ఖర్జూరాలు తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

15 January 2025

samatha

అయితే, శీతాకాలంలో వీటిని తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయంట అవి ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

ఖర్జూరాల్లో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ప్రతి రోజూ దీనిని తినాలంట.

ఖర్జూరాల్లోని ఉండే ఫైబర్ మలబద్ధకానికి చెక్ పెడుతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఖర్జూరాలను మనం ప్రతి రోజూ తినడం వలన ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మన ఎముకలను ధృఢంగా ఉంచడంలో సహాయపడుతాయి

 ఖర్జూరాల్లో చక్కెరలు అధికంగా ఉండటం వల్ల శరీరానికి త్వరిత శక్తిని అందించడమే కాకుండా  ఇవి  అలసటను కూడా తగ్గిస్తుంది.

ఖర్జూరాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలో ఇమ్మ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అందుకే వీటిని ప్రతి ఉదయం మన డైట్‌లో చేర్చుకోవాలి

గర్భధారణ సమయంలో మహిళలు తప్పకుండా ఖర్జూరాను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. దీనిని  ఎక్కువగా తినడం వలన ప్రసవం సులభతరమవుతుంది