సాయి పల్లవి మరో డేరింగ్ స్టెప్.. స్టార్ హీరో సినిమాకు నో
15 January 2025
Basha Shek
అమరన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో పలు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో నాగచైతన్య తండేల్ మొదట విడుదల కానుంది.
డైరెక్టర్ చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
దీంతో పాటు బాలీవుడ్ లో రామాయణం సినిమాలో నటిస్తోందీ న్యాచురల్ బ్యూటీ. ఇందులో ఆమె సీత పాత్ర పోషిస్తోంది.
కాగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తదుపరి సినిమాలో నటించేందుకు సాయి పల్లవి నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో పలు సినిమాలున్నాయని, అందుకే డేట్స్ ఖాళీగా లేకపోవడంతో విక్రమ్ సినిమాను వదులుకుందట.
దీంతో విక్రమ్ సరసన హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక మోహనన్ ను ఎంపిక చేయాలని టీమ్ నిర్ణయం తీసుకుందట.
కాగా గతంలో కథ నచ్చకపోవడం, తన పాత్రకు ప్రాధాన్యం లేకపోవడంతో పలు స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి.
ఇక్కడ క్లిక్ చేయండి..