Brahmamudi, October 12th Episode: కనకం ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ హడావిడి.. డ్రామా బయట పడిపోయిందిగా..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అందరూ హాలులో కూర్చొని ఉంటారు. అపర్ణ, ఇందిరా దేవిలు తమ చీరల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ ఇంటికి వస్తాడు. సడెన్‌గా.. క్షమించడంలో మానవత్వం ఉంటుంది మమ్మీ అని రాజ్ అంటాడు. క్షమించడాన్నే మానవత్వం అంటారురా.. నేను క్షమించపోతే.. ఏ సహాయం అందించకపోతే అని రాజ్ అంటే.. చాలు నాన్నా చాలు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయావో అందరికీ తెలియాల్సిన పని లేదని అపర్ణ అంటుంది. అవును కదా మమ్మీ మర్చిపోయానని..

Brahmamudi, October 12th Episode: కనకం ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ హడావిడి.. డ్రామా బయట పడిపోయిందిగా..
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us

|

Updated on: Oct 12, 2024 | 1:38 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. అందరూ హాలులో కూర్చొని ఉంటారు. అపర్ణ, ఇందిరా దేవిలు తమ చీరల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే రాజ్ ఇంటికి వస్తాడు. సడెన్‌గా.. క్షమించడంలో మానవత్వం ఉంటుంది మమ్మీ అని రాజ్ అంటాడు. క్షమించడాన్నే మానవత్వం అంటారురా.. నేను క్షమించపోతే.. ఏ సహాయం అందించకపోతే అని రాజ్ అంటే.. చాలు నాన్నా చాలు నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయావో అందరికీ తెలియాల్సిన పని లేదని అపర్ణ అంటుంది. అవును కదా మమ్మీ మర్చిపోయానని అంటాడు రాజ్. ఇంట్లో వాళ్లకు అర్థం కాక చూస్తూ.. మీ ముగ్గురూ ఏం మాట్లాడుతున్నారు రాజ్? అని ప్రకాశం అడుగుతాడు. హృదయం విస్తీర్ణం పెంచుకోవడానికి మనిషి.. మహర్షిలా మారాల్సిన అవసరం లేదు బాబాయ్. నేనొక నిర్ణయం తీసుకున్నాను. రేపు మా అత్తగారి కనకం, మావయ్య కృష్ణమూర్తి గారిల 25వ పెళ్లి రోజు.. నా చేతుల మీదుగా గ్రాండ్‌గా చేయాలని అనుకుంటున్నా అని చెప్పగానే.. రుద్రాణి కళ్లు తిరిగి పడిపోతుంది.

రాజ్ మానవత్వం.. షాక్‌ అయిన రుద్రాణి..

రాహుల్ రుద్రాణిని తీసుకొచ్చి కూర్చొబెడతాడు. మీ మేనత్త పడిపోతే పట్టించుకోలేదు. కానీ మీ అత్తకు మాత్రం మ్యారేజ్ డే చేస్తావా రాజ్ అని రాహుల్ అంటాడు. మధ్యలో నీకేం నొప్పి రాహుల్ అని స్వప్న అంటుంది. నేను సమాచారం మాత్రమే ఇస్తున్నా.. మీ సలహాలు కోరడం లేదని రాజ్ అంటాడు. అదేంటి రాజ్? అసలు ఆ కుటుంబం గురించి అవసరం లేదని మాట్లాడావ్? ఆ మనిషిని.. ఆ ద్రోహాన్ని అప్పుడే మర్చిపోయావా అని ధాన్య లక్ష్మి అంటే.. అవును అని రాజ్ అంటాడు. పక్క నుంచి స్పప్న, ప్రకాశంలు సెటైర్లు వేస్తూ ఉంటారు. మట్టి పిసుక్కుని బొమ్మలు అమ్ముకునే వాళ్ల అత్తకి, మామకి గ్రాండ్‌గా పెళ్లి రోజు చేస్తాడంట మమ్మీ అని రాహుల్ అంటాడు. నో.. దీనికి నేను ఒప్పుకోనని రుద్రాణి అంటే.. అందుకే మీ బోడి పర్మిషన్ ఎవడూ తీసుకోనని అన్నాడు.

వాళ్లపై ఎందుకు అంత ప్రేమ..

నీ కళ్ల ముందే అవార్డు తీసుకుని ప్రత్యర్థిని గెలిపించి అంత దెబ్బ కొడితే.. అదంతా అంత తేలిగ్గా ఎలా మర్చిపోయావ్ రాజ్.. అని రుద్రాణి అంటే.. మీ కూతురే చెడగొట్టేలా ఉందని అపర్ణ అంటుంది. దాని గూబ నేను వాయగొడతానని ఇందిరా దేవి అంటుంది. ఆ కావ్య నమ్మకద్రోహాన్ని మర్చిపోయి.. వాళ్ల అమ్మానాన్న మ్యారేజ్ డే చేస్తానని ఎలా అంటున్నావ్? అని రుద్రాణి అంటుంది. నేనూ ఈ ఇంటి మనిషినే.. రేపు కనకం మ్యారేజ్ డే చేయకపోతే.. ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోతుందా అని అపర్ణ అంటుంది. మనిషి విలువ.. ఆ మనుషులు ఉన్నప్పుడే తెలుసుకోవాలి. పోయే రోజు వస్తే.. పోక తప్పదని రాజ్ అంటాడు. అసలు వాళ్ల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందని రుద్రాణి, రాహుల్‌లు అడుగుతారు.

ఇవి కూడా చదవండి

మానవత్వం మంటగలిసి పోతుంది..

మమ్మీ మానవత్వం మంటగలిసి పోతుంది. ఇలాంటి రాతి మనుషుల మధ్య రాళ్లలో రాయిని అయి ఎలా ఉండాలి? అని రాజ్ బాధ పడతాడు. ఆ రాయిలను నేను ఏరి పారేస్తాను కదా.. మానవత్వం నీ జన్మ హక్కు అని ఇందిరా దేవి అంటే.. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారని ప్రకాశం అంటే.. నీకు అర్థమయ్యిందా అపర్ణ.. నీకు రాజ్ అని అడిగితే.. అవునని సమాధానం ఇస్తారు. అయితే తలకాయలో మెదడు లేని వాళ్లకు మాత్రమే అర్థం కావడం లేదు. మెదడు లేని వాళ్లు ఎవరో చేతులు ఎత్తమని ఇందిరా దేవి అంటుంది. ఎవరూ ఎత్తరు.. అందరం కలిసి వెళ్దామని రాజ్ అంటే.. ఆ ఇంటికి మేము ఎందుకు? రామని ధాన్య లక్ష్మి అంటుంది. చూడండి.. వాళ్లకు పెళ్లి అయి 25 ఏళ్లు అయ్యింది. ఆ పెళ్లి రోజును చేసుకోవడానికి వాళ్ల దగ్గర అంత డబ్బు లేదని రాజ్ అంటే.. అయితే గతిలేని వాళ్లందరికీ పెళ్లి రోజు జరిపిస్తావా? అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత స్వప్న సెటైర్ వేస్తుంది. మానవత్వం ఉండాలి మమ్మీ.. ఉండాలి అని చెప్పి రాజ్ వెళ్తాడు.

షాక్‌లో కావ్య..

కట్ చేస్తే.. కృష్ణమూర్తి తలకు రంగు వేసుకుని వస్తాడు. అది చూసి కనకం ఏంటయ్యా ఇది అని నవ్వుతుంది. అన్నీ గుర్తుకు వచ్చి వేసుకున్నానే అని అంటాడు కృష్ణమూర్తి. సరేలే నన్ను ఆశీర్వదించమని అంటుంది కనకం. ఆ తర్వాత కావ్య వచ్చి వాళ్లకు పెళ్లి రోజు విషెస్ చెబుతుంది. సరేలే ఇక్కడికి మీ ఆయన, ఫ్యామిలీ వస్తున్నారు. నవ్వుతూ పలకరించమని అంటే నేను పలకరించనని కావ్య అంటుంది. అప్పుడే రాజ్, రాహుల్‌లు వస్తారు. రాజ్ ఇంట్లో డెకరేషన్ గురించి అంతా చెప్తాడు. కనకం వాళ్లను పలకరించమని రాహుల్‌కి చెప్తాడు. రాహుల్ అయోమయంగా పలకరిస్తాడు. రండి బాబు ఇంట్లోకి.. కాఫీ, టీ ఏం కావాలో చెప్పండి.. చేసేస్తానని కనకం అంటే.. అయ్యో అత్తయ్య గారు మీకు రెస్ట్ కావాలి. అది చూసుకోమని రాజ్ అంటాడు. దీంతో కావ్య షాక్ అవుతుంది.

హలో ఏంటి ఈ హడావిడి..

రాజ్ దగ్గరకు వచ్చి.. హలో ఏంటి ఈ హడావిడి? అని కావ్య అంటే.. ఉన్నప్పుడు లేని వాళ్ల విలువ తెలీదు.. లేనప్పుడు ఉన్న వాళ్ల విలువ తెలీదని రాజ్ అంటాడు. అదేంటి? ఏం చెబుతున్నారు అర్థం కావడం లేదని కావ్య అంటుంది. నీది కోడి బుర్ర అందుకే ఆ భాషలో చెప్పాను. మా అత్తగారి పెళ్లి రోజు అందుకే ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నానని రాజ్ అంటాడు. అప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం వస్తారు. ఏమ్మా కావ్యా నువ్వు రమ్మంటే రాలేదని.. మేమే నీ కోసం వచ్చామని ఇందిరా దేవి, అపర్ణలు అంటారు. అప్పుడే కనకం, కృష్ణమూర్తిలు వచ్చి నమస్కారం పెడతారు. దుగ్గిరాల ఫ్యామిలీ కూడా పెడుతుంది. ఏంటి అత్తయ్యా మీరు బయటకు వచ్చారు? వెళ్లండి అని రాజ్ అంటే.. కావ్య అయోమయంగా చూస్తుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం..
భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం..
ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్
ఏ వయసుకి ఎంత బరువు ఉండాలో తెలుసా? ఒక్క రహస్యంతో సగం రోగాలు మటాష్
ఎందుకీ మౌనం..? గులాబీ దళపతి కేసీఆర్‌ స్ట్రాటజీ ఏంటి..
ఎందుకీ మౌనం..? గులాబీ దళపతి కేసీఆర్‌ స్ట్రాటజీ ఏంటి..
సహజంగా పింక్‌ కలర్‌ పెదాలు కావాలంటే.. రాత్రిళ్లు ఇలా చేయండి
సహజంగా పింక్‌ కలర్‌ పెదాలు కావాలంటే.. రాత్రిళ్లు ఇలా చేయండి
కనకం ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ హడావిడి.. డ్రామా బయట పడిపోయిందిగా!
కనకం ఇంట్లో దుగ్గిరాల ఫ్యామిలీ హడావిడి.. డ్రామా బయట పడిపోయిందిగా!
రవి నీచత్వం.. ఆ రాశుల వారికి కొన్ని రగాల అదృష్టాలు..!
రవి నీచత్వం.. ఆ రాశుల వారికి కొన్ని రగాల అదృష్టాలు..!
తులా రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి కెరీర్‌లో ఊహించని వృద్ధి..!
తులా రాశిలో బుధుడు.. ఆ రాశుల వారికి కెరీర్‌లో ఊహించని వృద్ధి..!
స్వామినారాయణ అక్షరధామ్ ఆలయంలో విశ్వశాంతి మహాయజ్ఞం..
స్వామినారాయణ అక్షరధామ్ ఆలయంలో విశ్వశాంతి మహాయజ్ఞం..
'బతకాలని లేదు..' ICICI బ్యాంక్ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో కలకలం
'బతకాలని లేదు..' ICICI బ్యాంక్ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో కలకలం
దసరా సందడి.. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు
దసరా సందడి.. ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు