Prabhas Sreenu: ‘ప్రభాస్ రాజు అయితే.. నేను మంత్రినట.. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నాను’.. ప్రభాస్ శ్రీను ఆసక్తికర కామెంట్స్..
దాదాపు 300 కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రీను గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత కమెడియన్ అలీ నిర్వహిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి..
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వందల చిత్రాల్లో నటించి మెప్పించారు ప్రభాస్ శ్రీను. పవర్ ఫుల్ విలన్గా.. కమెడియన్గా.. స్నేహితుడిగా.. సోదరుడిగా ఎన్నో సహయ పాత్రలలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300 కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రీను గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత కమెడియన్ అలీ నిర్వహిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి.. తన వ్యక్తిగత జీవితం .. సినీ కెరీర్ గురించి ప్రభాస్ తో తన స్నేహం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాల్లో కనిపించడం లేదేంటీ ? అని అడగ్గా.. శ్రీను స్పందిస్తూ.. కొవిడ్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చిందని.. ప్రస్తుతం ప్రభాస్తో ఉంటున్నాని.. మంచి క్యారెక్టర్స్ వచ్చిన్పపుడు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే తనకు భక్తి చాలా ఎక్కువ అని.. వినాయకుడి భక్తుడిని అని.. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి లేదని.. నన్ను డాక్టర్ చేయాలని నాన్న కల అని.. కానీ యాక్టర్ అయ్యాననే బాధలేదని అన్నారు.
అలాగే తాను సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ప్రభాస్ కూడా ఉన్నారని.. ఆయన బ్యాచ్ లో తాము కో ఆర్టిస్టులమని.. అలా ఏర్పడిన పరిచయం ఇప్పటిదాకా కొనసాగుతుందని.. ప్రస్తుతం ఆయనకు సహాయకుడిగా ఉంటున్నాని అన్నారు. తనను కృష్ణంరాజు మంత్రి అని పిలిచేవారని.. ప్రభాస్ తో ఉంటాను కాబట్టి ఆయన రాజుగారు.. నేను మంత్రిని అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు 300 సినిమాల్లో చేసిన శ్రీను.. రోజు షూటింగ్ వెళ్లడం మాత్రమే అని.. రెమ్యునరేషన్ అంత ఇవ్వండి అని ఎప్పుడూ డిమాండ్ చేయనని..కేవలం పనిపై శ్రద్ధతో చేయాలని అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.