Rocking Rakesh: ‘రోజా నాకు అమ్మలాంటి వ్యక్తి… అడగకుండానే ఎంతో సాయం చేశారు’: జబర్దస్త్ రాకింగ్ రాకేష్

జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకడు. తన స్కిట్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెడుతున్నాడు. కేసీఆర్ సినిమాతో హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

Rocking Rakesh: 'రోజా నాకు అమ్మలాంటి వ్యక్తి... అడగకుండానే ఎంతో సాయం చేశారు': జబర్దస్త్ రాకింగ్ రాకేష్
Rocking Rakesh, Roja
Follow us

|

Updated on: Oct 20, 2024 | 2:41 PM

కంటెంట్ పై కొన్ని విమర్శలున్నా జబర్దస్త్ షో కామెడీ మాత్రం చాలా మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఇచ్చిన నటీనటులు చాలా మందే ఉన్నారు. బలగం వేణు, సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, ధనాధన్ ధనరాజ్, కిర్రాక్ ఆర్పీ, చలాకీ చంటి తదితరులు జబర్దస్త్ షో ద్వారా సినిమాల్లోకి వచ్చిన వారే. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో జబర్దస్త్ నటుడు చేరాడు. అతనే రాకింగ్ రాకేష్. జబర్దస్త్ లో కంటెస్టెంట్ నుంచి టీమ్ లీడర్ గా ఎదిగిన రాకేష్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను హీరోగా నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేసీఆర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. రాకింగ్ రాకేష్ తో పాటు అతని సతీమణి జోర్దార్ సుజాత, అనసూయ, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాకింగ్ రాకేష్ జజబర్దస్త్ జడ్జి, మాజీ మంత్రి రోజా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘నాకు కూతురు పుట్టిన తర్వాత మొదట వచ్చిన వ్యక్తి రోజా గారు. ఆమె గడప బయటే రాజకీయాలను వదిలేసి వచ్చారు. రోజమ్మ నాకు అన్నం పెట్టింది. నా కష్టాల్లో డబ్బులు కావాలంటే సహాయం చేసింది. అడగకుండా కూడా నాకు డబ్బులు సహాయం చేసిన వ్యక్తి అంటే రోజా మాత్రమే. కొంతమంది రోజా నుంచి లబ్ధి పొంది కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అది వాళ్ల వ్యక్తిగతం అని’ ఇన్ డైరెక్టుగా రోజాను విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చాడు రాకింగ్ రాకేష్. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రోజాతో జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత.. వీడియో..

రోజా ఫ్యామిలీతో సరదాగా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!