Brahmamudi, September 26th Episode: కావ్య మాట వినకుండా తప్పు చేశానన్న పెద్దాయన.. రాహుల్‌కి చివాట్లు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సీతారామయ్య ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. తన మనవడు స్వరాజ్ కంపెనీలో కంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడని.. చెప్తాడు. ఎందుకు అని రాజ్ అడిగితే.. తన మనవడు శ్రీకాంత్‌ని రాహుల్ అవమానించి పంపించినట్టు చెబుతాడు. దీంతో ఇంట్లోని వాళ్లందరూ రాహుల్‌ని కోపంగా చూస్తారు. అప్పుడే శ్రీకాంత్‌తో మాట్లాడిన మాటలు రాహుల్ గుర్తుకు తెచ్చుకుంటాడు. మీకు పంపించాల్సిన డిజైన్స్ పంపించాను కదా.. మళ్లీ ఇంకెందుకు కలవడం అని అంటారు. ఆ డిజైన్స్ నాకు నచ్చలేదు. వాటిని మార్చి మళ్లీ కొత్త డిజైన్స్..

Brahmamudi, September 26th Episode: కావ్య మాట వినకుండా తప్పు చేశానన్న పెద్దాయన.. రాహుల్‌కి చివాట్లు..
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Sep 26, 2024 | 11:46 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. సీతారామయ్య ఫ్రెండ్ ఇంటికి వస్తాడు. తన మనవడు స్వరాజ్ కంపెనీలో కంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడని.. చెప్తాడు. ఎందుకు అని రాజ్ అడిగితే.. తన మనవడు శ్రీకాంత్‌ని రాహుల్ అవమానించి పంపించినట్టు చెబుతాడు. దీంతో ఇంట్లోని వాళ్లందరూ రాహుల్‌ని కోపంగా చూస్తారు. అప్పుడే శ్రీకాంత్‌తో మాట్లాడిన మాటలు రాహుల్ గుర్తుకు తెచ్చుకుంటాడు. మీకు పంపించాల్సిన డిజైన్స్ పంపించాను కదా.. మళ్లీ ఇంకెందుకు కలవడం అని అంటారు. ఆ డిజైన్స్ నాకు నచ్చలేదు. వాటిని మార్చి మళ్లీ కొత్త డిజైన్స్ పంపించమని శ్రీకాంత్ అడుగుతాడు. నువ్వు ఇస్తున్న బిజినెస్‌కు నేను ఇస్తున్న డిజైన్స్ చాలా ఎక్కువ అని రాహుల్ అంటాడు. దీంతో శ్రీకాంత్ చాలా ఫీల్ అవుతాడు. వెంటనే నేను రాజ్‌తో మాట్లాడి.. కంపెనీ నుంచి నా డీల్ క్యాన్సిల్ చేసుకుంటానని, బిజినెస్ చేయనని చెప్పి వెళ్తాడు.

రాజ్ నువ్వు ఆఫీస‌కి వెళ్లు.

అదంతా విన్న ఇంట్లోని వాళ్లు.. ఏంటి రాహుల్ ఇది కస్టమర్లు అడిగిన డిజైన్స్ మనం ఇవ్వాలి. అంతే కానీ ఇలా అవమానించి పంపిస్తారా.. వెంటనే తాతయ్యకు సారీ చెప్పమని అంటాడు. నాకు సారీ అవసరం లేదు. ఈ విషయం చెప్పడానికి వచ్చానని సీతారామయ్య ఫ్రెండ్ అంటాడు. మాకు తెలీకుండా మా వెనక ఇన్ని తప్పులు జరుగుతున్నాయని నాకు తెలీదురా.. ఈ విషయాలు చెప్పినందుకు చాలా థాంక్స్ అని అంటాడు సీతారామయ్య. దీంతో రాహుల్‌పై ఫైర్ అవుతుంది రుద్రాణి. అసలు నీకు బుద్ధి ఉందా? నిన్ను నమ్మి కంపెనీ అప్పగిస్తే ఇలాగేనా చేసేది అని అంటుంది. ఇక ఆపుతారా మీ నాటకాలు.. నీ కొడుకు చేసిన పనికి మేము అందరం ఎక్కడ తిడతామని నువ్వే ముందు తిట్టేసి వాడిని కాపాడదాం అనుకుంటున్నావా? అని ఇందిరా దేవి అంటుంది. తప్పు చేసిన ప్రతీ సారి ఇలాగే చేసి ఉంటే ఇలా దారి తప్పేవాడు కాదని స్పప్న అంటుంది. సరే నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి.. ఏ శిక్ష వేయాలో మీరే చెప్పమని రుద్రాణి అంటుంది.

చాలా పెద్ద తప్పు చేశాను..

ఇప్పుడు మా స్నేహితుడు వచ్చాడు కాబట్టి.. దాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ ఇలా మన కంటికి కనిపించకుండా ఎంత నష్టం జరిగిందో అంచనా వేయగలమా అని సీతారామయ్య అంటాడు. నేను తెలుసుకుంటానని సుభాష్ అంటాడు. తప్పు చేశాము రా.. ఆ రోజు కావ్య వద్దూ అని చెప్పినా వినకుండా.. రాజ్‌ని కంపెనీ బాధ్యత నుంచి తప్పించి పెద్ద తప్పు చేశాను రా.. కావ్య ముందుగానే హెచ్చరించినా పట్టించుకోలేదు. నేనే బందాలకు లొంగిపోయాను. ఇల్లు ఎక్కడ ముక్కలు అవుతుందోనని భయపడి .. ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఇక చూస్తూ ఊరుకోలేను. ఎవరు ఏం అనుకున్నా పర్వాలేదు. కంపెనీ బాధ్యతలు రాజ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని సీతారామయ్య అంటాడు. కానీ రాజ్ నాకు ఇష్టం లేదని అంటాడు. ఎందుకు అని సుభాష్ అంటాడు. పిన్నికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూడా నా బాధ్యతనే కదా.. పిన్ని ఒప్పుకుంటేనే ఆఫీస్‌కి వెళ్తానని అంటాడు రాజ్.

ఇవి కూడా చదవండి

కావ్యకు తెలిసిన దుగ్గిరాల పంచాంగం..

దీంతో ప్రకాశం ఏంటే చెప్పు అని అంటాడు. నేను అడిగింది ఒకే ఒక్కటి. నా కొడుక్కి న్యాయం జరగాలి.. ఇంటికి రావాలని.. కానీ ఆ విషయం అందరూ మర్చిపోయారు. ఈ రోజు కంపెనీ సమస్యల్లో ఉందని ఇచ్చిన మాట కాదంటున్నారు. సరే రాజ్ ఆఫీస్‌కి వెళ్లడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కళ్యాణ్ ని ఇంటికి తీసుకొచ్చే బాధ్యత తనకే ఉందని ధాన్య లక్ష్మి అంటుంది. రోవైపు కనకం రాజ్ ఆఫీస్‌కు వెళ్తున్నాడన్న విషయం చెప్పబోతుంటే.. కావ్య చెప్పొద్దని అని అంటుంది. సరేలే అని కనకం కృష్ణమూర్తికి చెబుతుంది. అల్లుడు ఆఫీస్‌కి వెళుతున్న విషయం చెబుతుంది. ఆయనకు మంచి చేసే వాళ్లు శత్రువులే.. చేయి కాలితే కానీ అది నిప్పు అని తెలుసుకోలేడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకు చెప్పానో అని కావ్య అంటుంది. ఇలాగే నీ గురించి కూడా ఆలోచించి తీసుకెళ్తాడని కనకం కావాలనే ఆటపట్టిస్తుంది.

లంచం అడిగిన రాహుల్.. తిట్టిన రుద్రాణి..

ఇక రాహుల్ గదిలో సీరియస్‌గా కూర్చొని ఉంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి.. ఏంట్రా ఫీల్ అయ్యావా అని అడుగుతుంది. లేదు చాలా సంతోషంగా ఉందని అంటాడు రాహుల్. సరే ఇందాక అలా అరిచినందుకు సారీ అని అంటుంది రుద్రాణి. అయినా పట్టించుకోని రాహుల్ అరుస్తాడు. దీంతో ఒక్కటి పీకుతుంది రుద్రాణి. నేను అందరి ముందు ఇంట్లో అరవకపోయి ఉంటే అందరూ నీకు చివాట్లు పెట్టేవారు. అయినా నీకు కొంచెం కూడా బుర్ర లేకుండా ఇలా మాట్లాడతావా అని రుద్రాణి అంటే.. ఆ ముసలోడు తప్పు చెప్పాడు. నేను పది లక్షలు లంచం అడిగానని చెప్తాడు. అప్పుడే స్వప్న వచ్చి.. చప్పట్లు కొడుతూ సొంత కంపెనీలోనే లంచం అడిగావని తెలిస్తే నాకే సిగ్గుగా ఉందని చెబుతూ కుక్కతో పోల్చుతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కుక్కతో పోల్చుతావా అని రుద్రాణి అంటుంది. నీ కొడుకుని కుక్కతో పోల్చితే అదే సిగ్గు పడుతుంది. నువ్వు లంచం అడిగినట్టు ఇంట్లో వాళ్లకు చెప్పకు.. ఈ విషయం తెలిస్తే నన్ను చీప్‌గా చూస్తారని స్వప్న అంటుంది.

అప్పూ ఎస్‌ఐ అవ్వాలని కష్ట పడుతున్న కళ్యాణ్..

ఏంటి మామ్ అది అలా తిడుతూ ఉంటే.. ఏం మాట్లాడవేంటి? మామ్ అని అడుగుతాడు రాహుల్. అది చీప్‌గా మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదని రుద్రాణి కూడా అంటుంది. మరోవైపు కళ్యాణ్ తినిపిస్తూ ఉంటే.. అప్పూ తింటూ చదువుతూ ఉంటుంది. నువ్వు ఇలా కష్టపడి చదివి.. పోలీస్ అయిపోమని అంటాడు. ఈ లెక్క తేలక బుర్ర పగిలి పోతుందని అప్పూ అంటే.. మరి ఇలా రాకపోతే నేర్పించడానికి ఏమీ ఉండవా అని కళ్యాణ్ అడుగుతాడు. ఉన్నాయి కోచింగ్ సెంటర్లు.. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అప్పూ అంటే.. కళ్యాణ్ ఆలోచనలో పడతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..