Brahmamudi, September 12th Episode: మనసుల్ని మెలిపెట్టే సీన్.. పుట్టింటికి కావ్య.. కళ్లు తెరిచిన అపర్ణ..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఏమీ లేని ఈ ఇంట్లో ఎవరూ లేని దానిలా ఉండటం కంటే నా ఆత్మ గౌరవాన్ని కాపాడుకుని వెళ్లిపోవడమే నాకూ మంచిది. మీకూ మంచిది. ఈ ఇంట్లో మీ భార్యగా నా పాత్ర ముగిసింది. ఇక సెలవు అంటూ దణ్ణం పెడుతుంది కావ్య. రాజ్ వైపు చూసినా.. రాజ్ కనీసం చూడడు. ఇక కావ్య వెళ్లిపోతుంటే ఇందిరా దేవి, స్వప్న, సుభాష్, ప్రకాశంలు ఆపుతారు. ఏంటి బావా.. మనవరాలు వెళ్లిపోతుంది. ఎందుకు ఆపడం లేదని? సీతారామయ్యను అడుగుతుంది ఇందిరా దేవి. వస్త్రాపహరణం అంటే చీర లాగడమేనా చిట్టి..

Brahmamudi, September 12th Episode: మనసుల్ని మెలిపెట్టే సీన్.. పుట్టింటికి కావ్య.. కళ్లు తెరిచిన అపర్ణ..
BrahmamudiImage Credit source: Disney hot star
Follow us

|

Updated on: Sep 12, 2024 | 12:52 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ఏమీ లేని ఈ ఇంట్లో ఎవరూ లేని దానిలా ఉండటం కంటే నా ఆత్మ గౌరవాన్ని కాపాడుకుని వెళ్లిపోవడమే నాకూ మంచిది. మీకూ మంచిది. ఈ ఇంట్లో మీ భార్యగా నా పాత్ర ముగిసింది. ఇక సెలవు అంటూ దణ్ణం పెడుతుంది కావ్య. రాజ్ వైపు చూసినా.. రాజ్ కనీసం చూడడు. ఇక కావ్య వెళ్లిపోతుంటే ఇందిరా దేవి, స్వప్న, సుభాష్, ప్రకాశంలు ఆపుతారు. ఏంటి బావా.. మనవరాలు వెళ్లిపోతుంది. ఎందుకు ఆపడం లేదని? సీతారామయ్యను అడుగుతుంది ఇందిరా దేవి. వస్త్రాపహరణం అంటే చీర లాగడమేనా చిట్టి.. ఒక స్త్రీ ఆత్మ గౌరవాన్ని పది మందిలో దెబ్బ తీయడం కాదా? అది చూస్తూ దృతరాష్టుడిని అయిపోయాను. నేనేమీ చేయలేను అంటూ సీతారామయ్య అంటాడు. ఇక ఇంట్లోంచి కాలు బయట పెట్టి వెళ్లిపోతుంది కావ్య. అప్పుడే బ్రహ్మముడి సీరియల్ సాంగ్ ప్లే అవుతుంది.

ఏడుస్తూ పుట్టింటికి వచ్చిన కావ్య..

ఇక కావ్య ఏడుస్తూ.. బాధ పడుతూ పుట్టింటికి వస్తుంది. ఈలోపు కళ్యాణ్‌కు కావ్య బయటకు వెళ్లిన విషయం తెలిసి షాక్ అవుతుంది. ఇంకోవైపు అపర్ణ కోమాలో ఉంటుంది. కావ్య పుట్టింటికి వచ్చి బయటనే ఏడుస్తూ కూర్చొంటుంది. అప్పుడే కనకం బయటకు వచ్చి చూస్తే.. కావ్య ఉంటుంది. అది చూసి కనకం కంగారు పడి.. కృష్ణమూర్తిని పిలుస్తుంది. కావ్య ఏంటే.. ఇక్కడ కూర్చున్నావ్? అని అడుగుతారు. ముందు లోపలికి పదా అని కనకం అంటే.. నేను లోపలికి రావాలంటే.. మీ అనుమతి కావాలని అంటుంది. నీ పుట్టింటికి రావాలంటే మా అనుమతి కావాలా? అని కనకం అంటుంది. నేను పండగకో.. పబ్బానికో రాలేదు. శాశ్వతంగా అత్తింటి గడప దాటి వచ్చేశాను. కాబట్టి మీ అనుమతి కావాలి. పుట్టెడు దు:ఖాన్ని దాచుకుని వచ్చిందమ్మా.. నేను ఉండటానికి కాస్త చోటు ఇస్తారా? అని అడుగుతుంది. దీంతో కనకం ఏడుస్తుంది.

నా గుండెల్లో పెట్టుకుంటాను అమ్మా..

