Brahmamudi, May 6th episode: రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌ని బెదిరించిన వ్యక్తి.. బిడ్డ గురించి చెప్తాడు. నేను బయటకు వచ్చేసరికి మాయ మేడమ్, రాజ్ సర్ మాట్లాడుకుంటున్నారు. నాకు అనుమానం వచ్చి వినడం మొదలు పెట్టాను. బెదిరించడానికి వచ్చావా అని మాయ అడిగితే.. బెదిరించడం ఆపడం అని చెప్పడానికి వచ్చాను అని రాజ్ అంటాడు. అలా ఆపితే నాకూ, నా బిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది? ఎంత కాలం ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నిందలు మోస్తూ బ్రతకాలి. ఇప్పుడు నువ్వు వచ్చి మాత్రం..

Brahmamudi, May 6th episode: రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న..
Brahmamudi
Follow us

|

Updated on: May 06, 2024 | 12:30 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్‌ని బెదిరించిన వ్యక్తి.. బిడ్డ గురించి చెప్తాడు. నేను బయటకు వచ్చేసరికి మాయ మేడమ్, రాజ్ సర్ మాట్లాడుకుంటున్నారు. నాకు అనుమానం వచ్చి వినడం మొదలు పెట్టాను. బెదిరించడానికి వచ్చావా అని మాయ అడిగితే.. బెదిరించడం ఆపడం అని చెప్పడానికి వచ్చాను అని రాజ్ అంటాడు. అలా ఆపితే నాకూ, నా బిడ్డకు న్యాయం ఎలా జరుగుతుంది? ఎంత కాలం ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా నిందలు మోస్తూ బ్రతకాలి. ఇప్పుడు నువ్వు వచ్చి మాత్రం ఏం సాధిస్తావ్. ఇక నాకు ఏ దారీ లేదు. అందుకే ఈ బిడ్డతో పాటు మీ ఇంటికి వచ్చి జరిగింది అంతా చెప్తాను అని మాయ అంటుంది. ప్లీజ్ తొందర పడకు.. దయచేసి ఏ గొడవా చేయకు. నేను తప్పకుండా ఏదో ఒక దారి వెతుకుతాను అని రాజ్ అంటే.. మళ్లీ నా నోరు మూయించాలని చూస్తున్నారా.. మర్యాదగా నన్నూ, నా బిడ్డను తీసుకెళ్లి మీ ఇంట్లో వాళ్ల ముందు జరిగింది చెప్పాలి. ఈ బిడ్డను వారసుడిగా పరిచయం చేయాలి అని మాయ అంటే.. అంతా నువ్వు అనుకుట్టే జరుగుతుంది. ఒకటే సారి నిన్నూ, ఈ బిడ్డను తీసుకెళ్లలేను. ముందు బిడ్డను తీసుకెళ్లి ఇంటి వారసుడిని చేస్తాను అని రాజ్ చెప్తాడు. సరే అని అంటుంది మాయ.

కావ్య, అప్పూలకు తెలిసిన మాయ – రాజ్‌ల నిజం..

ఇక జరిగింది విని కావ్య, అప్పూలు షాక్ అవుతారు. ఆ తర్వాత ఆ మాయ ఎక్కడ ఉందో తెలుసా? అని కావ్య అడిగితే.. తెలీదు మేడమ్.. ఆవిడ ఇచ్చిన అడ్రెస్, ఫోన్ నెంబర్ అంతా ఫేక్ మేడమ్ అని చెప్తాడు ఆ వ్యక్తి. ఇక బయటకు వెళ్లిన కావ్య.. ఆలోచనలో పడుతుంది. ఏంటి అక్కా ఇది.. నువ్వు ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. నువ్వు బావ మీద అంత నమ్మకం పెట్టుకున్నావ్.. కానీ బావ చూశావా నిన్ను ఎంత మోసం చేశాడో.. ఇంకేంటి అక్కా ఆలోచిస్తున్నావ్.. ఇంటికి వెళ్లి బావని కడిగి పారేయ్.. అని అప్పూ అంటే.. అప్పూ మనకు ఇంకా పూర్తి నిజం తెలీదు.. సగమే తెలిసింది.. కాబట్టి అదేంటో తెలుసుకోవాలి. నాకు శ్వేత చెప్పింది ఆయన నాతో మనసు విప్పి మాట్లాడాలి అనుకున్నారట. అంటే.. ఆఫీస్ నుంచి బయటకు వచ్చేంత వరకూ ఆయనకు ఆ బిడ్డ గురించి ఏమీ తెలీదని కావ్య అంటే.. ఆఫీసులోనే ఏదో జరిగింది అంటావా అని అప్పూ అంటుంది. అవును అది తెలుసుకోవాలి అంటే.. అక్కడికే వెళ్లాలని కావ్య అంటే.. సరే అక్కా అని అప్పూ అంటుంది.

స్వప్న దెబ్బ.. అబ్బా అంటోన్న రుద్రాణి..

మరోవైపు స్వప్న ఇచ్చిన షాక్‌కి సేటు రివర్స్ తిరుగుతాడు. దీంతో రాహుల్, రుద్రాణి తెగ బాధ పడుతూ ఉంటారు. నేను కొంచెం ఆపకపోయి ఉంటే.. ఆ వడ్డీ వాడు అంతా అందరి ముందూ వాగేసేవాడు. కొంచెంలో తప్పించుకున్నామని రాహుల్ అంటే.. అసలు వాడు పేపర్స్ ఎందుకు ఇచ్చాడురా.. నాకు తెలిసి ఆ స్వప్న ఏదో చేసిందని నాకు అనుమానంగా ఉందని రుద్రాణి అంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దాని గురించి కాదు.. ఆ వడ్డీ వాడు ఇచ్చిన కోటి రూపాయల గురించి.. ఇప్పుడు మనం వెంటనే ఆ డబ్బులు ఇవ్వక పోతే అందరి ముందూ నిజం చెప్తానని బెదిరించాడు. ఇంతకీ ఎక్కడ పెట్టావ్ ఆ డబ్బు.. మామ్ పరుల సొమ్ము పాము లాంటిది.. అది కాటేయక ముందే వెళ్లి వాడి డబ్బు ఇచ్చేద్దాం అని రాహుల్ అనే లూపే.. అప్పుడే స్వప్న ఫోన్‌లో మాట్లాడుతూ వస్తుంది. నేను దుగ్గిరాల ఇంటి కోడలిని.. నేనొక కార్ కొన్నాను అంటే.. అందరూ కుళ్లుకునేలా ఉండాలి. మినిమమ్ నా కారు ఖరీదు కోటి రూపాయలు ఉండాలి. వినబడుతుందా? కోటి రూపాయలు అని కావాలనే గట్టిగా అరుస్తుంది స్వప్న. వెంటనే అనుమానం వచ్చిన రుద్రాణి, రాహుల్‌లు లాకర్ ఓపెన్ చేసి.. డబ్బు ఉందో లేదో చెక్ చేస్తారు. తీరా చూసేసరికి గోవింద నామం ఉంటుంది. అది చూసి రుద్రాణి, రాహుల్‌లు షాక్ అవుతారు. ఇక జరిగి్ంది గుర్తుకు తెచ్చుకుని రుద్రాణి చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

సస్పెన్స్‌గా ఫిబ్రవరి 18.. ఆ రోజు ఏం జరిగింది..

ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ, కావ్యలు కలిసి ఆఫీస్‌కి వస్తారు. అప్పుడే శ్వేత దగ్గరకు వెళ్లి ఆఫీస్‌కి మీ బాస్ తప్ప ఇంకెవరైనా వచ్చారా? అని అందర్నీ అడుగుతుంది కావ్య. చివరికి సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి.. మా మ్యారేజ్ డే రోజు నీకు గుర్తుందా? అని కావ్య అడిగితే.. గుర్తింది మేడమ్ ఆ రోజు బట్టలు కొనుక్కోమని రాజ్ సర్ డబ్బులు కూడా ఇచ్చారు అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం ఆఫీస్‌ ‌లో సర్ ని కలవడానికి ఎవరు వచ్చారు? అని కావ్య అడిగితే.. ఇక అప్పూ తన స్టైల్లో అడుగుతుంది. లేదని సెక్యూరిటీ చెప్తాడు. తర్వాత సీసీ కెమెరా చెక్ చేస్తారు కావ్యలు. ఇందేటి ఫుటేజ్ మిస్ అయిందని కావ్య అడిగితే.. రాజ్ సర్ డిలీట్ చేశారు. అవును సర్ డిలీట్ చేసి.. హడావిడిగా కారు ఎక్కి వెళ్లి పోయారు అని సెక్యూరిటీ అంటాడు. అప్పుడే ఐడియా ఇస్తుంది అప్పూ. ఆ హార్డ్ డిస్క్ ఉంటే వాటిని రికవరీ చేయవచ్చని చెప్తుంది. కానీ ఈ విషయం చెప్పొద్దని బెదిరిస్తారు.

అపర్ణ రచ్చ..

ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. కావ్య వడ్డిస్తుంది. అప్పుడే రాజ్ వచ్చి కూర్చోవడంతో.. అపర్ణ లేస్తుంది. ఎందుకు లేచారు? అని కావ్య అడిగితే.. తెలీదా అని అపర్ణ అంటుంది. నిజంగానే తెలీదు అత్తయ్య గారూ.. మీ అబ్బాయి వచ్చి భోజనం చేయడానికి.. మీతో కూర్చుని తినడం వల్ల ప్రళయం వస్తుందా? అని కావ్య ప్రశ్నిస్తుంది. నీ అనవసరం అని అపర్ణ అంటుంది. అప్పుడు కావ్యకు సపోర్ట్ చేస్తాడు సుభాష్. రెండు రోజులు.. ఇంట్లో నుంచి వెళ్లి పోవడానికి వాడికి నేను ఇచ్చిన గడువు రెండు రోజుల్లో ముగిసిపోతుంది. ఇన్ని రోజులూ నిజం చెప్పని వాడు ఇప్పుడు చెప్తాడని నాకు నమ్మకం లేదు. బయట పడటం తప్ప.. వాడికి వేరే మార్గం లేదు. పాతికేళ్లు ప్రాణం పెట్టి పెంచుకున్నా.. అయినా ఈ తల్లి కన్నా వాడికి ఆ కొడుకే ముఖ్యం. ఏం చేస్తాడో వాడి ఇష్టం. కానీ వాడు దూరం అయితే.. ఆ బాధ తట్టుకోవడం అనేది చాలా కష్టం. అందుకే ఇప్పటి నుంచే ఎదురు పడకుండా ఉండాలి అనుకుంటున్నా అని అపర్ణ అంటుంది.

అసలు ఎందుకు ఆయన వెళ్లి పోవాలి?

అసలు ఎందుకు వెళ్లి పోవాలి? అని కావ్య అడుగుతుంది. అని వాడు అడగలేడా.. అడగడం లేదు అంటే.. అడిగే అర్హత లేదనే కదా అని అపర్ణ అంటుంది. ఆయన నేరస్తుడో.. నేరంలో భాగస్తుడో కాలమే నిర్ణయిస్తుంది. ఇలా కుటుంబం నుంచి ఎందుకు వెలి వేస్తున్నారు? అని కావ్య అంటే.. నువ్వేందుకు అంతలా వెనకేసు కొస్తున్నావ్ అని అపర్ణ అడిగితే.. ఇంకా అర్థం కావడం లేదా వదినా.. వాడితో పాటు నీ కోడలు కూడా బయటకు వెళ్లాలి కదా.. అది తన సమస్యా.. అని రుద్రాణి పుల్లలు పెడుతుంది. ఇంత ఆస్తి ఉంది.. ఇంతకాలం ఏం అనుభవించాను? అని కావ్య అడుగుతుంది. ఇంత మాట్లాడుతున్న దానివి ఇంకా ఇక్కడే ఉండటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని రుద్రాణి అంటే.. అవును నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. నీలా మొగుడితో తెగతెంపులు చేసుకుని పుట్టింటికి ఎందుకు వెళ్లిపో లేదా? అని.. తన భర్త ఒక బిడ్డను తీసుకొచ్చి ఇంటి వారసుడు అని చెప్పినా కూడా.. అందరిలా ఆవేశ పడకుండా.. కుమిలిపోకుండా.. ఆ సహనాన్ని చూసి ఆశ్చర్యంగానే ఉంది. నా కోడల్ని పల్లెత్తు మాట అనే అధికారం కూడా నీకు లేదు. నోరు మూసుకుని తిను అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక వచ్చే ప్రోమోలో.. ఆ బాబు రాజ్ బిడ్డ కాదని తెలుస్తుంది. మరి ఆ బిడ్డ ఎవరో చూడాలి.

Latest Articles
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
TSPSC గ్రూప్‌ 4 ఉద్యోగాలకు 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
ఫుట్‌బోర్డ్ ప్రయాణం ప్రమాదం అనేది ఇందుకే.. మహిళ నిండు ప్రాణం..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో టాపర్ ఏపీ కుర్రాడు.. అతని లక్ష్యం ఇదే..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
మైండ్ బ్లాక్ చేస్తున్న అపాచీ బ్లాక్ ఎడిషన్ బైక్స్..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
కౌంటింగ్ ఏర్పాట్లకు ఈసీ చర్యలు.. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?