AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి వేణు స్వామి! ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే! రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్!

ఈసారి హౌజ్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల లిస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్‌లో వేణు స్వామి కంటెస్టెంట్‌గా రానున్నారనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి.

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌లోకి వేణు స్వామి! ఇక హౌజ్‌లో రచ్చ రచ్చే! రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్!
Astrologer Venu Swamy
Basha Shek
|

Updated on: Jul 06, 2024 | 7:49 PM

Share

బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ రియాలిటీ షో 8 వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. బహుశా ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి హౌజ్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల లిస్టులు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్‌లో వేణు స్వామి కంటెస్టెంట్‌గా రానున్నారనే వార్తలు నెట్టింట వైరలవుతున్నాయి. ప్రముఖుల జాతకాలు.. అందులోనూ సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తోన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పైగా ఈ స్వామి మనసులో ఏదీ దాచుకోడు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు. బిగ్ బాస్ యాజమాన్యానికి కూడా కావాల్సింది ఇదే. ఇలాంటి నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తుల వల్ల బిగ్ బాస్ కు అవసరమైన కంటెంట్ వస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అందుకే వేణు స్వామిని హౌజ్‌లోకి రప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

కాగా వేణు స్వామి బయట పూజలు చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. మరి అలాంటప్పుడు సుమారు 100 రోజుల పాటు స్వామి బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలనుకుంటే అంతకు మించే దక్కాలి. అందుకే ఆయనకు ఈ సీజన్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. ఒకవేళ ఇదే నిజమై బిగ్ బాస్ హౌజ్ లోకి వేణు స్వామి గనుక ఎంట్రీ అయితే మాత్రం ఎంటర్ టైన్మెంట్ కు కొదవ ఉండదని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

కన్నడ హీరోయిన్ ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు

వీరు కూడా..

కాగా బిగ్ బాస్ సీజన్ 8 లో కుమారి ఆంటీతోపాటు బర్రెలక్క, అమృత ప్రణయ్, అలాగే యూట్యూబర్ నేత్ర, మోటివేషనల్ స్పికర్ వంశీ తదితరులు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటీనటులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రహ్మమూడి ఫేమ్ కావ్య కూడా ఈ సారి హౌస్ లోకి రానున్నట్లు టాక్ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..