AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Batch Trailer: యంగ్ హీరో ఆకాష్ పూరీ చేతుల మీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల..

సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్యాచ్. ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో

Batch Trailer: యంగ్ హీరో ఆకాష్ పూరీ చేతుల మీదుగా బ్యాచ్ ట్రైలర్ విడుదల..
Batch Trailer
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 26, 2021 | 7:03 PM

సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్యాచ్. ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో ఈ చిత్రాన్ని రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్నారు. మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‏గా రూపొందుతున్న ఈ సినిమాకు రఘు కుంచే సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‏ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరీ జగన్నాధ్ తనయుడు యంగ్ హీరో ఆకాష్ విడుదల చేశాడు.

ఈ సందర్భంగా పూరి ఆకాష్ మాట్లాడుతూ “ట్రైలర్ చూసా, చాలా ఆసక్తికరంగా ఉంది. రఘు కుంచే సంగీతం చాలా హైలైట్‏గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. పాటలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈచిత్ర నిర్మాత సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తాను అంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా థియేటర్‏లోనే విడుదల చేస్తాననటం గొప్ప విషయం. మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. సాత్విక్ చైల్డ్ యాక్టర్‏గా చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా పాజిటివ్‏గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అల్ ది బెస్ట్ సాత్విక్. ఈ సినిమా మంచి విజయం సాదించాలి” అన్నారు.

సహా నిర్మాత సత్తి బాబు కసిరెడ్డి మాట్లాడుతూ “బ్యాచ్ చిత్రానికి మొదటి విజయం రఘు కుంచే సంగీతం. పాటలు అద్భుతంగా వచ్చాయి. దర్శకుడు శివ, కెమెరా మాన్ వెంకట్ మరియు ఇతర టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని” చెప్పారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ “కాకినాడ లో నలుగురు స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాను, నిర్మాత రమేష్ గారు ఒక పునాదిగా నిలిచారు. అందరూ కష్టపడి పని చేసాం. సినిమా బాగ వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది” అన్నారు.

హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ “ఈ కథ వినగానే బాగా నచ్చింది. వెంటనే స్టార్ట్ చేసాము. రఘు గారి సంగీతం మా సినిమాకు ప్రాణం పోసింది. నిర్మాత  బాగా సపోర్ట్ చేసారు. ప్రతి టెక్నిషన్ బాగా సపోర్ట్ చేసారు. పూరి ఆకాష్  నా సినిమా ట్రైలర్ విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది”అన్నారు.

Also Read:  Aamani: అప్పుడు అందగత్తెను కాదని ఎగతాళి చేశారు.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన ఆమని..

Sonu Sood: ఎస్కలేటర్ పై సోనూసూద్ విన్యాసాలు.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. వీడియో వైరల్..