- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Rocking Rakesh Wife Jordar Sujatha Baby Shower Function Photos Go Viral
Jabardasth Rocking Rakesh: కనుల పండువగా బిగ్ బాస్ సుజాత సీమంతం.. ఫొటోలు షేర్ చేసిన రాకింగ్ రాకేష్
జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. సుజాత ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. సెప్టెంబర్ నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే ఈ లవ్లీ కపుల్ త్వరలో శుభవార్త చెప్పనున్నారన్నమాట.
Updated on: Sep 12, 2024 | 3:15 PM

జబర్దస్త్ కపుల్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత త్వరలో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు. సుజాత ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. సెప్టెంబర్ నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే ఈ లవ్లీ కపుల్ త్వరలో శుభవార్త చెప్పనున్నారన్నమాట.

ఇదిలా ఉంటే సుజాత సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాకింగ్ రాకేష్. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.

కొన్ని నెలల క్రితమే సుజాత సీమంతం వేడుకగా జరిగింది. బుల్లితెర ప్రముఖులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకల్లో సందడి చేశారు.

ఇప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రాకింగ్ రాకేష్.. 'ఈ సమయంలో తన ఆనందాన్ని చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు. నీ మీద నా ప్రేమకు అవధులు లేవు' అని తన భార్యపై ప్రేమను కురిపించాడు.

ఈ ఫొటోలను చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు రాకింగ్ రాకేశ్ దంపతులకు ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా గతేడాది ఫిబ్రవరిలో రాకింగ్ రాకేశ్- జోర్దార్ సుజాతల వివాహం జరిగింది. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ క్యూట్ కపుల్.

కాగా ప్రస్తుతం రాకింగ్ రాకేశ్ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతగా ఒక సినిమా కూడా నిర్మిస్తున్నాడు.



















