Brahmamudi, September 5th Episode: కావ్య, రాజ్‌ల మధ్య చిచ్చు పెట్టిన రాహుల్.. కవికి అప్పూ అదిరే గిఫ్ట్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణికి గట్టి కౌంటర్ ఇస్తుంది కావ్య. ఇక అప్పుడే రాజ్ రియాక్ట్ అవుతూ.. స్టాపిట్ కళావతి ఇప్పటి వరకూ నువ్వు వెళ్లి చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు.. ఈ ఇంటికో సాంప్రదాయం ఉంది. కనకపోయినా.. పెంచిన ప్రేమతో మా అత్తకు మా నాన్నమ్మా, తాతయ్య ఆడపడుచు హోదా ఇచ్చారు. ఆ స్థాయిని తగ్గించి మాట్లాడే వయసు, అనుభవం నీకు లేదు. ఇది ఇక్కడితో వదిలేయ్. సారీ అత్త అని రుద్రాణికి, సారీ రా రాహుల్.. ఇదంతా వదిలి పెట్టు రా అని రాహుల్‌కి చెప్తాడు రాజ్. ఏది మర్చిపోవాలి రాజ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రుద్రాణికి గట్టి కౌంటర్ ఇస్తుంది కావ్య. ఇక అప్పుడే రాజ్ రియాక్ట్ అవుతూ.. స్టాపిట్ కళావతి ఇప్పటి వరకూ నువ్వు వెళ్లి చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు.. ఈ ఇంటికో సాంప్రదాయం ఉంది. కనకపోయినా.. పెంచిన ప్రేమతో మా అత్తకు మా నాన్నమ్మా, తాతయ్య ఆడపడుచు హోదా ఇచ్చారు. ఆ స్థాయిని తగ్గించి మాట్లాడే వయసు, అనుభవం నీకు లేదు. ఇది ఇక్కడితో వదిలేయ్. సారీ అత్త అని రుద్రాణికి, సారీ రా రాహుల్.. ఇదంతా వదిలి పెట్టు రా అని రాహుల్‌కి చెప్తాడు రాజ్. ఏది మర్చిపోవాలి రాజ్.. ఈ ఇంట్లో అందరూ నన్ను నేరస్తుడిని చేసిన విషయం మర్చిపోవాలా.. ఎప్పుడూ నన్ను ఒక్క మాట అయినా అనని పెద్ద అత్తయ్య కొట్టిన చెంప దెబ్బ మర్చిపోవాలా.. నీ భార్య చేసిన సన్మానం మర్చిపోవాలా.. పొరపాట్లకు, నేరాలకు మధ్య గీతలు చెరిపేసి.. నన్ను పోలీసులకు పట్టించారు. అందుకే నేను ఇప్పటి నుంచి కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా అని రాహుల్ పైకి వెళ్లి పోతాడు.
సీతారామయ్యకు రాజ్ మాట..
శుభం.. ఈ ఇంటికి.. కంపెనీకి పట్టిన దరిద్రం దానంతట అదే వదిలి పోయింది. రాజ్ నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వమాకు అని స్వప్న అంటుంది. ఇక రాజ్‌ని పిలుస్తాడు సీతారామయ్య. రాహుల్ అరెస్ట్ అవ్వడం, తిరిగి రావడం వల్ల నీకు కొద్దిగా కంగారుగా ఉండొచ్చునని రాజ్ అంటే.. కంగారు కాదు రాజ్.. జరుగుతున్న అన్ని విషయాల గురించి భయ పడుతున్నా.. ఈ ఉమ్మడి కుటుంబం మరి కొద్ది రోజుల్లో చీలికలు అవ్వబోతుంది. ధాన్య లక్ష్మి ఎప్పుడైతే ఆస్తి పంపకాలు చేయాలని మొదలు పెట్టిందే అప్పుడే ఈ ఇంటికి బీటలు వారాయి. ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు ఈ ఇల్లు కూలిపోతుంది. ఒక్కసారి విడిపోవాలి అన్న విత్తనం మొదలయ్యాక అది మహా విత్తనంలా మారి అందరి మనసుల్లో చేరుతుంది. నా కోరిక ఒక్కటే రాజ్.. నా ఊపిరి ఉన్నంత వరకూ ఈ కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండాలి. ఈ తాతయ్య చివరి కోరిక తీర్చుతావా? అని సీతారామయ్య రాజ్ దగ్గర నుంచి మాట తీసుకుంటాడు. ఎలాగైనా ఈ కుటుంబాన్ని కలిపే ఉంచుతానని రాజ్ కూడా చెప్తాడు.
కావ్యని ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు రాహుల్ స్కెచ్..
ఆ తర్వాత రాహుల్, రుద్రాణిలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు దొంగ బంగారం కొనడం నిజమే కదా.. మరి దీని నుంచి ఎలా బయటకు వచ్చావు? అని రుద్రాణి అడుగుతుంది. ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. అందుకే నా ప్లేస్‌లో ఆ తప్పును ఒప్పుకోవడానికి వేరే వాడిని సెట్ చేసి ఉంచానని రాహుల్ అంటాడు. వావ్ శభాష్.. ఎక్కడైనా అడుగు వేయడం కంటే ముందే ప్రమాదం గ్రహించిన వాడే గెలుస్తాడని రుద్రాణి అంటుంది. ఈ రాహుల్ ఇప్పుడే ఆట మొదలు పెట్టాడు. ఆ కావ్యని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని రాహుల్ అంటే.. కావ్యే కాదు.. ఈ ఇంట్లో ఎవర్నీ వదిలి పెట్టకూడదు. ఎవరూ నీ మీద జాలి చూపించ లేదు. ఆ కావ్య మనకు చేసిన ద్రోహం ఇంటి నుంచి బయటకు చేసేలా నేను చేస్తానని రాహుల్, రుద్రాణిలు ఓ స్కెచ్ రెడీ చేసుకుంటారు.
కావ్య, రాజ్‌ల మధ్య చిచ్చు పెట్టిన రాహుల్..
ఆ తర్వాత రాజ్ గదిలో నిల్చును ఆలోచిస్తూ ఉంటాడు. కావ్య పాలు తీసుకొస్తుంది. కావ్య మీద కోపంగా ఉండాటు రాజ్. ఎందుకు నా మీద అంత కోపం అని అడుగుతుంది కావ్య. నువ్వు ఒక్క రోజు ఆగి ఉంటే రాహుల్ ఆ ఫ్రాడ్ చేయలేదని తెలిసేది కదా అని రాజ్ అంటే.. మీరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా రాహుల్ తప్పు చేశాడని కావ్య ఖచ్చితంగా చెబుతుంది. ఈ ఇంట్లోని పరిస్థితుల వల్ల ఈ ఇల్లు ముక్కలై పోయేలా ఉంది. మా తాతయ్య ఆరోగ్యం దెబ్బ తినేలా ఉంది. ఇల్లు ఎందుకు ముక్కలు అవుతుందో నాకు అర్థం కావడం లేదు. చీడ పురుగులను ఏరి పారేసినంత మాత్రాన ఇంటికి ఏమీ కాదు. ఒక వేళ రాహుల్ తప్పు బయట పెట్టకపోతే ఏమయ్యేది. రాహుల్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి.. తెలివిగా సాక్ష్యాలను మార్చేసి బయట పడ్డాడు. మీరు అరెస్ట్ అయ్యి ఉంటే.. అసలు జైలు నుంచి బయటకు వచ్చేవారు కాదని కావ్య అంటుంది. అయినా సరే అది నా ప్రాబ్లమ్. అదంతా నీకు సంబంధం లేని విషయమని రాజ్ అంటాడు. నాకు ఎందుకు సంబంధం లేదు? నా భర్తే నాకు ముఖ్యం. నేను కూడా ఈ ఇంటి కోడలినే అని కావ్య వాదిస్తుంది. అయినా కావ్యని అర్థం చేసుకుని రాజ్.. వాదిస్తూనే ఉంటాడు.
అప్పూ కోసం కళ్యాణ్ కంగారు..
కట్ చేస్తే.. కళ్యాణ్ గదిలో పడుకుని ఉంటాడు. నిద్రలో అప్పూపై చేయి వేస్తాడు. కానీ అక్కడ అప్పూ కనిపించదు. అటూ ఇటూ చూసి.. అక్కడ మొత్తం వెతుకుతాడు. కానీ అప్పూ కనిపించదు. దీంతో కంగారు పడుతూ బాధ పడతాడు కళ్యాణ్. అప్పుడే అప్పూ ఓ కొరియర్ బ్యాగ్ వేసుకుని వస్తుంది. ఇప్పుడు టైమ్ ఎంత అయింది? ఇదేమన్నా నీ పుట్టిల్లా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లి రావడానికి.. ఇప్పుడు నీ బాధ్యత నాది. నీకు ఏమైందో తెలీక గంట నుంచి తిరుగుతున్నా అంటూ అప్పూపై కేకలు వేస్తాడు. నువ్వు కనిపించకపోయే సరికి నిన్ను చంపేయాలన్న కోపం వచ్చిందని కళ్యాణ్ అంటాడు. ఒక ముఖ్యమైన పని వచ్చింది. పిజ్జా డెలివరీ ఇద్దామని అప్పూ అంటుంది. అసలు నిన్ను పని చేయవద్దు అన్నాను కదా.. ఎందుకు వెళ్లావు? అని కళ్యాణ్ ఆవేశంగా అడుగుతాడు. నీ మీద ప్రేమ ఎక్కువై వెళ్లానని అప్పూ అంటుంది.
కవివి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అప్పూ..
రా లోపలికి కళ్లు మూసుకోమని కళ్యాణ్‌ని అంటుంది. సరే అని కళ్యాణ్ కళ్లు మూసుకుంటాడు. ఈలోపు అప్పూ కళ్యాణ్ బర్త్ డేకి అంతా సిద్ధం చేస్తుంది. ఇక కళ్లు తెరిచి కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. నా కూచి బంగారానికి హ్యాపీ బర్త్ డే చెబుతుంది అప్పూ. థాంక్యూ సో మచ్ పొట్టి.. అసలు నా పుట్టిన రోజు అన్న విషయమే మర్చిపోయానని కళ్యాణ్ అంటాడు. అప్పుడే కళ్యాణ్‌కి గిఫ్ట్ ఇస్తుంది అప్పూ. అందులో పేపర్స్.. పెన్నులు ఉంటాయి. ఏంటి ఇవన్నీ ఎందుకు అని కళ్యాణ్ అంటాడు. నువ్వు కవివి కదా.. నీ ఇష్టం రాసుకోమని అప్పూ అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి