AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heena Khan: క్యాన్సర్‌పై పోరాడుతున్న హీరా ఖాన్ గోర్లపై ట్రోలింగ్.. ఇది కీమో సైడ్ ఎఫెక్ట్ అంటూ రిప్లై

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని భయపెడుతోన్న వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి సైలెంట్ గా శరీరంలోకి చేరి మృత్యువుగా మారుతోంది. అయితే క్యాన్సర్ వస్తే ప్రాణం పోదని.. భయం అత్యంత ప్రమాదకరం. ప్రాణాలను హరిస్తుందని క్యాన్సర్ ను జయించిన వ్యక్తులు చెబుతున్నారు. భారతీయ టెలివిజన్ రంగంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకరు హీనా ఖాన్. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు.. క్యాన్సర్ బారిన పడినట్లు తెల్సింది. అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉన్నట్లు తెలిసింది. తాజాగా హీనా ఖాన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి అనేక విషయాలను పంచుకుంది. ఈ ప్రమాదకరమైన వ్యాధిని ఎదుర్కోవడానికి అనేక రకాల చికిత్సలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది.

Heena Khan: క్యాన్సర్‌పై పోరాడుతున్న హీరా ఖాన్ గోర్లపై ట్రోలింగ్.. ఇది కీమో సైడ్ ఎఫెక్ట్ అంటూ రిప్లై
Hina Khan
Surya Kala
|

Updated on: Mar 17, 2025 | 12:52 PM

Share

బుల్లి తెరపై స్టార్ హీరోయిన్ హీనా ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హీనా ఖాన్ .. ఇప్పటికి కీమోథెరపీ సెషన్‌లను పూర్తి చేసుకుంది. అయితే ఈ సెషన్‌లు పూర్తయిన తర్వాత కూడా హీనా ఖాన్ కీమోథెరపీ వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కొంటోంది. ఇటీవల హీనాఖాన్ తన తల్లి చేయి పట్టుకున్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉన్న ఆమె గోళ్లను చూసి కొంతమంది అభిమానులు రకరకాల కామెంట్స్ చేశారు. రంజాన్ నెలలో నమాజ్ చేసే సమయంలో గోర్లకు పాలిష్ ఉండకూడదు అని ఒక నియమం ఉంది. అది గుర్తు చేస్తూ హీనా ఖాన్ ను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. రకరకాలుగా వ్యాఖ్యానించారు. హీనా ఖాన్ తన గోర్ల రంగుపై వస్తున్న కామెంట్స్ కు స్పందించింది.

తాను తన గోర్లకు ఎటువంటి నెయిల్ పాలిష్ వేసుకోలేదని చెప్పింది. అంతేకాదు తన గోర్లు ఇలా కావడానికి కారణం క్యాన్సర్ చికిత్సకోసం తీసుకున్న చికిత్స వలన వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని వెల్లడించింది. తాను తీసుకుంటున్న చికిత్స కారణంగా గోర్లు ఎండిపోయాయి. కొన్నిసార్లు రాలిపోతున్నాయి అని తెలిపింది.

హీనా ఖాన్ తన గోళ్ల చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. చాలా మంది తన గోళ్ల గురించి అడుగుతున్నారు. మీరు మాత్రమే కాదు.. తన దగ్గర ఉన్నవారు కూడా తన గోర్లను చూసి రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే నేను నా గోర్లకు ఎలాంటి నెయిల్ పాలిష్ వేసుకోలేదని చెబుతున్నాను. నేను నెయిల్ పాలిష్ లేకుండా నమాజ్ చేస్తాను. అయితే ఇప్పుడు కనిపిస్తున్న తన గోర్ల రంగు మారిపోవడానికి కారణం కీమోథెరపీ దుష్ప్రభావం అని చెప్పింది. ”

ఇవి కూడా చదవండి

కీమోథెరపీ సెషన్‌లు పూర్తి

క్యాన్సర్ కు తీసుకుంటున్న చికిత్స కారణంగా తన గోర్లు పెళుసుగా, పొడిగా మారాయి. వీటి రంగు మారిపోయాయి. కొన్నిసార్లు గోళ్లు విరిగి వాటంతట అవే రాలిపోతాయి. అయితే ఇదంతా తాత్కాలికమే.. బాడ్ లో గుడ్ ఏమిటంటే తాను నెమ్మదిగా కోలుకుంటున్నానని చెప్పింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో హీనా ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తన కీమోథెరపీ సెషన్‌లు పూర్తయ్యాయని, ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించిన ఇతర చికిత్సలను తీసుకుంటున్నానని వెల్లడించింది. క్యాన్సర్ తో పోరాడుతున్న హీనా ఖాన్ బుల్లి తెరపై కనిపిస్తూనే ఉంది. ఇటీవల హీనా ఖాన్ సోనీ టీవీలోని రియాలిటీ షో ‘సెలబ్రిటీ మాస్టర్ చెఫ్’లో పాల్గొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..