Vijay Sethupathi: ఓటీటీలోకి మక్కల్ సెల్వన్ సినిమా.. ఆకట్టుకుంటున్న అనబెల్ సేతుపతి ఫస్ట్‏లుక్ పోస్టర్..

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన సినిమాలోని రాయనం పాత్రలో నటించిన విజయ్

Vijay Sethupathi: ఓటీటీలోకి మక్కల్ సెల్వన్ సినిమా.. ఆకట్టుకుంటున్న అనబెల్ సేతుపతి ఫస్ట్‏లుక్ పోస్టర్..
Vijay Sethupathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 26, 2021 | 9:03 PM

తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఉప్పెన సినిమాలోని రాయనం పాత్రలో నటించిన విజయ్ నటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటనకు విమర్శకులు ప్రశంసలు అందుకోవడమే కాకుండా..ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా అనబెల్ సేతుపతి. ఇందులో విజయ్ సేతుపతికి జోడిగా తాప్సీ హీరోయిన్‏గా నటిస్తుంది హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‏ పోస్టర్ విడుదల చేయగా.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. అందులో విజయ్ సేతుపతి రాయల్ లుక్కులో కనిపించగా.. తాప్సీ రాజకుమారీ గౌనులో కనిపించింది.

అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా..ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీ సెప్టెంబర్ 17న డిస్నీ+ హాట్‏స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న తాప్సీ, విజయ్ సేతుపతి కలిసి ఈ మూవీ చేస్తుండడంతో అనబెల్ సేతుపతి సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు విజయ్ సేతుపతి. మాస్టర్ చెఫ్ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహిరించనున్నాడు.

ట్వీట్..

Also Read:  Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..

మోడల్ ప్రాణం మీదికి వచ్చిన ఫోటోషూట్.. ఫోటోల కోసం వెళితే కోసం వెళితే చిరుతల దాడి..

Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

Aamani: అప్పుడు అందగత్తెను కాదని ఎగతాళి చేశారు.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ఆమని..