Bigg Boss 8 Telugu: మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్.. సోనియాకు నిఖిల్ వార్నింగ్..
ముందుగా ఆహారాన్ని నిల్వ చేసుకునే అవకాశం కోసం.. తాము ఇచ్చే సౌండ్స్ ను వరుస క్రమంలో రాయాలని చెప్పాడు. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ రాస్తారో వారికి సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం షాపింగ్ చేసే అవకాశం దొరుకుతుందని.. ఈ టాస్కుకు నబీల్ సంచాలక్ గా పెట్టాడు. ఇందులో నిఖిల్ టీం ఎక్కువగా స్కోర్ చేసింది. దీంతో సీత టీంకు నాన్ వెజ్ లేకుండా మొత్తం తీసుకున్నాడు నిఖిల్.
బిగ్‌బాస్ నిన్నటి ఎపిసోడ్లో ఫన్నీ టాస్కులు జరిగాయి. ముందుగా ఆహారాన్ని నిల్వ చేసుకునే అవకాశం కోసం.. తాము ఇచ్చే సౌండ్స్ ను వరుస క్రమంలో రాయాలని చెప్పాడు. ఎవరైతే ఎక్కువ కరెక్ట్ రాస్తారో వారికి సూపర్ మార్కెట్లో ఎక్కువ సమయం షాపింగ్ చేసే అవకాశం దొరుకుతుందని.. ఈ టాస్కుకు నబీల్ సంచాలక్ గా పెట్టాడు. ఇందులో నిఖిల్ టీం ఎక్కువగా స్కోర్ చేసింది. దీంతో సీత టీంకు నాన్ వెజ్ లేకుండా మొత్తం తీసుకున్నాడు నిఖిల్. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ నిల్చోబెట్టి వాళ్ల ముందు ఓ గోల్డెన్ బ్యాండ్ పెట్టాడు బిగ్‌బాస్. దానిని ఉపయెగించుకొని సొంత క్లాన్ నుంచి వేరే క్లాన్ కు వెళ్లిపోవచ్చు .. దానికి కాసేపు మాత్రమే అవకాశం ఉందని అన్నారు. ఎవరికి కావాలో వారు వెంటనే వెళ్లి అది తీసుకోండి అంటూ బిగ్‌బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఇక నిఖిల్, సీత తన టీం సభ్యులను రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా సోనియాకు వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్. నువ్వు నా రైట్ హ్యాండ్.. నా పవర్.. గుండెకాయ.. అటు సైడ్ వెళ్లొద్దు అంటూ సోప్ వేశాడు. కావాలంటే నువ్వు వెళ్లిపోవచ్చు అంటూ మణికంఠను అనడంతో గోల్డెన్ బ్యాండ్ తీసుకుని ఆదిత్య ఓంను స్వాప్ చేసి తాను సీత టీంలోకి వెళ్లాడు.
ఇక ఆ తర్వాత బీబీ అడ్డా అంటూ ఓ ఎంటర్టైనింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందురూ తమ తోటి సభ్యులను ఇమినేట్ చేసి అందరిని నవ్వించాలని చెప్పాడు. దీంతో ప్రతి ఒక్కరు తమకు నచ్చిన కంటెస్టెంట్ బొమ్మ ట్యాగ్ వేసుకుని ఇమిటేట్ చేశారు. ముఖ్యంగా సోనియా, పృథ్వీ, నిఖిల్.. ముగ్గురిని ఎక్కువగా ఇమిటేట్ చేశారు. ఇందులో మణికంఠ విగ్గు గురించి కామెడీ చేసింది ప్రేరణ. దీంతో పైకి నవ్వుతున్నా లోపల మాత్రం కాస్త హర్ట్ అయ్యాడు మణి. ఈ టాస్కులో నబీల్ ఇరగదీశాడు. ఆదిత్య ఓం ను అచ్చుగుద్దినట్లుగా దించేశాడు. కిచెన్ క్లీనింగ్ నుంచి నామినేషన్స్ వరకు పూర్తిగా ఆదిత్యను దింపేశాడు. అలాగే సోనియా, పృథ్వీ, నిఖిల్ ప్రవర్తనను కూడా హౌస్ లో ఎక్కువగా ఇమిటేట్ చేయడంతో సోనియా హార్ట్ అయ్యింది. ముగ్గురినే ఇమిటేట్ చూశావా.. బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మమ్మల్ని అని సోనియా చెప్పడంతో ఎంత ఫన్నీగా చేసినా మనకు లోపల కాస్త గుచ్చుకుంటుంది అంటూ మణికంట డైలాగ్ వేశాడు.
ఇక హౌస్ లో మరో లవ్ ట్రాక్ మొదలయ్యింది. నిన్నటి టాస్కులో విష్ణు కోసం పృథ్వీ లవ్ సాంగ్ పాడడంతో పరవశించిపోయింది విష్ణు. దీంతో వారిద్దరి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్వీగాడిని చూస్తే భయం వేస్తుంది.. ఆమెకు పడిపోతున్నాడు.. నాకు ఏది నిజం ? ఏది అబద్ధమో తెలియడం లేదు.. అలా అనిపిస్తుంది అంటూ నిఖిల్ తో చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.