AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi, October 11th Episode: కనకం క్యాన్సర్ ప్లాన్ సక్సెస్.. మాట ఇచ్చిన రాజ్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ప్రకాశం, రాజ్, అపర్ణ, ఇందిరా దేవిలు భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ పాపం కావ్య అని బాధ పడుతూ.. ఇంత బాధలో అన్నం తినాలనిపించడం లేదని అపర్ణ, ఇందిరా దేవిలు లేస్తారు. ప్రకాశం కూడా చాలా బాధగా ఉందని చెప్పి.. బాధతో లేచి వెళ్లిపోతాడు. బాబాయ్ ఏమైంది చెప్పమని అంటే మర్చిపోయానని అంటాడు. అసలు ఏమైంది వీళ్లకు.. ఇక తప్పదు..

Brahmamudi, October 11th Episode: కనకం క్యాన్సర్ ప్లాన్ సక్సెస్.. మాట ఇచ్చిన రాజ్!
BrahmamudiImage Credit source: disney hotstar
Chinni Enni
|

Updated on: Oct 11, 2024 | 12:07 PM

Share

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. ప్రకాశం, రాజ్, అపర్ణ, ఇందిరా దేవిలు భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తూ పాపం కావ్య అని బాధ పడుతూ.. ఇంత బాధలో అన్నం తినాలనిపించడం లేదని అపర్ణ, ఇందిరా దేవిలు లేస్తారు. ప్రకాశం కూడా చాలా బాధగా ఉందని చెప్పి.. బాధతో లేచి వెళ్లిపోతాడు. బాబాయ్ ఏమైంది చెప్పమని అంటే మర్చిపోయానని అంటాడు. అసలు ఏమైంది వీళ్లకు.. ఇక తప్పదు.. ఇగో పక్కన పెట్టి కళావతికి ఏమైందో కనుక్కుటానని అంటాడు. అది విని అపర్ణ, ఇందిరా దేవిలు నవ్వుతారు. ఆ తర్వాత వీళ్లు బయటకు కూర్చొని.. బాగానే నటిస్తున్నారు అత్తయ్యా అని అంటుంది అపర్ణ. అప్పుడే వీళ్ల దగ్గరకు రాజ్ వస్తాడు. అసలు ఏమైందని అడుగుతాడు. పాపం.. చాలా కష్టం వచ్చింది. అయినా నీకెందుకు? అని అపర్ణ అడుగుతుంది. అయినా రాజ్ మళ్లీ అడుగుతాడు. నీలాంటి బండరాయికి చెప్పినా ఏమీ అర్థం కాదని చెప్పి వెళ్తారు.

మీ అత్తగారు చనిపోతుందట..

సరే వెళ్లండి.. మీరు చెప్పకపోతే.. కళ్యాణ్‌ని అడిగి తెలుసుకుంటానని రాజ్ అనే సరికి.. అపర్ణ, ఇందిరా దేవిలు ఆగి.. అమ్మో మీర ఎక్కువ చేస్తే మోసం అయ్యేలా ఉందని అనుకుని.. మీ అత్తగారికి క్యాన్సర్రా.. ఎక్కువ రోజులు బతకదని అపర్ణ చెబుతుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. చాలా బాధ పడతాడు. మరి ఈ విషయం కావ్యకు తెలుసా? అని రాజ్ అడిగితే.. కన్న తల్లి చనిపోతుందని తెలిస్తే కావ్య తట్టుకోలేదురా.. భర్త ప్రేమ లేని అత్తింట్లో.. అమ్మ లేని పుట్టింట్లో ఆ పిచ్చి తల్లి ఎలా బతుకుంది? అని అపర్ణ అంటే.. చెప్పకండి కళావతి నిజంగానే తట్టుకోలేదని రాజ్ అంటాడు. సరే ఆ విషయం కూడా చెబుదామా.. అదే కనకం ఆఖరి కోరిక గురించి అని ఇందిరా దేవి అంటే.. ఏంటి? కావ్యని కాపురానికి తీసుకు రమ్మనా అని రాజ్ అనేసరికి.. ఏంట్రా.. ఇంట్లోనే కనకాన్ని అపార్థం చేసుకోవాలా.. మేము చెప్పమని అపర్ణ వాళ్లు అంటే.. మీరు చెప్పకపోతే మా అత్తగారినే అడిగి తెలుసుకుంటానని రాజ్ వెళ్తాడు.

గట్టి ప్లాన్ చేసిన కనకం..

అప్పుడే కనకానికి ఆగదూ.. ఆగదూ అనే ఓ సాడ్ సాంగ్ ప్లే చేస్తారు. అప్పటికే లాయర్‌ని కూడా పిలిపించి రెడీ చేస్తుంది కనకం. మీ అల్లుడి గారు అప్పుడే రాలేదని లాయర్ అంటే.. మరణిస్తున్నట్టు జీవించాలని కనకం అంటే.. మీరు యాక్టింగ్ నేర్చుకోవాలా అని లాయర్ అంటాడు. రాజ్ కారు దిగే సరికి.. ఖర్చీఫ్ మీద కలర్ వేసుకుని దగ్గుతుంది. ఇక డ్రామా స్టార్ట్ చేస్తారు. ఈ ఇల్లు అల్లుళ్ల పేరు మీద రాయమని కనకం చెబుతూ ఉంటుంది. రాజ్ వచ్చి అయ్యో అత్తయ్యా.. కూర్చోమని అంటాడు. అల్లుడి గారు మీరా అని ఏమీ తెలీనట్టు అడుగుతుంది. మరి మావయ్య గారు వాకిట్లో ఉంటారా.. లాయర్ గారు మీరు వెళ్లమని రాజ్ అంటాడు. ఆ తర్వాత లాయర్ నిజం చెప్తాడు. ఇక కనకం దగ్గుతూ కలర్ అంటిన ఖర్చీఫ్‌ని చూపిస్తుంది. మీరు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసని రాజ్ అంటాడు. పదండి మిమ్మల్ని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి చూపిస్తానని అంటాడు. లేదు బాబు.. ఆల్రెడీ నాకు చివరి రోజులు అని చెప్పేశారని కనకం అంటుంది.

ఇవి కూడా చదవండి

కనకం ప్లాన్ సక్సెస్..

ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో.. మీ లాంటి అల్లుడు దొరికారు. కానీ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో మనవరాళ్లు, మనవరాళ్లని చూడకుండా వెళ్తున్నాని కనకం అంటుంది. అత్తయ్య గారూ మీకు ఏదో చివరి కోరిక ఉందని చెప్పారు.. ఏంటది చెప్పండి నేను చేస్తాను. నేను కూడా మీ కొడుకు లాంటి వాడినేనని మాట ఇస్తాడు రాజ్. నా ముగ్గురు కూతుళ్లకు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి అయిపోతుంది. కనీసం మా పెళ్లి రోజుకు నా ముగ్గురు కూతుళ్లు.. అల్లుళ్లతో కలిపి పెళ్లి రోజు జరుపు కోవాలని ఆశగా ఉందని కనకం అంటుంది. రాజ్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. చూశారా బాబు.. మీరు ఆలోచిస్తున్నారు. మా కావ్యతో కలిసి మీరు నా పెళ్లి రోజు జరపలేరు. అందుకే నా చివరి కోరిక తీరదని ఫిక్స్ అయిపోయానని కనకం అంటుంది. ఇక ఆలోచించి.. రాజ్ ఒప్పుకుంటాడు. దీంతో కనకం ప్లాన్ సక్సెస్ అవుతుంది.

నమ్మని కావ్య..

రాజ్ అలా వెళ్లగానే.. కావ్య వస్తుంది. ఏంటి అది ఆయన కారేనా.. ఇక్కడి ఎందుకు వచ్చారు? అని అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు వెళ్లి ఫోన్ చేసి అడగమని కనకం అంటుంది. అమ్మా ఈ ఎక్స్‌ట్రాలే వద్దు.. భార్య పుట్టింట్లో ఉంటే ఏదో ప్రేమ కలిగి వచ్చాడని కనకం అంటుంది. నువ్వు నమ్ము.. నేను నమ్మను.. అని కావ్య అంటుంది. ఆ తర్వాత వెంటనే అపర్ణ, ఇందిరా దేవిలకు ఫోన్ చేసి ప్లాన్ సక్సెస్ అని చెబుతుంది. దీంతో అపర్ణ, ఇందిరా దేవిలు సంతోష పడతారు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..