AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamani: అప్పుడు అందగత్తెను కాదని ఎగతాళి చేశారు.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ఆమని..

సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యారు ఆమని.

Aamani: అప్పుడు అందగత్తెను కాదని ఎగతాళి చేశారు.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ఆమని..
Aamani
Rajitha Chanti
|

Updated on: Aug 26, 2021 | 6:40 PM

Share

సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యారు ఆమని. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఆమని. జంబలకిడిపంబ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమని.. ఆ తర్వాత మిస్టర్ పెళ్లాం, శుభలగ్నం, మావిడాకులు వంటి సినిమాలకు సూపర్ హిట్స్ అందుకున్నారు. కుటుంబతరహ చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‎ను ఆకట్టుకున్నారు ఆమని. ఒకప్పుడు టాప్ హీరోయిన్ రేసులో చాలా కాలం కొనసాగిన ఆమని.. ఆ తర్వాత మెల్లగా సినిమాలకు  దూరమయ్యారు. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఆమని. ఒక వైపు వెండితెరపై వరుస సినిమాలు చేస్తూనే.. తాజాగా బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తుంది. ముత్యమంతా ముద్దు సీరియల్ ద్వారా బుల్లితెరపై అలరించడానికి సిద్ధమైన ఆమని.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

తనకు ఐదెళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి ఉండేదని.. శ్రీదేవి, జయసుధల సినిమాలైతే అస్సలు చూడకుండా ఉండలేకపోయేదాన్ని అని తెలిపారు. అలాగే జంబలకిడిపంబ సినిమాలో మాదిరిగానే మగవాళ్లు, ఆడవాళ్లుగా ఉంటేటట్లు నిజజీవితంలోనూ ఉండాలని..అప్పుడే ఆడవాళ్ల కష్టాలు మగవాళ్లకు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. తనకు సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేదని.. సినిమాల్లో నటించాలని ఉందని తన కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు బంధువులు ఎగతాళి చేశారని చెప్పారు. ఆమె సినిమాల్లో నటించమేంటీ ? అంత పెద్ద అందగత్తె కాదు కదా అంటూ ఎగతాళి చేశారని చెప్పుకొచ్చారు ఆమని. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ఆమని ప్రేక్షకులను అలరించింది.

Also Read: Pushpa: పుష్ప సినిమా పై మరో బజ్.. పుష్పరాజ్ అన్న పాత్రలో ఫేమస్ యాక్టర్..

Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి-బాబీ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్…

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 షోకి రంగం సిద్ధం.. నేటి నుంచి క్వారంటైన్‌లో సభ్యులు.. అలరిస్తున్న ప్రోమో