Brahmamudi, August 30th Episode: రుద్రాణి దెబ్బకు అడ్డంగా బుక్కైన అక్కాచెల్లెళ్ళు.. వాళ్లే ముఖ్యమన్న రాజ్..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్‌ ఆడే నాటకాన్ని నిజమని నమ్మి స్వప్న.. కావ్యకు చెబుతుంది. దీంతో రాహుల్‌ బండారం బయట పెట్టాలని కావ్య అనుకుంటుంది. మరోవైపు ఇంటిని పోషించడానికి ఏం చేయాలా అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పక్కన ఉన్న ఆటో చూసి కిందకు వెళ్తాడు. రోజుకు ఆటో నడిపితే ఎంత వస్తుంది సర్? అని అడుగుతాడు. అది విన్న ఆటో అతను షాక్ అవుతాడు. మీరు ఆటో కంపెనీని కొనే వాళ్లలా కనిపిస్తున్నారు కానీ..

Brahmamudi, August 30th Episode: రుద్రాణి దెబ్బకు అడ్డంగా బుక్కైన అక్కాచెల్లెళ్ళు.. వాళ్లే ముఖ్యమన్న రాజ్..
BrahmamudiImage Credit source: Disney Hotstar
Follow us
Chinni Enni

|

Updated on: Aug 30, 2024 | 8:26 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్‌ ఆడే నాటకాన్ని నిజమని నమ్మి స్వప్న.. కావ్యకు చెబుతుంది. దీంతో రాహుల్‌ బండారం బయట పెట్టాలని కావ్య అనుకుంటుంది. మరోవైపు ఇంటిని పోషించడానికి ఏం చేయాలా అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పక్కన ఉన్న ఆటో చూసి కిందకు వెళ్తాడు. రోజుకు ఆటో నడిపితే ఎంత వస్తుంది సర్? అని అడుగుతాడు. అది విన్న ఆటో అతను షాక్ అవుతాడు. మీరు ఆటో కంపెనీని కొనే వాళ్లలా కనిపిస్తున్నారు కానీ.. ఆటోని నడిపే వాళ్లలా కనిపించడం లేదని అంటాడు. ప్రస్తుతం నా పొజిషన్ బాలేదు. ఇంటిని చూసుకోవాలని కవి అంటే.. అర్థమైంది కానీ ముందు నన్ను నువ్వు సర్ అని పిలవడం మానేయి. పేరు పెట్టు పిలువు. నేను ఓ సేటు నెంబర్ ఇస్తాను. అతను ఆటో రెంట్‌కి ఇస్తాడు. ఆటో అద్దె, పెట్రోల్ పోయినా.. రోజుకు ఓ 500 అయినా మిగులుతుందని చెప్పగా.. కళ్యాణ్ ఎంతో సంతోష పడతాడు.

డ్రామా స్టార్ట్ చేసిన రాహుల్..

ఆ తర్వాత అందరూ హాలులో కూర్చుని ఉంటారు. రుద్రాణి కూడా అక్కడే నిలబడి చూస్తూ.. రాహుల్ కోసం ఎదురు చూస్తాడు. అప్పుడు రాహుల్ పై నుంచి వచ్చి ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్తాడు. అప్పుడే కావ్య, స్వప్నలు వచ్చి రాహుల్‌ని ఆగమని అంటారు. ఏమైందని రుద్రాణి ఏమీ తెలీకుండా అడుగుతుంది. తాతయ్య గారూ ఆయన స్థానంలో రాహుల్‌ని కూర్చోబెడతాను అంటే వద్దు అన్నాను కదా.. అలా నేను ఎందుకు అన్నానో మీకు ఇప్పుడు తెలుస్తుంది. ఏయ్ కళావతి ఏంటి అలా మాట్లాడుతున్నావ్? తెలిసీ తెలియకుండా అలా ఎందుకు మాట్లాడుతున్నావ్? అని రాజ్ బెదిరిస్తాడు. మధ్యలో అపర్ణ, ఇందిరా దేవిలు రాజ్‌ని అడ్డుకుంటారు.

రాహుల్‌ ఆఫీసుకు వెళ్లడానికి వీల్లేదు..

ఈ రోజు నుంచి రాహుల్‌ ఆఫీసుకు వెళ్లడానికి వీల్లేదని కావ్య అంటుంది. ఏంటి పిల్ల జమీందార్‌లా ఆర్డర్లు వేస్తున్నావ్.. ఇదంతా నీ అయ్య సంపాదించినట్టు అని రుద్రాణి అంటే.. ఈ ఫ్రాడ్ అయ్య కూడా ఇదంతా సంపాదించిన పెట్టలేదు కదా అత్తా.. నువ్వెందుకు తల్లి జమీందార్‌లా తల ఎగరేసుకుంటూ మాట్లాడుతున్నావ్? అని స్వప్న అంటుంది. అసలు కారణం ఏంటి? అని రాజ్ అడుగుతాడు. ఎంతో చరిత్ర ఉన్న మన కంపెనీకి రాహుల్‌ వల్ల మచ్చ రాబోతుంది. దాని వల్ల వ్యాపారానికే కాదు ఈ కుటుంబానికే పెద్ద నష్టం వస్తుందని కావ్య చెబుతుంటే అందరూ షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావ్ కళావతి? మాట్లాడే ముందు ఆలోచించాలని రాజ్ అంటాడు.