కాస్త చోటు ఏంటి అమ్మా.. నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా.. అలా పరాయి దానిలా మాట్లాడతావేంటి? అమ్మా ఇది నీ ఇల్లు. ఇది పేరుకే నా ఇల్లు కానీ.. అమ్ముకునే సమయం వచ్చిన రోజు.. నువ్వు రాత్రింబవళ్లు కష్టపడి విగ్రహాలకు రంగులు వేశావు. ఈ ఇంటి మీద నా కంటే నీకే ఎక్కువ హక్కు ఉంది. రామ్మా.. లోపలికి రా అని తీసుకెళ్తారు. విషయం తెలుసుకున్న కళ్యాణ్.. ఇక ఇంటికి వెళ్తాడు. అన్నయ్యా అని గట్టిగా పిలుస్తాడు. దీంతో అందరూ బయటకు వస్తారు. రాజ్ కూడా బయటకు వచ్చి నిల్చుంటాడు. మహా రాజులా పైన నిలబడటం కాదు.. కిందకు దిగి రా అని అంటాడు. ఏం కావాలి నీకు? అని రాజ్ అంటాడు. ఏం ఇవ్వగలిగావు నువ్వు.. నిన్ను నమ్మిన వాళ్లకు ఏం ఇచ్చావు? అని కళ్యాణ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

నీ భార్య ఎక్కడ..

సరే నీ దగ్గర ఏముందని రాజ్ అంటే.. నా దగ్గర నా భార్య ఉంది. నీ దగ్గర నీ భార్య ఉందా? అని కళ్యాణ్ అడుగుతాడు. రాజీ కుదర్చడానికి వచ్చావా? లేక రాయబారం మోసుకొచ్చావా? అని రాజ్ అంటాడు. నువ్వు ముందు దిగి రా అని అంటాడు కళ్యాణ్. ఆమె వచ్చి గోడు చెప్పిందా.. అని రాజ్ అంటాడు. ఎవరు వచ్చి చెప్తారు? ఏం చెబుతుంది. చెప్పుకునేది అయితే కళ్లకు గంటలు కట్టుకున్న ఈ పెద్దలకే చెప్పేది కదా.. నువ్వు చెప్పు వదినను ఎందుకు అవమానించావు. ఈ గౌరవ సభలో ఆమె ఆత్మాభినం ఎంత దెబ్బ తినకపోతే అత్తింటి నుంచి కాలు బయట పెడుతుంది? ఇది చెప్పిన వాళ్లు కారణం చెప్పలేదా? అని రాజ్ అంటాడు. ఆమె గుండెకు ఎంత గాయం కాకపోతే.. ఇల్లు విడిచి వెళ్లిపోతుంది? ఒక్కసారైనా ఆలోచించావా? ఈ ఇంటిని.. ఈ కుటుంబాన్ని కాదని వెళ్లిపోయిన మనిషి గురించి పట్టించుకోనని రాజ్ అంటాడు.

రాజ్‌ని తప్పుబట్టిన కళ్యాణ్..

మరి నా గురించి ఎందుకు పట్టించుకున్నావ్? ఎందుకు మళ్లీ నన్ను ఇంటికి రప్పించాలని అన్ని సార్లు ప్రయత్నించావు? ఎందుకంటే నేను నీ రక్త సంబంధం.. వదిన పరాయి ఇంటి నుంచి వచ్చింది కాబట్టి.. ఏమిటీ ఈ అన్యాయం? నేను నీకు ఏకలవ్య శిష్యుడిని. వ్యక్తిత్వం.. సంస్కారం.. నిన్ను చూసి నేర్చుకున్నా? మరి ఇప్పుడు అవి ఏవి? నిన్ను నమ్మి వచ్చిన నీ ఇల్లాలిని చీకట్లోకి దిగజారిపోయేలా చేసిందా? నీ ఔన్నత్యం అని కళ్యాణ్ అంటాడు. అసలు నువ్వు జరిగింది ఏంటో వివరంగా తెలుసుకుని వచ్చావా? అని రాజ్ అడుగుతాడు. గుడిలో వెలిగే దీపం నిప్పు అని తెలుసుకోవాలా.. మా వదిన గురించి కొత్తగా ఏం తెలుసుకోవాలి? అని కళ్యాణ్ అంటాడు. ఒరేయ్ కళ్యాణ్.. ఆమె గుణాలను నా ముందు చూపించవద్దు.. ఆమెలో నిర్లక్ష్యం కూడా ఉంది. ఆమె నిర్లక్ష్యం ఖరీదు నా అమ్మ నిండు ప్రాణం అని కూడా తెలుసుకున్నాను. మా అమ్మకు ఏదన్నా అయితే జీవితంలో కన్నెత్తి కూడా చూడనని రాజ్ అంటాడు.

మూర్ఖంగా మారిపోయిన రాజ్..

ఇదేనా నువ్వు వదిన గురించి తెలుసుకుంది. నువ్వు కారణం అడిగావా? చెబితే విన్నావా.. పోనీ పట్టించుకున్నావా? ఆ మంథర మాటలు విన్నావా.. లేక ఈ కైక మాటలు నమ్మావా.. నీలో మొగుడిని.. మగ మహారాజుని అనే అహంకారం ఎప్పుడు నుంచి వచ్చింది? మా వదిన నిర్లక్ష్యంగా ప్రవర్తించదు. ఇంత మూర్ఖంగా ఎలా అని కళ్యాణ్ అనబోతుండగా.. ప్రకాశం ఆపుతాడు. దీంతో సారీ చెప్తాడు కళ్యాణ్. ఓరేయ్.. మన ఇద్దరం ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఇద్దరం ఒకేలా ఉండేవాళ్లం. పెద్దమ్మని కూడా నువ్వు కన్నతల్లిలా చూసుకున్నావు. అలాంటి మనిషి చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు రక్త సంబంధాన్ని వదిలేసి.. ఆ మనిషికి సపోర్ట్‌గా మాట్లాడుతున్నావ్? అని రాజ్ అంటాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.