Bigg Boss Telugu Season 5: ఉత్కంఠకు తెర పడింది.. బిగ్ బాస్ సీజన్ 5టెలికాస్ట్ అయ్యేది అప్పుడే.
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో
Bigg Boss Season 5: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్ షో ఇప్పుడు సీజన్ 5తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. ఈ గేమ్ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఆటలు, పాటలు, స్కిట్లు, అల్లర్లు, అప్పుడప్పుడు గ్లామర్ షోస్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. మొదటి సీజన్ తారక్ స్టైల్‌లో ఈ గేమ్ షో టాప్ రేటింగ్‌కు వెళ్ళింది. అలాగే తారక్ తర్వాత నేచురల్ స్టార్ నాని ఈ గేమ్ షోను నడిపించారు. సీజన్ 2కి నాని హోస్ట్‌గా చేశారు. ఆతర్వాత సీజన్ 3,4 లను కింగ్ నాగార్జున తన భుజాలమీద వేసుకున్నారు. ఈ రెండు సీజన్‌లకు నాగ్ హోస్ట్ ఆ వ్యవహరించాడు. ఇక ఇప్పుడు సీజన్ 5 రెడీ అవుతుంది.
ఇప్పటికే సీజన్ 5 నుంచి ప్రోమో కూడా విడుదల చేశారు నిర్వాహకులు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సస్పెన్స్‌కు తెర దింపింది బిగ్ బాస్ యాజమాన్యం. తాజాగా ‘బిగ్ బాస్-5’ షో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల 5న సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు టెలికాస్ట్ అయ్యే ఈ రియాలిటీ షో.. శని ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకే మొదలవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో కూడా ఈ తెలుగు రియాలిటీ షో అందుబాటులో ఉంటుంది. ఇక బిగ్ బాస్‌లో ఎవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారన్నదాని పై ఇప్పటికి ఉత్కఠ నెలకొంది. కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్లలో యాంకర్ రవి – షణ్ముఖ్ జస్వంత్- ఆర్జే కాజల్ (యాంకర్)- నవ్య స్వామి (సీరియల్ హీరోయిన్)- నిఖిల్ (యాంకర్)- సిరి హనుమంత్ (సీరియల్ నటి)- శ్రీహాన్ (సీరియల్ నటుడు)- జస్వంత్ పాదాల (మోడల్)- వీజే సన్నీ (సీరియల్ నటుడు)- ప్రియాంకా రామన్ (క్రాక్ ఫేమ్)- జబర్దస్త్ ప్రియాంక అలియాస్ సాయి (ట్రాన్స్ జెండర్)- లోబో (యాంకర్)- సినీ నటి ప్రియ- ఈషా చావ్లా- ఉమాదేవి (కార్తీకదీపం భాగ్య)- ఆనీ మాస్టర్ (కొరియోగ్రాఫర్)-యాంకర్ రోజా – మానస్ (టీవీ నటుడు)- 7 ఆర్ట్స్ సరయు- జ్యోతి రాజ్ (ఆట సందీప్ భార్య)- ఆట సందీప్. ఈ పేర్లు దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :