Brahmamudi, September 27th Episode: అనామిక మాస్టర్ ప్లాన్.. సంతోషంలో రుద్రాణి, రాజ్, కావ్యల పంచాయితీ

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఆఫీస్‌కి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ఈలోపు కనకం టిఫిన్ చేసి, లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది. కానీ టైమ్ అవుతుందని బాక్స్ తీసుకుని వెళ్లిపోతుంది కావ్య. ఇక అప్పుడే తండ్రి కృష్ణమూర్తి వచ్చి.. ఆటోకి వెళ్లేందుకు డబ్బులు ఉన్నాయా? అని అడుగుతాడు. ఉన్నాయని కావ్య అబద్ధం చెబుతుంది. నాకు తెలుసు అమ్మా.. నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో నాకు తెలుసు అని డబ్బులు ఇస్తాడు కృష్ణమూర్తి. వీళ్లిద్దరూ ఇలా ఉంటే వీళ్లను ఇక ఎవరు..

Brahmamudi, September 27th Episode: అనామిక మాస్టర్ ప్లాన్.. సంతోషంలో రుద్రాణి, రాజ్, కావ్యల పంచాయితీ
BrahmamudiImage Credit source: disney hot star
Follow us
Chinni Enni

|

Updated on: Sep 27, 2024 | 1:53 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్య ఆఫీస్‌కి వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ఈలోపు కనకం టిఫిన్ చేసి, లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇస్తుంది. కానీ టైమ్ అవుతుందని బాక్స్ తీసుకుని వెళ్లిపోతుంది కావ్య. ఇక అప్పుడే తండ్రి కృష్ణమూర్తి వచ్చి.. ఆటోకి వెళ్లేందుకు డబ్బులు ఉన్నాయా? అని అడుగుతాడు. ఉన్నాయని కావ్య అబద్ధం చెబుతుంది. నాకు తెలుసు అమ్మా.. నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో నాకు తెలుసు అని డబ్బులు ఇస్తాడు కృష్ణమూర్తి. వీళ్లిద్దరూ ఇలా ఉంటే వీళ్లను ఇక ఎవరు కలుతారు? అని కనకం బాధ పడుతుంది. కొన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి అని కృష్ణమూర్తి అంటాడు. ఆ తర్వాత రాజ్ ఆఫీస్‌కి వెళ్లేందుకు బయలు దేరతాడు. అది చూసిన రుద్రాణి.. వీడు ఆఫీస్‌కి వెళ్తే నా కొడుకు పరిస్థితి ఏంటని అనుకుంటుంది. ఇక రాజ్ పెద్దావిడ ఆశీస్సులు తీసుకుని బయలు దేరతాడు. అలాగే కావ్యని కూడా నువ్వే ఇంటికి తీసుకొస్తావని అపర్ణ అంటుంది. అప్పుడే రుద్రాణి అనామికకు కాల్ చేస్తుంది. ఏదో చేసేస్తాను అన్నావు. నీకు ఏదీ చేతకాదని చెప్పు.. నాకు చేతనైనది నేను చేస్తానని రుద్రాణి అంటుంది. స్వరాజ్ కంపెనీని పతనం చేస్తాను అన్నావు. ఇప్పుడు ఏమైందని అడుగుతుంది. మళ్లీ రాజ్ పగ్గాలు చేత పట్టుకుని కంపెనీకి వెళ్తున్నాడు. వాడు ఉండగా నీ ఆటలు సాగవని రుద్రాణి అంటుంది.

పక్కా స్కెచ్ వేసిన అనామిక..

అదా మీ భయం.. ఇప్పుడు రాజ్ వచ్చినా.. రారాజు వచ్చినా ఏమీ చేయలేరు. కంపెనీ పతనానికి ఆల్రెడీ బీజం పడింది. రాజ్ భార్య కావ్యని స్వరాజ్ కంపెనీ మీదకు అస్త్రంగా వదలబోతున్నాం. డైరెక్ట్‌గా దెబ్బతీయాలంటే కావ్య ఒప్పుకోదు. కాబట్టి అది ఇన్ డైరెక్ట్‌గా మా కంపెనీకి పని చేసేలా చేశాను. స్వరాజ్ కంపెనీ నుంచి వెళ్లే డిజైన్స్ కంటే మా సంస్థ నుంచి కావ్య ద్వారా వచ్చే డిజైన్స్‌ని మార్కెట్‌లోకి పంపించబోతున్నాం. రంగం సిద్ధమైంది. భార్యా వర్సెస్ భర్త.. ఆట మొదలు కానుందని అనామిక అంటుంది. హో గుడ్.. అని రుద్రాణి సంతోష పడుతుంది. మరోవైపు కావ్య, రాజ్‌లు ఇద్దరూ గుడికి వస్తారు.

గుడిలో కావ్య, రాజ్‌ల పంచాయితీ..

ఒకరినొకరు చూసుకుని చిరాకు పడతారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నావా.. అసలు ప్రశాంతంగా గుడికి వస్తే నువ్వు కనిపించావు ఏంటి? అని రాజ్ అంటాడు. ఎవరైనా మహిశాశురుడిని, రావణాసురిడిని ఫాలో చేస్తారా? గుడి మీ తాత కట్టించింది కాదు. అయినా తమరు గుడికి రావడం ఏంటి? చేసిన పాపాలు పోవాలనా అని కావ్య అంటే.. కొందరు కనిపించకూడదని వచ్చాను. అయినా నీతో నాకు మాటలు ఏంటి? అని రాజ్ అంటాడు. అప్పుడే పంతులు వచ్చి.. మీరిద్దరూ భార్యాభర్తలా అని అడుగుతాడు. చీ ఛీ అస్సలు కాదు.. ఎవరమ్మా నువ్వు నాతో గొడవ పడుతున్నావ్ ఏంటి? మీ ఆయన ఏం చేస్తాడు? అని రాజ్ అడుగుతాడు. బూత్ బంగ్లాలో నివాసం ఉంటారు. మీకు పెళ్లి అయ్యిందా.. అయినా మీ పెళ్లాం ఎలా కాపురం చేస్తుందోనని కావ్య అంటుంది. బాబూ అర్చన చేయమంటారా అని పంతులు అడిగితే.. గోత్రనామాలు చెప్పి పెళ్లి కాలేదని అంటాడు రాజ్.

ఇవి కూడా చదవండి

తొగొచ్చి నన్ను కొడతాడన్న కావ్య..

ఏంటి ఇంకా పెళ్లి కాలేదా? ఏదన్నా మంచి ఆస్పత్రిలో చూపించుకోండి. ఇప్పటికే సీటు కిందకు ఇన్ని ఏళ్లు వచ్చాయి. ఇంకా పెళ్లి కాలేదంటే ఎవరూ పిల్లను ఇవ్వరు. పక్క నుంచి కావ్య నవ్వుతూ ఉంటుంది. అమ్మా మీకు గోత్రం చేయించమంటారా.. అని పంతులు అడిగితే.. భగవంతుడి గోత్రంతో పూజ చేయమని కావ్య అంటుంది. మీ ఆయన గారు ఏం చేస్తారని పంతులు అడిగితే.. బూత్ బంగ్లా ఉంటుంది చూడండి.. అది ఊడ్చి కడుగుతూ ఉంటారు. బాగా తాగి వచ్చి చికెన్ వండనందుకు గొడ్డున బాదినట్టు బాదుతూ ఉంటాడు. నేను బొమ్మలకు రంగులు వేసిన వచ్చిన డబ్బులు లాక్కుని పేకాట ఆడుతూ ఉంటాడు. ఆయనకు లేని వ్యసనమే లేదు. పెద్ద శాడిస్ట్.. ఈ మధ్యే తాగలేదని ఇంట్లోంచి గెంటేశాడని కావ్య చెబుతుంది. అది విని రాజ్ షాక్ అయ్యి.. ఇక చాలు ఆపమని రాజ్ అంటాడు. ఏమైంది బాబూ అని పంతులు అంటే.. ఏమీ లేదని అంటాడు. అయినా తగ్గని కావ్య ఇంకా తన కష్టాలు చెబుతూనే ఉంటుంది. బాధ పడకు అమ్మా నీకు మంచి చేస్తాడు. నీ భర్త ఏదో ఒక రోజు వచ్చి నీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తాడని పంతులు అంటాడు.

పడబోయిన రాజ్‌ని పట్టుకున్న కావ్య..

అది కూడా జరిగింది. మనసు విరిగి పోయాక ఏం చేసినా ప్రయోజనం ఏంటండీ.. అని కావ్య అంటుంది. ఇంతలో ఈగోయిస్టిక్ రాజ్ ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతాడు. అయ్యా స్వామి ఇకనైనా వెళ్లి పూజ చేయమని అంటాడు. కావ్య కథ విన్న పంతులు.. ఆ అప్రాచ్యుడు నాకు దొరికితే కొబ్బరి కాయతో నెత్తి మీద కొడతానని అంటాడు. పంతులు వెళ్లాక రాజ్ ఏంటి నేను తాగుబోతునా అని రాజ్ అడుగుతాడు. నా ఇష్టం నేను ఏదన్నా చెబుతానని కావ్య అంటుంది. ఆ తర్వాత భక్తులు అందరూ వచ్చి కావ్య, రాజ్‌లను దగ్గరకు నెడతారు. ఇక రాజ్ వెళ్తుండగా.. కావ్య పిలుస్తుంది. అయినా పట్టించుకోని రాజ్ వెళ్లి అరటి పండు తొక్క మీద కాలు వేసి పడబోతుండగా.. కావ్య పట్టుకుంటుంది. నన్ను నీ బుట్టలో పడేయటానికే కదా ఈ ప్లాన్ వేశావని రాజ్ అంటే.. కావ్యకు మండి వదిలేస్తుంది. దీంతో రాజ్ కింద పడతాడు. అప్పుడే పంతులు వచ్చి లేవదీస్తాడు.

ఎంప్లాయిస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రాజ్..

ఇక రాజ్ ఆఫీస్‌కి బయలు దేరతాడు. అక్కడ ఆఫీస్‌లో ఉన్న ఎంప్లాయిస్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రీల్స్ చేస్తూ.. ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. రాజ్ వచ్చినా ఎవరూ పట్టించుకోరు. వాళ్లందర్నీ చూసి షాక్‌లో ఉంటాడు రాజ్. వెంటనే శ్రుతిని పిలిచి.. మీటింగ్ కి రమ్మని చెబుతాడు. మీటింగ్‌కి వచ్చిన ఎంప్లాయిస్ అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు రాజ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని చెబుతాడు. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..