ఇవి కూడా చదవండి

రాహుల్, రుద్రాణిలను ఏకి పారేసిన దుగ్గిరాల ఫ్యామిలీ..

రాహుల్ నేనే చెప్పనా.. నువ్వు చెప్తావా? అని కావ్య అంటుంది. ఏంటి మీరు చెప్పేది.. ఏం పనీ పాటా లేదా.. అనవసరంగా నా మీద నింద వేయాలని చూస్తున్నారా అని రాహుల్ అంటాడు. అసలు ఏం చేశాడని సుభాష్ అడుగుతాడు. ఈ రాహుల్ అక్రమ బంగారాన్ని మన కంపెనీ పేరు మీద కొనడానికి సిద్ధం అయ్యాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. అది బయట పడితే వందేళ్ల చరిత్ర ఉన్న మన కంపెనీ పరువు పోతుందని కావ్య అంటుంది. దీంతో అపర్ణ, సుభాష్, ప్రకాశం, సీతారామయ్య, ధాన్య లక్ష్మి, ఇందిరా దేవిలు ఒకరి తర్వాత మరొకరు రాహుల్, రుద్రాణిలను ఏకి పారేస్తారు. ఆపండి.. నేనే చేశాను అంటున్నారు ఏంటి? నేను అక్రమంగా కొంటున్నాను అని మీకు ఇన్ ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది.. సాక్ష్యం కావాలి కదా అని రాహుల్ అంటాడు. ఆ సాక్ష్యం నీ చేతిలోనే ఉందని కావ్య అంటుంది. నాకు అంతా తెలుసు.. అందులో ఏముందో అంతా చదివానని స్పప్న ఆ ఫైల్ తీసుకుని రాజ్‌ని చూడమని అంటుంది.

రాహుల్ ఏ తప్పూ చేయలేదు.. షాక్‌లో అక్కాచెల్లెళ్లు..

ఇందులో ఏముంది? ఏం తప్పు ఉంది? రెగ్యులర్‌గా గోల్డ్ సప్లయ్ చేసేది కదా.. ఇందులో దొంగ బంగారం కొంటున్నట్టు లేదు కదా.. డాక్యుమెంట్స్ అన్నీ సరిగానే ఉన్నాయి కదా అని రాజ్ అంటాడు. దీంతో స్వప్న ఆ ఫైల్ లాక్కుని అంతా చూస్తారు. కానీ అందులో ఏమీ ఉండదు. ఆ ఫైల్ మార్చేశాడు.. నేను నా కళ్లతో చూశానని స్వప్న అంటుంది. స్టాపిట్.. ఏం ఆటలుగా ఉందా? రాజ్ ప్లేస్‌లో రాహుల్ని కూర్చో పెట్టడంతో కావ్యకు భగభగా మండిపోతుంది. అందుకే నా కొడుకు మీద ఇంత పెద్ద నింద వేయాలని చూసింది. దీంతో కావ్య గట్టిగా అరుస్తుంది. హేయ్ నోరు మూసుకుని ఉండు.. బుద్ధి, జ్ఞానం ఉన్నదానివి అయితే ఇంత నీచానికి దిగజారవు అని రుద్రాణి అంటుంది. రుద్రాణి ఆపు.. ఏంటి గుక్క తిప్పుకోకుండా అరుస్తున్నావ్ ఏంటి? స్వప్న కళ్లారా చూశాను అంటుంది. నిజంగానే నీ కొడుకు ఆ ఫైల్ మార్చవచ్చేమో.. ఎవరికి తెలుసు అని అపర్ణ అంటుంది.

నీ కోసం నా ఫ్యామిలీని వదులుకోను..

దీంతో రాహుల్ డ్రామా స్టార్ట్ చేస్తూ.. కావాలనే నన్ను బ్లేమ్ చేస్తున్నారా? నేనే కంపెనీకి వెళ్తున్నా.. ఏదన్నా జరిగితే నా మీదకే వస్తుంది కదా అని అంటాడు. ఆ తర్వాత కావ్య మాట్లాడుతున్నా.. రాజ్ బలవంతంగా పక్కకు తీసుకెళ్తాడు. ఏంటి ఇదంతా? ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నావ్? ఫ్యామిలీని ముక్కలు చేద్దాం అనుకుంటున్నావా? ఎప్పుడూ ప్రతీ విషయంలో తలదూర్చుతూ గొడవలు తీసుకొస్తున్నావు. నువ్వు ఒక సమస్యలా తయారై పోతున్నావని రాజ్ అంటే.. నేనా.. వాళ్లు తప్పు చేస్తున్నారు. తెలివిగా తప్పించుకున్నారు. నేను మీ శత్రువును కాను.. నేను చెప్పేది వినకపోతే ఎలా.. మా అక్క నాతో అబద్ధం చెబుతుందా అని కావ్య అంటే.. నువ్వు ఎప్పుడూ ఇంతే.. ఏం ఆధారం ఉందని రాహుల్ మీద నింద వేశావు. ఏదన్నా జరిగితే నా దాకా రాకుండా పోదని రాజ్ అంటాడు. మీరెందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదని కావ్య అంటే.. నీ కోసం నా కుటుంబ సభ్యుల్ని వదులు కోనని కావ్య అంటుంది.