెళుతుంది. మోనిత గురించి ఆరాతీసేలోపు.. ఆమె మోనిత ను కార్తీక్ చంపేశాడు అనే అర్ధం వచ్చేలా మాట్లాడుతుంది. కానీ, దీప మోనితను తాను చూశాననీ, ఆమె బ్రతికే ఉందని తులసితో చెబుతుంది. దానికి తులసి నిన్ను చూసి జాలేస్తోంది దీపా అంటుంది. జాలి పడకు తులసీ.. ఇంకా నన్ను పిచ్చిదాన్ని అని అన్నా.. నాకు బాధ ఉండదు. జాలిపడితే బాధ వస్తుంది. నువ్వు మోనిత బ్రతికి ఉందంటే నమ్మడం లేదు. నువ్వేకాదు ఎవ్వరూ నమ్మడం లేదు. నేను భ్రమ పడుతున్నాను అంటున్నారు. నేను గుడికి వెళ్ళింది నిజం. పూజారిగారు నాకు అంతా మంచే జరుగుతుందని చెప్పింది నిజం. నేను అఖండ దీప పూజ చేసింది నిజం. దీపం వెలిగించింది నిజం. సోది చెప్పించుకోవడానికి వెళ్లడం నిజం.. కానీ, మోనితను చూసాను అనేది ఒక్కటే భ్రమ అంటున్నారు. అసలు ఎవరికైనా అర్ధం అవుతోందా? అన్ని నిజాల మధ్యలో అది ఒక్కటే ఎందుకు భ్రమ అవుతుంది? అని గట్టిగా తులసికి చెబుతుంది. తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

అంత రిస్క్ అవసరమా?

అక్కడ మోనిత నెల మీద కూచుని పెరుగన్నం తింటూ ఉంటుంది. కానిస్టేబుల్ రామసీత కూడా అక్కడ ఉంటుంది. ”ఏమిటి రామసీతా.. అలా చూస్తున్నావు? నువ్వు మంచి బిర్యానీ తెస్తే.. నేను పెరుగన్నం తింటున్నాను అనేనా? నా కార్తీక్ అక్కడ లాకప్ లో మీరు పెట్టెది తిని బతుకుతుంటే.. నేను ఇక్కడ బిర్యానీ ఎలా తింటాను?” అని ప్రశ్నిస్తుంది. దానికి రామసీత”మేడం మీరు అదోలా కనిపిస్తున్నారు. కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోండి మేడం తరువాత అన్నీ ఆలోచిద్దాం” అని చెబుతుంది. కానీ, మోనిత వినదు. నేను ఒక ప్లాన్ వేశాను. అని ఆమెకు ఎదో చెబుతుంది. దానికి రామసీత ఇది చాలా రిస్క్ మేడం. మీరున్న పరిస్థితిలో ఇది అవసరమా? అని అడుగుతుంది. రిస్క్ ఏమీలేదు. నీకు అసలు ఇబ్బంది లేదు. నేను అన్నీ చూసుకుంటాను చెప్పినట్టు చేయి అని చెబుతుంది.

దేవుడా నీదే భారం 

ఇక భాగ్యం దేవుడికి నైవేద్యం పెట్టి.. కార్తీక్ ను ఈ కష్టం నుంచి రక్షించాలని వేడుకుంటుంది. శనివారం ఉపవాసం ఉంటాను అని మొక్కు కుంటుంది. నేను మంచిదానిగా లేనపుడు ఇవన్నీ నాకు తెలిసేవి కాదు. కార్తీక్, దీపల పుణ్యమా అని మంచీ చెడూ తెలుసుకున్నాను. ఈలోపు ఇలా అయింది. ఎలాగైనా నువ్వే కార్తీక్ ను రక్షించాలి తండ్రీ అని దేవుడ్ని ప్రార్ధిస్తుంది.

కార్తీక్‌కు డెడ్‌లైన్ 

పోలీస్ స్టేషన్ లో ఏసీపీ రోషిణి ముందు కార్తీక్ కూర్చుని ఉంటాడు. ”ఏమిటి మిస్టర్ కార్తీక్..రోజూ నేను పిలిచేదానిని. నేను మిమ్మల్ని పిలవకుండానే, నన్ను కలుసుకోవాలని తొందరపడ్డారు? ఏమైంది? మోనిత శవం ఎక్కడ ఉందొ చెప్పబోతున్నారా? అని అడుగుతుంది. కాదు మేడం.. మోనిత ఎక్కడుందో చెప్పబోతున్నాను అంటాడు కార్తీక్.. దీంతో షాక్ అవుతుంది రోషిణి. కానీ, కార్తీక్ చెప్పిన మాట నమ్మాదు. ”నిన్న మోనిత సోదామె లా వచ్చింది అని మీ ఆవిడ చెప్పింది. ఈరోజు పోలీస్ స్టేషన్ కు టీ అమ్మేదానిలా వచ్చింది అని మీరు చెబుతున్నారు. ఇదేమన్నా డిటెక్టివ్ నవల అనుకుంటున్నారా?” అని కఠినంగా మాట్లాడుతుంది. మీరు డాక్టర్ అని మీకు అవకాశం ఇస్తున్నాను. కానీ, మీరు కట్టుకథలు చెప్పి నిజాన్ని అబద్ధంలా మార్చాలని చూస్తున్నారు అని కోప్పడుతుంది. దీనికి కార్తీక్.. ”దీప చెప్పిన విషయం నేనూ నమ్మలేదు మేడం. కానీ, ఈరోజు చూశాను. అది నిజం. అందుకే మీకు చెబుతున్నా”. అంటాడు. దీంతో ఏసీపీ రోషిణి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతోంది. కార్తీక్ కు ఇక కొద్దిగంటలే టైం ఇస్తున్నాననీ, ఈలోపు మోనిత శవం ఎక్కడుందో చెప్పాలనీ లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందనీ హెచ్చరిస్తుంది.

ఇదీ ఈరోజు కార్తీకదీపం కథ. మరి రోషిణి నిజం తెలుసుకోగలదా? దీప మోనితను పెట్టుకుంటుందా? మోనిత ఏమి ప్లాన్ వేసింది? ఇవన్నీ తెలియాలంటే రేపటి (ఎపిసోడ్ 1130) వరకూ ఆగాల్సిందే.

మరిన్ని కార్తీకదీపం కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karthika Deepam: మోనితను గుర్తుపట్టిన కార్తీక్..ఎలాగైనా కార్తీక్‌ను విడిపించాలనే ప్రయత్నంలో దీప!

Karthika Deepam: కార్తీకదీపంలో కొత్తమలుపు.. మరో పథకం వేసిన మోనిత.. దీపను నిలదీసిన పిల్లలు.. 

Karthika Depam: సూపర్ ట్విస్ట్.. మోనిత బ్రతికే ఉందని తెలుసుకున్న దీప.. నమ్మని కుటుంబం!

Karthika Deepam: మోనిత రాక్షసత్వం..దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. గుడిలో కుప్పకూలిన వంటలక్క!

Karthika Deepam: మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను..సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి!