Brahmamudi, December 12th Episode: ఆస్తి మొత్తం కావ్యకే.. కోర్టుకు ఎక్కుతానన్న ధాన్యలక్ష్మి..
సుభాష్ పిలిస్తే లాయర్ ఇంటికి వస్తాడు. ఆస్తి పంచాలని సుభాష్ అంటే.. సీతారామయ్య వారం రోజుల క్రితమే తన వీలునామా సిద్ధం చేసినట్టు చెబుతాడు లాయర్. అందరి ముందు సీతా రామయ్య రాసిన వీలునామాను చదువుతాడు. ఆస్తి మొత్తం కావ్య పేరు మీద రాయడంలో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మావయ్య గారు తీసున్న నిర్ణయం కరెక్ట్ కాదని కావ్య అంటే.. డాడీ తీసుకున్న నిర్ణయమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరికి వారు ఆస్తి కావాలని గొడవ పడుతున్నారు తప్ప.. కలిసి ఉండాలని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. తాతయ్య తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటారు. నిన్ను కంపెనీకి సిఈవో చేశారు నన్ను అడిగారా.. ఎవరికి పాటికి వాళ్లు నిర్ణయాలు తీసుకున్నాక నేను చేసేది ఏమీ లేదని రాజ్ అంటే.. మీరు ఈ ఇంటి వారసుడు అండి. ఒక్కసారి విడిపోతే తిరిగి కలవడం ఎంత కష్టమో మీకు కూడా తెలుసని కావ్య అంటుంది. చూడు కళావతి నువ్వు చెబుతుంటే అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లవాడిని కాదు. కానీ ఇక్కడ పరిస్థితులు అన్నీ నా చేయి దాటి పోయాయి. నా చేతుల్లో ఏమీ లేదని రాజ్ అంటాడు. ఇక ధాన్యలక్ష్మిని పొడుగుతుంది రుద్రాణి. శభాష్ ధాన్యలక్ష్మి.. ఇన్నాళ్లకు నువ్వు అనుకున్నది సాధించావు. ఇన్ డైరెక్ట్‌గా నా కొడుకుకు కూడా అన్యాయం జరగకుండా కాపాడావని అంటుంది. లేకపోతే.. నాకు రెండు కోట్లు ఇవ్వమంటే ఇవ్వనంటాడా.. అందుకే ఆస్తి కోసం గొడవపడ్డాను.. ఇందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలని ధాన్యలక్ష్మి అంటుంది.
రుద్రాణికి ధాన్యలక్ష్మి థాంక్స్..
అప్పుడే ప్రకాశం వచ్చి.. థాంక్స్ కాదే.. కాళ్లు కడిగి నెత్తిమీద జల్లుకో. రోజురోజుకూ దీని మాయలో పడి చెడిపోతున్నావ్. ఏదో నువ్వు సాధించేశావని గర్వపడుతున్నావు. కానీ ఏం కోల్పోతున్నావో తెలిసికోలేక పోతున్నావని ప్రకాశం అంటాడు. ఏంటి అన్నయ్యా అలా మాట్లాడుతున్నావు.. నీ కోడుక్కే న్యాయం జరుగుతుంది కదా అని రుద్రాణి అంటే.. ఛీ నోర్ముయ్.. ఇంకొక్క మాట మాట్లాడితే నీ పళ్లు రాలతాయని తిడతాడు ప్రకాశం. రుద్రాణిని ఎందుకు కొడతారు? అని ధాన్యలక్ష్మి అడిగితే.. ఈ రోజు నువ్వు ఆస్తి గురించి గొడవ పడ్డావు. దీని వల్ల ఇల్లు కూడా ముక్కలు అవ్వచ్చు. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఎంత తప్పు చేశావో నీకు అర్థమవుతుంది. ఒంటరిగి నువ్వు మిగిలిపోయి ఏడ్చే రోజు వస్తుంది. ఈ రుద్రాణీయే నిన్ను ముంచేస్తుందని ప్రకాశం తిడతాడు.
రాజ్ బాధ..
ఇక తెల్లవారుతుంది. అందరూ లాయర్ కోసం ఎదురు చూస్తారు. అప్పుడే రాజ్ పై నుంచి దిగి ఆఫీస్‌కి వెళ్తాడు. ఆగు రాజ్ ఎక్కడికి వెళ్తున్నావ్? లాయర్ వస్తారు కదా అని ధాన్యలక్ష్మి అంటే.. వచ్చి ఏం చేస్తాడు? ఎవరికి వాళ్లు బ్రతుకుదాం అనుకున్నారు కదా.. అందుకు అన్ని ఏర్పాట్లు చేసి పోతాడు. రక్త సంబంధం కన్నా.. వంశ గౌరవం కన్నా ఆస్తులే ముఖ్యమని అన్నీ ముక్కలు చేసి పోతాడు. ఆ శిథిలాలను ఏరుకోవడానికి నేను సిద్ధంగా లేను అని రాజ్ అంటే.. ఇందులో నీకు కూడా వాటా వస్తుందని రుద్రాణి అంటే.. ఎందులో అత్తా.. స్వార్థంలోనా.. మహా వృక్షాన్ని కూల్చేసి.. కొమ్మను ఒకరు.. రెమ్మను ఒకరు పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో.. కానీ మీరు ఒకటి గుర్తించడం లేదు. ఆ మహా వృక్షం భూగర్భంలో వేర్లు ఉన్నంత వరకే పచ్చగా ఉంటుంది. అది కూల్చేస్తే.. వృక్షం వాడిపోతుంది. అది మీరు గమనించడం లేదని రాజ్ అంటాడు. ఇప్పటికైనా ఆలోచించమని ధాన్యలక్ష్మిని హెచ్చరిస్తాడు ప్రకాశం. అయినా వినిపించుకోని ధాన్యలక్ష్మి నా కొడుక్కి న్యాయం జరుగుతుందని అంటుంది. రాజ్ వెళ్తుంటే.. కావ్య, అపర్ణలు ఆపి కూర్చోమంటారు. మమ్మీ దేనికి ఉండాలి? దేనికి సాక్ష్యంగా ఉండాలని అడుగుతాడు. అప్పుడే లాయర్ వస్తాడు.
మీకు హక్కు లేదు..
లాయర్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. పిల్లల పేర్లు మీద ఆస్తి పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దాని ప్రకారం ఆస్తి ముక్కలు చేసి అందరికీ సమానంగా పంచమని సుభాష్ అంటాడు. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అని లాయర్ అడిగితే.. నేనే అని సుభాష్ అంటాడు. పెద్దాయనను కాదని ఎందుకు తీసుకున్నారు? సారీ సర్ ఆ హక్కు మీకు లేదని లాయర్ అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏ హక్కు అని సుభాష్ అడిగితే.. ఈ ఆస్తిని ముక్కలు చేసి వాటాలు పంచే హక్కు మీకు లేదు. మీకే కాదు ఈ ఇంట్లో ఎవరికీ లేదని లాయర్ అంటాడు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మేము చెప్పింది చేయడమే మీ పని అని రుద్రాణి అంటుంది. మీ నాన్న గారు మీతో ఏమీ చెప్పలేదా అని లాయర్ అడిగితే.. ఏ విషయం గురించి అని సుభాష్ అంటాడు. వారం రోజుల క్రితమే వీలు నామా రాశారని లాయర్ అంటాడు. ఆ వీలునామా మీ దగ్గర ఉందా? అని ఇందిరా దేవి అడుగుతుంది.
ఆస్తి అంతా కావ్య పేరు మీదే..
ఉంది అమ్మా.. ఎప్పటికైనా ఈ విషయం మీకు తెలియాలి కదా.. అందుకే చెబుతానని లాయర్ అంటాడు. దీంతో రుద్రాణి కంగారు పడుతూ ఉంటుంది. సీతారామయ్య గారు మంచాన పడినా.. లేదంటే జరగ రానిది జరిగినా ఈ వీలునామా బయట పెట్టమన్నారు. ఇక వీలునామాలో.. నా ఇష్ట పూర్తిగా నా ఆస్తి మొత్తం నా మనవరాలు.. ఈ ఇంటి వారసురాలు కావ్య పేరు మీద రాసినట్టు సీతారామయ్య రాస్తాడు. ఆస్తులు అమ్ముకోవడానికి వీలు లేదని, సర్వ హక్కలు కావ్యకు ఉన్నాట్టు వీలునామా సిద్ధం చేస్తాడు. ఈ విషయం విని మొదట అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత అపర్ణ, ఇందిరా దేవిలు సంతోషిస్తారు. అన్యాయం.. ఇంత ఆస్తి బయట నుంచి వచ్చిన కావ్య పేరు మీద రాయడం ఏంటి? అని ధాన్యలక్ష్మి అంటుంది. ఎందుకు అంత ఆవేశ పడకే ముద్దుల పెళ్లామా అని ప్రకాశం అంటాడు. అదీ నా బావ అంటే.. ఆయన పెద్దరికాన్ని, దూర ఆలోచనను చూస్తే గర్వంగా ఉంది. శభాష్ బావా అని ఇందిరా దేవి అంటే.. ఏంటి అత్తయ్యా గర్వంగా ఉండేది.. మా నోట్లో మట్టి కొడతారా అని ధాన్యలక్ష్మి అంటుంది.
అందరం కలిసి ఉండాలని ఆయన ఉద్దేశం..
ఇక రుద్రాణిని ఓ ఆట ఆడుకుంటుంది స్వప్న. ఏంటి ఈ అన్యాయం.. ఎందుకు ఇంత పక్షపాతం? ఇంత ఆస్తి బయట నుంచి వచ్చిన కావ్య పేరు మీద రాయడం ఏంటి? ఆ మాటకు వస్తే నేనూ బయట నుంచి వచ్చాను.. నువ్వూ బయట నుంచే వచ్చావు.. అలాగే కావ్య కూడా వచ్చిందని అపర్ణ అంటే.. అక్కా నీ కోడలి పేరు మీద ఆస్తి రాసే సరికి నువ్వు పొంగిపోతున్నావేమో.. మావయ్య గారు ఆస్తి నా పేరు మీద రాయకపోయినా.. బావ గారి పేరు మీద అయినా రాసి ఇచ్చినా బాగుండేది. ఆఖరికి రాజ్ పేరు మీద కూడా రాయకుండా.. కావ్య పేరు మీద రాయడంలో మావయ్య గారి ఉద్దేశం ఏంటి? అని ధాన్యలక్ష్మి అడిగితే.. ఇంకా అర్థం కాలేదా ధాన్యలక్ష్మి.. మావయ్య గారు చాలా దూరం ఆలోచించే ఈ వీలు నామా రాశారు. ఆయన ఉద్దేశం ఒక్కటే.. మనం అందరం కలిసి ఉండాలని అపర్ణ అంటుంది.
ధాన్యలక్ష్మి రచ్చ..
నేను ఒప్పుకోను.. మీరే సరిగ్గా ఉంటే మీ పేరు మీదనే రాసేశారు కదా.. అత్తయ్యా ఏంటి ఇదంతా? మావయ్య గారు ఎందుకు ఇంత తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ధాన్యలక్ష్మి అంటే.. పళ్లు రాలగొడతాను.. ఏం అనుకుంటున్నావ్ నీ గురించి? నువ్వు మహా రాణి.. ఆవిడ పట్టపు రాణి అనుకుంటున్నారా.. నా భర్త నిర్ణయాన్నే తప్పు పట్టేంత గొప్పదానివి అయిపోయావా.. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. అన్నీ ఆలోచించే తీసుకుంటారు. ఎవరు ఏమీ చేయలేరని ఇందిరా దేవి అంటే.. అవునా సరే నేను కోర్టుకు వెళ్లి తేల్చుకుంటాను. న్యాయంగా తాతగారి ఆస్తి మనవల్లకే చెందుతుంది.. ఆయన భార్యకే చెందుతుంది. మీ నాన్నగారికి మతి పోయి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ధాన్యలక్ష్మి అంటుంది. ఏంటిది.. ఎక్కడి నుంచో వచ్చిన ఈ మహా తల్లి మోచేతి నీళ్లు తాగి బ్రతకాలా అని రుద్రాణి అంటే.. ఇన్నాళ్లూ మీరు అలాగే బ్రతికారు కదా అని స్పప్న అంటుంది. నేను ఏంటో మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. కోర్టుకు ఎక్కి నా కొడుకు వాటా రాబట్టుకుంటానని ధాన్యలక్ష్మి అంటుంది. ముసలోడు మనకు అన్యాయం చేశాడని రుద్రాణి అనుకుంటుంది. ఇక కావ్య వెళ్లి కృష్ణుడిని ప్రార్థిస్తుంది. ఇక ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..